షష్టిపూర్తి
పి ల్లలను కని, పెంచి, పెద్దచేసి, చదువులు చెప్పిస్తారు తల్లిదండ్రులు. తరువాత పిల్లలకు రెక్కలు వచ్చి ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళే సందర్భాలు ఎక్కువ. ఈ యాంత్రిక యుగంలో ఇది పరిపాటి. తమకు జన్మనిచ్చి, భవిష్యత్తుకు బాటలు వేసిన అమ్మా-నాన్నలకు ఏమిచ్చినా వారి ఋణం తీరదు. అయితే వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చే ఒక అవకాశం షష్టిపూర్తి. అరవై సంవత్సరాలు పూర్తి అయితే అది షష్టి పూర్తి. మన సంస్కృతిలో తండ్రికి జరిగే అరవైయవ జన్మదినం ఈ షష్టిపూర్తి మహోత్సవం. వైదిక సిద్దంతాలను అనుసరించి మానవుని కాల అవధి 120సం. లు గా గుర్తించబడినది. ఈ వేడుకలలో ఆయుష్య హోమం, ముఖ్య విధి. దీనికి నవగ్రహ హోమం, ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం లాంటివి కూడా కలిపి ఆచారిస్తారు. మరి ఇంతటి కార్యక్రమము జరగాలంటే దైవానుగ్రహం సంపూర్ణముగా లభించాలి. దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అని అంటారు. కాని దాన్ని 60 సంవత్సరాలు పూర్తి అయిన స్త్రీ పురుషులు ఎవరయిననూ చేసుకోవచ్చు. ఎందుకంటే, షష్టిపూర్తి అంటే 60 సంవత్సర...