Posts

Showing posts from April, 2018

జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకచక్రంలో రోగ పరిశీలన జాతకంలో లగ్నాధిపతి, లగ్నభావం, షష్టాధిపతి, షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్న వ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది. రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన, వాతావరణం, నీరు మార్చటం వలన, రత్నధారణ వలన, జప దాన హోమాదుల వలన, ఔషదాల వలన, మంత్రోచ్ఛారణ వలన, కాస్మిక్ కిరణాల ద్వారా, కలర్ ధెరపీ ద్వారా, అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును, ముఖ్యంగా ఆదిత్య హృదయం, దుర్గాసప్తశ్లోకి, విష్ణు సహస్త్ర పారాయణం, సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు. అగ్నితత్వ రాశులైన మేషం, సింహం, ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు. రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు. భూతత్వ రాసులైన వృషభం, కన్య, మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు. వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది. వాయుతత్వ రాశులైన మిధునం, తు

ఆరువేలనాటి నియోగులు

ఆరువేలనాటి నియోగులు వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు ‘నియోగులు’. ఇదొక విస్తృతమైన శాఖ. నియోగులలోనే ఆరువేల నియోగులు నందవరీక నియోగులు కరణకమ్మ నియోగులు వెలనాటి నియోగులు తెలగాణ్య నియోగులు ద్రావిడ నియోగులు కరణాలు శిష్ట కరణాలు కాసలనాటి నియోగులు పాకలనాటి నియోగులు ` అని పలు ఉపశాఖలు ఉన్నాయి. ఇదే విషయాన్ని శ్రీ రాణి శివశంకర శర్మ పేర్కొన్నారు. వారు చెప్పినదాని ప్రకారం ‘నియోగులు రెండు రకాలు. ఆరువేల నియోగులూ, నియోగులూ అని. నియోగి అనే పదానికి అర్థం కరణీకం, మంత్రి పదవీ లాంటి లౌకిక కార్యాల్లో రాజులచే వినియోగింపబడినవారు. నియోగులు సంప్రదాయ బ్రాహ్మణులు కారు. వారు పూర్తిగా లౌకిక బ్రాహ్మలు’ అంటారు శ్రీ శర్మగారు. ఆయన దృష్టిలో ‘సంప్రదాయ బ్రాహ్మణులు’ అంటే బహుశా వైదికులు మాత్రమే అయి ఉండవచ్చు. ఆ విషయంలో ఇప్పుడు ఏకీభావం ఉందో లేదో వేరే విషయం. అయితే, ఆయన అదే పుస్తకం 40వ పుటలో ఇంకోమాటా అంటారు: ‘పౌరోహిత్యంమీద కాక, లౌకిక వృత్తులమీద జీవించిన వారే నియోగులు. ఈ నియోగులలో ఆరువేల నియోగులు పెద్ద ఉపశాఖ... వెలనాటి ప్రాంతపు ఆరువేల గ్రామాలకు నియోగింపబడిన బ్రాహ్మణులే ఆరువేల నియోగులు’. శివశంకర శర్మగారు