Posts

Showing posts from December, 2019

తిరుప్పావై ప్రవచనం‎ > ‎ 07 వ రోజు - భగవంతుణ్ణి సేవించటం

తిరుప్పావై ప్రవచనం‎ > ‎ 07 వ రోజు - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము ఆండాళ్ తిరువడిగలే శరణం  పాశురము కీశు కీశెన్ఱెంగుం  ఆనైచ్చాత్తన్  కలందు పేశిన  పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్  మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్ "కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన  పేచ్చరవం కేట్టిలైయో"   పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే  అని బాధతో మట్లాడుతున్నాయి.  నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి,  అంటూ అండాళ్ తల్లి   "ఆనైచ్చాత్తన్"  భరద్వాజ పక్షి గురించి చెబుతుంది. ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాస