Posts

Showing posts from January, 2020

అవస్థాపంచకము

20. అవస్థాపంచకము పరమేశ్వరిని స్తుతిచేసేటప్పుడు జాగ్రస్వప్న సుషుప్తి నాం సాక్షిభూత్ర్యైనమో నమః అన్నారు. అంటే జాగ్రస్వప్న సుషుమ్నలనబడే మూడు అవస్థలకు ఆ పరమేశ్వరి సాక్షి కాని అవస్థలు ఐదు. 1. జాగ్రదవస్థ 2. స్వప్నావస్థ 3. సుషుప్తి 4. తురీయావస్థ 5. తురీయాతీతము. 1. జాగ్రదవస్థ : ఇది మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి ననుభవించేది స్థూలదేహము. ఈ స్థితిలో ఉండే పురుషుణ్ణి వైశ్వానరుడు అంటారు. విశ్వములోని నరులకందరికీ ప్రతీక అయినవాడు. భోగాలు అనుభవించటానికి ఈ దేహమే ఆధారము. జీవి ఈ శరీరంతోనే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. స్థూలశరీరం ఎప్పుడూ జాగ్రదావస్థలోనే అనుభవం పొందుతుంది. అటువంటి స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. జాగ్రదావస్థ ఇతని సంచారస్థానము. ఇతడికి ఏడు అంగములు, పంథానిమిదినోళ్ళు ఉంటాయని మాండూక్యోపనిషత్తు చెబుతోంది. సప్తాంగాలు 1. స్వరము - శిరస్సు 2. సూర్యుడు _ కన్ను 3. వాయువు - ప్రాణం 4, ఆకాశం - శరీరం 5. జలం - మూత్రస్థానం 6. భూమి పాదాలు 7.ఆహవనీయాగ్ని = నోరు ఇతనికి ముఖాలు పంథొనిమిది. ఇక్కడ ముఖము అంటే శిరస్సు కాదు. అనుభవించే సాధనం అవి. జ్ఞానేంద్రియాలు - 5 కర్మేంద్రియాలు - 5 ప్రాణాలు - 5