స్వప్న ఫలితములు
స్వప్న ఫలితములు శుభ స్వప్నములు సూర్యోదయము, సంపూర్ణ చంద్రోదయము,కలలో కనిపించినచో ధనలాభము కలుగును. క్షేత్రదర్శనములు, గురువులు, పుణ్యపురుషులను పూజించినట్లు కలవచ్చిన యెడల సుఖము, సంపదలు కలుగును. నీటిమీద తిరిగివచ్చినట్లు కలవచ్చిన శుభము, పూలతోటలో తిరిగివచ్చినట్లు వచ్చిన స్త్రీ వలన లాభము, పచ్చనిపైరు కలలో వచ్చిన ధనలాభం కలుగును. మలము దేహమున పూసుకొనుచున్నట్లుగా, ఏనుగు మీద ప్రయాణము చేసినట్లును, వచ్చిన అతిత్వరలో ధనలాభం కలుగును. వేశ్యనుగాని, వివాహము జరుగుటనుగాని చూచి, వారితో మాట్లాడినట్లు వచ్చిన శుభకార్యము ప్రాప్తించును. అన్నము, ఆవు, గుఱ్ఱము, ఏనుగు కలలో కనిపించిన పుత్రలాభము, శుభము జరుగును. శత్రువులను జయించునట్లు కనిపించిన విజయము, రక్తము, కల్లు త్రాగునట్లు, తెల్లని వస్త్రములు ధరించినట్లు, పూలు కనిపించిన విద్యాప్రాప్తి, ధనలాభము కలుగును. అశుభ ఫలితములు తలగొరిగినవాడు గాని, విధవను గాని చూచుట అశుభము. నూనెతో తలంటుకొనినట్లు, దూది, ఇనుము కనిపించిన మరణము, ఆ...