Posts

Showing posts from August, 2020

హయగ్రీవ ప్రార్ధన:

హయగ్రీవ ప్రార్ధన: ఙ్ఞానానందమయందేవం, నిర్మల స్ఫటికాకృతిమ్‌, ఆధారం సర్వవిద్యానాం, హయగ్రీవ ముపాస్మహే. విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం!  విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్! దయానిధిం దేవభృతాం శరణ్యం!  దేవం హయగ్రీవమహం ప్రపద్యే!!                    

_*కార్తీకపురాణం - 10

_*కార్తీకపురాణం - 10 వ అధ్యాయము*_ 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 *అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము* ☘☘☘☘☘☘☘☘☘ జనకుడు వశిష్టుల వారిని గాంచి " ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించ వలసినది " గాప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను. జనకా! అజా మీ ళుని విష్ణు దూతలు వైకున్తమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మ రాజు కదా కేగి, " ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజా మీ ళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంట మునకు దీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము' అని భయ కి౦ పితులై విన్నవి౦చు కొనిరి. "జా రా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృ త్తాంతము తెలుసుకొని " ఓహొ! అది యా సంగత