శ్రీ లలిత దేవి చరిత్ర Part-12
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామిజీ విరచిత 💐 🌹 శ్రీ లలిత దేవి చరిత్ర 🌹 Part-12 🌷లలితాసిద్ధుడు - భాస్కరరాయలు🌷 దక్షిణ దేశంలో భాస్కరరాయల వారు ఒక గ్రామంలో ఉండగా మధ్యాహ్నం భోజనానంతరం ప్రతిరోజూ ఇంటిముందున్న అరుగు మీద విశ్రమించే వారు.సాయంకాలం అవుతుండగా ఒక సన్యాసి ఆ వీధిలో నున్న మహాలింగస్వామి దేవాలయానికి వెడుతూ భాస్కరరాయలను చూచేవాడు. విశ్రాంతి తీసుకుంటున్న భాస్కరరాయలు ఆయన రాకను గమనించేవాడు కాదు. ఈ గృహస్థు ఎవరో తనను చూచి లెక్క చేయడం లేదు. యత్యాశ్రమ గౌరవం చూపించడం లేదు అని ఆ సన్యాసి భావించారు. ఒక రోజు అనుకోకుండా ఆ ఆలయానికి భాస్కరరాయల వారు వెళ్ళడం ఆ సమయానికి ఆ సన్యాసి అక్కడ ఉండడం జరిగింది. అక్కడి భక్తులందరి సమక్షంలో ఆ సన్యాసి ధర్మాధర్మములు తెలియని అజ్ఞానివి అని భాస్కరులవారిని తూలనాడాడు. భాస్కరులవారు వినయంతో “స్వామీ! మీ రాకపోకలు నాకు తెలియవు. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను కనుక మిమ్ములను చూడలేదు. కనుక నేను నా ధర్మాన్ని అతిక్రమించలేదు. కాని మీరు ఇప్పుడు మీ ధర్మాన్ని అతిక్రమించారు. వాక్పారుష్యము, దూషణ సన్యాసులకు ఉచితము కాదు కదా ! అయినా ఇప్పుడు చెబుతున్నాను. మీకు నమస్కరించటానికి నాకు అభ్య...