మనుస్మృతి (భాగం-2)
మనుస్మృతి (భాగం-2) వివాహం ఎనిమిది రకాలు: అవి-బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. ఈ ఎనిమిదింటిలో పైశాచం అధమము, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్యములు. ఈ నాలుగు వివాహాలు బ్రాహ్మణునికి మేలయినవి. అసుర, పైశాచ వివాహములు తప్ప మిగిలినవి క్షత్రియులకు సమ్మతములు. రాక్షసము తప్ప మిగిలిన వివాహాలు వైశ్య, శూద్రులకు ధర్మ శాస్త్ర విహితమే అని తెలుసుకోవాలి. వేదాధ్యయనం చేసి, సదాచార వంతుడయిన ఒక బ్రహ్మచారిని తానుగా రప్పించి, మర్యాదలు చేసి, అలంకరించిన కన్యను అతనికి ఒసగడాన్ని బ్రాహ్మణ వివాహం అంటారు. జ్యోతిష్టోమము మొదలయిన యజ్ఞాలలో ఆధ్వర్యం చేసే ఋత్విజునికి కన్యను ఇవ్వడం దైవ వివాహమంటారు. యాగాది సిద్ధికోసంగాని, కన్యకు ఇవ్వడానికిగాని రెండు ఆవులనో, రెండు ఎద్దులనో వరుని నుంచి తీసుకుని శాస్త్ర ప్రకారం వరునికి కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం అంటారు. “మీ ఇద్దరూ కలసి ధర్మమాచరించండని చెప్పి కన్య తల్లిదండ్రులు వరుని పూజించి పిల్లనివ్వడం ప్రాజాపత్య వివాహం అంటారు.” జ్ఞాతులకు, పిల్లకు కావలిసిన ధనం ఇచ్చి తమ ఇష్టంతో పెళ్లిచేసుకోవడాన్ని అసుర వివాహమంటారు. స్త్రీ పురుషు లొకరికొకరు ఇష్ట...