Posts

నలోపాఖ్యానం 💐

Image
                  💐 నలోపాఖ్యానం 💐           💐నలదమయంతుల కధ !!💐 కలి దోషం పోవాలంటే..రోజూ..ఒకసారి ఈ కధ చదవండి. ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు.  ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి "మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి" అని అడిగాడు.  అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా,  నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు.  పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు.  అది విని ధర్మరాజు "మహత్మా! నాకు నలుని కథ వివరించండి" అని అడిగాడు. బృహదశ్వుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు. "నిషధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు....

వేదాంగములు : జ్యోతిషం

వేదాంగములు : జ్యోతిషం వేదముల - నేత్రములు : ఇప్పటి వరకూ శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తమనే నాలుగు వేదాంగాల గురించి చెప్పాను. అయిదవది : జ్యోతిషం. వేదపురుషునికి నేత్రం వంటిది జ్యోతిషం. ఈ శాస్త్రానికి మూడు విభాగాలున్నాయి. లేక, మూడు స్కందాలున్నాయి. అందువల్లనే ఈ శాస్త్రాన్ని ''స్కంద త్రయాత్మక'' మంటారు. స్కందమంటే చెట్టు యొక్క ముఖ్యమైన శాఖ. గర్గ, నారద, పరాశరాదులెందరో జ్యోతిషం గురించి గొప్ప గ్రంథాలు వ్రాశారు. ఈ శాస్త్రంలో ఒక విభాగాన్ని తీసికొని దివ్యశిల్పి మయునకు సూర్యుడు భోదించాడంటూ ఒక గ్రంథముంది. దాని పేరు ''సూర్య సిద్ధాంతం''. దేవతలూ, ఋషులూ రచించిన గ్రంథాలెన్నో యున్నాయి. మానవులు రచించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. వరాహమిహిరుడెన్నో గ్రంథాలు వ్రాసినట్టు ప్రసిద్ధి. ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు కూడ ఈ శాస్త్రానికెంతో సేవ చేశారు. ఇటీవలి కాలంలో సుందరేశ్వర శ్రౌతి అన్న పండితుడు, ''జ్యోతిష కౌస్తుభ'' మన్న గ్రంథాన్ని రచించారు. కళ్లులేని వాడు అంధుడు. దగ్గరగా ఉన్న వాటిని స్పృశించి తెలుసుకోవచ్చు. కాని దూరంగా ఉన్నవాటిని కళ్లతోనే చూడాలి. మానవ నేత్రాలు దగ్గరవాటినీ, ...

వరాహమిహిరుడు!

Image
వరాహమిహిరుడు! . దైవజ్ఞ వరాహమిహిరుడు. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రజ్ఞుడు, మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త.  ఉజ్జయిని లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశం లో జన్మించాడు.  చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానములోని 'నవరత్నాల'లో ఒకడు. . ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ. 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు.  దీనికి సంబ...

🌸 🙏🌅 *||మణి ద్వీపము వర్ణన||*🌅🌸🌷

Image
 🌸 🙏🌅 *||మణి ద్వీపము వర్ణన||*🌅🌸🌷        శ్రీదేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది. తక్షక విషాగ్ని వలన తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించిన కారణంగా జనమేజయ మహారాజు సర్పజాతిపై ప్రతీకార వాంఛతో సర్పయాగం ప్రారంభించాడు. మంత్రశక్తి ప్రభావం వల్ల ఎక్కడెక్కడి పాములూ వచ్చి అగ్నికుండంలో ఆహుతి కాసాగాయి. కొండకోనల్లో, చెట్టుపుట్టల్లో, వాగువంకల్లో తలదాచుకొన్న పాములన్నీ తప్పించుకోలేక యాగాగ్నిలో హుతమై పోవడం ప్రారంభమైంది. తన బిడ్డల దురవస్థ చూచి నాగదేవత చలించి పోయింది. మానసా దేవిని ప్రార్థించింది. మానసా దేవి పంపగా, ఆమె కుమారుడైన ఆస్తీకుడు వచ్చి, జనమేజయునకు నచ్చజెప్పి, సర్పయాగం మాన్పించాడు. ఆ తరువాత జనమేజయునిలో అంతర్మథనం ప్రారంభమైంది. సర్పయాగం వల్ల తనకు సంక్రమించిన పాపం నుండి విముక్తి కోసం, మనశ్శాంతి కోసం తనకు ఏదైనా ఉపాయం చెప్పవలసిందిగా ఆ రాజు వ్యాసమహర్షిని ప్రార్థించాడు. జనమేజయుని ప్రార్థన విని, వ్యాసుడు - అంబా యజ్ఞము చేయవలసిందిగా అతనికి సూచించాడు. అప్పుడు జనమేజయుడు, "ఆ అంబ ఎవరు? ఆమె నివాస స్థానమేది? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమెను దర్శించడానికి కర్తవ్యం ఏమిటి?" అని ఆసక్తితో అడిగాడు...