గురువు రాహుకేతుశనులు

జీవేస రాహౌయది వాసకేతౌ చండాలతాపాప నిరీక్షితౌచేత్
నీచాన్వితే నీచ సమన్వితే వాజీవేద్విజచ్శ దపితాదృశస్యాత్
రాజ యోగ భంగం గురురాహుకేతు యుక్తుడై పాప గ్రహముచేత చూడ పడినా చండాలత్వము పొందును 

ద్వజాహిమందై స్సహితేంద్ర పూజ్యేషు శుక్ర క్షితేవాశశి సూను దృష్టే 
శూద్రోపిచేద్విప్రసమత్వమేతి విద్యాంచ సర్వామధిగమ్యజాతః

గురువు రాహుకేతుశనులతో ఎవరిచేతనైనా కూడి యుండి శుక్రుడుచేగాని బుధుడిచే గాని చూడబడినా జాతకుడు శూద్రుడైనా సకల విద్యలు కల్గి బ్రాహ్మణ సముడగును 

ఉచ్చ క్షేత్రం మేషరాశించ హిత్వారాహౌ  యుక్తేతే ష్వపి ప్రాణనాశః
లగ్నాత్య్వాంత్యౌ పాప యుక్తాయదిస్యాత్సప్తాష్టాంత్యౌ వినసేత్ క్షక్షేణ 

రాహువు తన ఉచ్చ యైన మేష వృషభము కాక తక్కిన రాశులలో జన్మ లగ్న మందున్న ప్రాణ హాని చేయును. లగ్నమునకు ద్వితీయ ద్వాదశములందు గాని సప్తమ అష్టమ ద్వాదశమునందు గానీ పాపులున్న పుట్టగానే క్షణములో ప్రాణము తీయుదురు.

ఘటాళిసింహే ఫణినాధయుక్తే తస్మిన్ విలగ్నేసతిపాప దృష్టే
జాతోయమం  సప్తదశేప్రయాతి వర్షేసు రేజ్యేసయుతే నదృష్టే 

కుంభ వృశ్చిక సింహములు లగ్నమై పాపదృష్టుడైన రాహువు లగ్నగతుడై గురుదృష్టి లేక గురుయుతుడు కాకయున్న జాతకుడు 17వ యేట మరణించును. 
అంటే దీన్ని పట్టి తేలింది ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గురు రాహువుతో కలవడం ముఖ్యమే ముందు ఆయుర్దాయం ఉంటే ఏదైనా అనుభవించడానికి.
....
ధర్మ అర్థ కామ మోక్షములు.... అనేవి మన జ్యోతిష్య శాస్త్రంలో రాశుల కింద ఉంటాయి.  ఇవి ఎలా పుడతాయి అనేటువంటిది జ్యోతిష్యంలో చాలా వివరణాత్మకంగా ఉంటుంది. 

రామాయణము వీటికి వివరణ 
  దశరథుడికి ముగ్గురు భార్యలు ఎందుకు....?
ధర్మార్ధ కామమోక్షములు ఓకే సోర్స్ నుంచి పుట్టవు. వీటికి భిన్నమైన సోర్సెస్ కావాల్సి వస్తాయి. 

అవి సత్వరజోతమో గుణాలు. 
మూడు గుణాలు కలిగిన ముగ్గురు భార్యలతో దశరథుడు అలరారుతూ ఉన్నాడు. 

కౌసల్య సత్వగుణము. సత్వగుణం నుంచి ధర్మం పుడుతుంది. రాముడు సత్వ గుణ ప్రతీక.

సుమిత్ర రజోగుణానికి సంబంధము. ఈమెకి ఇద్దరు పుత్రులు కలిగారు. లక్ష్మణ శత్రుజ్ఞ. వీరు అర్థమునకు కామ్యమునకు ప్రతీకలు. ఇవి రెండూ కూడా రజో గుణం నుంచి పుట్టగలవు. అందుకే మన జ్యోతిష్య శాస్త్రంలో ఈ రజో  గుణం  రెండుగా విడిపోతున్నాయి  అర్థం కామ్యాలుగా.  వీళ్లు లక్ష్మణ శతృజ్ఞులు

కేకయి లేక కైక తమో గుణానికి ప్రతీక. తమో గుణమే మోక్షానికి అడ్డం. దానిని దాటితే కానీ మోక్షం ప్రాప్తం కాదు. భరతుడు రామాయణంలో అందరికంటే ఎక్కువ శాపగ్రస్తుడిలాగా కనబడతాడు. మాన్యులను అడిగితే ఈ మాట నిజమని చెబుతారు. 

ఈ సత్వరజో తమో గుణాలు ధర్మార్థ కామ మోక్షాలుగా.... మారినటువంటి విశేషాలను దశరథుడు చుట్టూ ఉన్న వ్యవహారం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU: