భరణి నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు
*భరణి నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు* మేష రాశిలోని రెండో నక్షత్రమే 'భరణి నక్షత్రము'. ఈ నక్షత్రం స్త్రీ లక్షణం కలిగి ఉన్నప్పటికీ ఉగ్రతారగా గుర్తింపు పొందింది. శుక్రుడు అధిపతిగా ఉన్నాడు కనుక వీరు రజో గుణంతో భాసిల్లుతారు. ఈ నక్షత్రము 4 పాదాలూ మేష రాశిలోనే ఉన్నాయి. భరణి మొదటి పాదము శారీరకంగా శక్తివంతులై ఉంటారు. ఇదే సమయంలో పౌరుషవంతులుగానూ.. శత్రువులను లొంగదీసుకుంటారు. పంతాలు పట్టింపులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, సాంస్కృతి సాంప్రదాయలపైన, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసులుకుంటారు. అయితే తమలోని లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతుంటారు. మొదటి పాదములో గ్రహ దశలు జన్మించినప్పటి నుంచి శుక్ర మహాదశ ఇరవై సంవత్సరాలు, రవి మహాదశ ఆరు సంవత్సరాలు, చంద్ర మహర్దశ పది సంవత్సరాలు, కుజ దశ ఏడు సంవత్సరాలు, రాహు దశ 18 సంవత్సరాలు ఉంటుంది. భరణి రెండో పాదము భరణి రెండో పాదం యందు పంతం, పట్టుదల అధికంగా కనిపిస్తుంది. అనుకొన్నది పూర్తి చేయాలన్న పట్టుదల ఉంటుంది. అయితే ఈ క్రమంలో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడప...