కాశీ క్షేత్రం


                          కాశీ క్షేత్రం 
🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
            *ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
*ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
                      
కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు.  అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం.  అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలుట. ఎంతో పుణ్యంవస్తుందట.

అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తపించి, వెళ్ళాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడూ, విశాలాక్షే కనిపిస్తారు. 

నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని,   విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తల్చుకోండి.  మీ మనసు భక్తి భావంతో నిండుతుంది.  మనసునిండా వున్న ఆ భక్తి భావంతో కాశీని చూడండి.  పురాణ ప్రాశస్త్యం పొందిన కాశీనగరం కనిపిస్తుంది. 

సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది.  బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే.

ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు  ఇక్కడ విద్యాభ్యాసం చేశారు.  మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు.  ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు.   అలాంటి కాశీ క్షేత్ర ఆవిర్భావం  గురించి శివ పురాణంలో ఈ విధంగా వర్ణించారు.

కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరు వుంది.   బ్రహ్మ సృష్టి చెయ్యటానికి తగిన సామర్ధ్యం సంపాదించుకోవటానికి తపస్సు చెయ్యటానికి  స్ధలం కోసం పరమ శివుడు తన త్రిశూలాగ్రంమీద సృష్టించిన భూ భాగమే కాశీ క్షేత్రం. 

దీనిమీద కూర్చుని తపస్సుచేసి పొందిన శక్తితో బ్రహ్మ అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్నీ సృష్టించాడు.  అన్ని గ్రహాలతోబాటు భూమిని కూడా సృష్టించాడు బ్రహ్మ.  దేవతలు, ఋషులు చేసిన ప్రార్ధనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్రానవున్న భూ భాగాన్ని అలాగే భూమిమీదకు దించాడు. 

అదే కాశీ క్షేత్రమనీ, కాశీ పట్టణం, స్వయంగా ఈశ్వర సృష్టేననీ, అందుకనే తర్వాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికిగానీ, ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకుగానీ అక్కడ ఏ విధమైన  అధికారం లేదనీ, కేవలం, శివుడు, అతని పరివార దేవతల ప్రభావం  మాత్రమే ఇక్కడ వుంటుందని పురాణ కధనం. 

అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించినా, ఆయన ప్రభావంలేని కాశీనగరం మాత్రం ప్రళయ సమయంలోకూడా చెక్కుచెదరదని కూడా పురాణ కధనం.

బ్రహ్మ, విష్ణుల కోరికమీద శివుడు కాశీ క్షేత్రంలో భక్తులను కాపాడటంకోసం  జ్యోతిర్లిగంగా వెలిశాడు.

అంతేకాదు.  కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడిచెవిలో పరమశివుడు సాక్షాత్తూ తనే మంత్రోపదేశంచేస్తాడని, అలాంటివారి జన్మ ధన్యమయి మోక్షం లభిస్తుందని నమ్మకం.

ఈ ప్రఖ్యాత పట్టణంమీదు తురుష్కులు అనేకసార్లు దండయాత్రచేసి ఇక్కడి సిరిసంపదలను కొల్లగొట్టారు.  ఈ దాడులతో విశ్వనాధ మందిరంతోసహా అనేక విగ్రహాలు, లింగాలు స్ధానభ్రంశంచెందాయి.  

ప్రస్తుతం వున్న మందిరం క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది.   ఆక్రమణలకు గురిఅయిన తర్వాత ప్రస్తుతంవున్న మందిరం చిన్నదే.  ఆలయంలోపలకూడా ఇరుగ్గానే వుంటుంది.  కాశీలో  విశాల ఆలయాలు, శిల్పకళ కనబడదు.

ఇక్కడ వసతికి హోటల్సేకాకుండా అనేక సత్రాలుకూడా వున్నాయి.  వీటిలో గదులు అద్దెకు ఇవ్వబడుతాయి.  చాలాచోట్ల ఉచితంగా భోజనం పెడతారు…అయితే ముందు మనం చెప్పాలి.  అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చెయ్యలేరు.  వాళ్లు ఉచితంగా పెట్టినా ఇవ్వదల్చుకున్నవారు అన్నదానానికి డబ్బు ఇచ్చిరావచ్చు.

విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు.  వాటిని లోపలకి తీసుకెళ్ళనివ్వరు.
శివాలయాలలో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ, అభిషేకం చేసుకోవచ్చు.  అమ్మవార్ల ఆలయాలలోమాత్రం పూజారులే చేస్తారు.  అమ్మవార్ల ఆలయాలలో శ్రీచక్రానికి కుంకుమపూజ మనం చేసుకోవచ్చు.

మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట.  అంతేకాదు.  కాశీలో చేసిన మంచికానీ, చెడుకానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట.  అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చెయ్యండి.  గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కరలేదుకదా.  అలాగే పితృకార్యాలు చెయ్యదల్చుకున్నవారు వాటిని చెయ్యండి.  మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి.

            ***
‘’ఆది పూజ్యం, ఆది వంద్యం, సిద్ధి బుద్దీశ్వరం ప్రభుం – శుభ, లాభ తనూజం తం, వందేహం,
గణనాయకం‘’

‘’విశ్వేశం, మాధవం దుండిం, దండ  పాణించభైరవం – వందే కాశీం, గుహాం, గంగాం, భవానీం,
మణికర్ణికాం"

‘’న గాయత్ర్యా సమో మంత్రం – న కాశీ సదృశీ పురీ – న విశ్వేశ సమం లింగం – సత్యం, సత్యం, పునః పునః"

‘’కలౌ విశ్వేశ్వరోదేవః – కలౌ వారాణశీ పురీ – కలౌ భాగీరధీ గంగా – కలౌ దానం విశిష్యతే ‘’

‘’కాశ్యాం హి కాశ్యతే కాశీ – కాశీ సర్వ ప్రకాశికా –సాకారీ విదితా ఏవ – తేన ప్రాప్తాహి కాశికా ‘’

‘’కాశీ బ్రహ్మేతి వ్యాఖ్యానం – తబ్రహ్మ ప్రాప్యతే –త్రాహి –తస్మాత్ కాశీ గుణాన్, సర్వే-తత్ర తత్ర వదన్తిహి’’

‘’కాశీ కాశీ తి కాశీతి – రాసానా రస సం యుతా –యస్య కస్యాపి భూ యాశ్చేత్త్ –స రసజ్నో న చేతరః ‘’

                            వింధ్యాద్రి వర్ధనం

ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి, సంచారం చేస్తున్నాడు. ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు. దాని నిండా ఫల పుష్ప వృక్షాలు కన్నుల విందు చేస్తున్నాయి. అనేక జంతు సమూహాలు, పక్షులు తిరుగుతూ దాని శోభను పెంచుతున్నాయి. నారదుని చూసి వింధ్యాద్రి పర వశించింది. ఆయనకు సపర్యలు చేయాలని కోరిక కలిగింది. నారదుని రాకతో పునీతుడై  నట్లు వింధ్యాద్రి చెప్పుకొన్నది. మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్య కర విశేషాలను అడిగి తెలుసుకొన్నది. మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని,  హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము, పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు. మేరువు స్వర్ణ మయం అయినా, రత్నాల తో నిండి ఉన్నా తాను గౌర వించాల్సిన పని లేదని బింకంగాపలికాడు. మందేహాదులకు నిలయమైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది, సర్వ సర్ప సమూహాలున్న రైవతాద్రి ఉన్నది, హేమ, త్రికూట, క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వహింప లేవు.  మొత్తం మీద భూ భారాన్ని మోసే శక్తి, సామర్ధ్యాలు తనకు మాత్రమె ఉన్నాయని వింధ్య పర్వతం నారదమునితో ప్రగల్భాలు పలికింది.

నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది. గర్వంతో అందర్ని చులకనగా మాట్లాడు తున్నాడని గ్రహించాడు.
శిఖర దర్శనం తోనే మోక్షమిచ్చే  శ్రీ శైల పర్వతం ఉంది దాని ముందు వింధ్య ఎంత? అను కొన్నాడు.

కాని ఉపాయంగా  వింధ్యాద్రితో ‘’వింధ్య రాజా! నిజం చెప్పావు. మేరు పర్వతంనీ చేత కించపరచబడింది. నేనూ అదే అనుకున్నాను నీ నోటి నుంచి నిజం బైటికి వచ్చింది. అయినా ఏదో పేరు, ప్రతిష్టా సంపాదించుకున్న వారి గురించి మనకెందుకు చింత? మనం విమర్శించటం ఉచితం కాదు. నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్లి పోయాడు. నారదుని మాటలు వింద్యాద్రికి మాత్సర్యం కలిగించాయి. ’’శాస్త్రం తిరస్కరించిన వారి జీవితం, జ్ఞాతులచే పరాభ వింప బడినవారి జీవితం వృధా". వారికి కునుకు పట్టదు..దుఖంతో నాకేమీ పాలు పోవటంలేదు.దుఖం జ్వరం లాంటిది. వైద్యుడికి లొంగదు.

మేరువును ఎలా జయించాలి ?
యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కుంటే, మా రెక్కలన్నిటినీ వాజ్రాయుధంతో ఇంద్రుడు నరికేశాడాయే. మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది?
దాని గొప్ప తనానికి ఈర్ష్యనాలో పెరిగి, దహిస్తోంది. భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి. భూభారం ఎలా మోస్తోంది?
బ్రహ్మచారి నారదుడి మాటలు మర్మ గర్భంగా ఉన్నాయి. నాకు సరైన మార్గాన్ని చూపగలవాడు విశ్వేశ్వరుడే. సాక్షాత్తు సూర్య భాగ వానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు. కనుక నేను కూడా నిలువుగా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించు కోవాలి ‘’అని అనేక రకాలుగా మధన పడింది". చివరకు ఆకాశంలోకి నిలువుగా పెరగటం ప్రారంభించింది.

సూర్య గమనానికి అడ్డుకునేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది. సూర్యుడే తనను దాటి వెళ్ళలేడు ఇక యముడెలా దాటి దక్షిణ దిక్కుకు వెళ్తాడు? అను కొన్నది. మనసులోని చింతతీరి ధైర్య స్తైర్యాలు కలిగాయి వింధ్యకు.

                    సత్య లోక వర్ణనం

సకల జగత్తుకు సూర్యుడు ఆత్మ. చీకటికి విరోధి రోజూ ఉదయాద్రిన ఉదయించి చీకటిని సంహరించి వెలుగు నింపుతూ పద్మాలకు ప్రకాశాన్నిస్తూ నిత్య కృత్యాలకు తోడ్పడుతాడు. సాయంకాలం పశ్చిమాన అస్తమించి కలువలకు  వికసనం కలగ టానికి కారణం అవుతున్న చంద్రుని రప్పిస్తున్నాడు. సూర్యునికి  మలయానిలం ఉచ్చ్వాసం క్షీరోదకం అంబరం, త్రికూట పర్వతం రత్న రాశుల ఆభరణం, సువేల పర్వతం నితంబం, కావేరి గౌతములు జంఘాలు,చోళ రాజ్యం అముష్మకం, మహారాష్ట్ర వాగ్విలాసం. అలాంటి దక్షిణ నాయకుడైన రవి అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన సారధి అనూరుడు మేరువుతో పోటీపడి వింధ్య పెరిగి మార్గాన్ని అడ్డ గించిందని తెలిపాడు. గగన మార్గానికి నిరోధం కలిగి నందుకు సూర్యుడు ఆశ్చర్యపడ్డాడు.

సూర్య గమనం లేక పోయే సరికి యఙ్ఞ యాగాదులు, బ్రాహ్మణుల సంధ్యా వందనాదులు ఆగి పోయాయి. సృష్టి స్తితి లయాలకు కారణమైన సూర్యుని గతిని స్తంభింప జేసినందుకు మూడు లోకాలు తల్లడిల్లి పోయాయి. దేవతలు అందరూ బ్రహ్మదేవుని చేరి మొరపెట్టుకోవాలని బయల్దేరారు. "బ్రహ్మను దర్శించి స్తోత్రాలతో తృప్తి పరిచారు, దానికి బ్రహ్మ పరమానంద భరితుడైనాడు. ఏమి వరంకావాలో కోరుకో మన్నాడు త్రిమూర్తుల మైన తాము సృష్టి స్తితి లయాలను చేస్తామని కోరిన కోర్కెలను తీరుస్తామని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ వారికి సత్య లోకం లోని విశేషాలను వివ రించిచేప్పాడు.  ‘’ఈమె భారతి నా భార్య. ఇవి శ్రుతి స్మృతులు. ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు .వీరందరూ చాతుర్మాస్యాది వ్రతాలు చేసిన బ్రాహ్మణులు. వీరు పతివ్రతలు. వీరు బ్రహ్మ చారులు. వీరు మాతా పితర పూజ చేసిన పుణ్యాత్ములు. వీరు గోసంరక్షణ చేసినవారు. వీరు నిష్కామ కర్ములు. వీరు నిత్యాగ్ని హోత్రులు, కపిలగో దానం చేసిన వారు వీరు. వీరు సారస్వత తపో సంపన్నులు. వీరు దానం తీసుకోని వారు. వీరంతా నాకు ప్రియులు. సూర్య తేజం ఉన్న వారు. ప్రయాగలో మాఘ మాసంలో రవి మకర రాశిలో ప్రవేశించి నపుడు పుణ్యస్నానం చేసిన వారు వీరు. కార్తీకంలో కాశీలో పంచ నదాలలో మూడు రోజులు స్నానం చేసిన వారిరుగో. మణి కర్ణికలో స్నానం వీరు చేసిన వారు. వీరు వేదాధ్యాన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు. వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా. ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు.’’ అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ.

బ్రహ్మ మరల మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంత్రాలున్నాయని, గోవులలో హవిస్సులున్నాయని, బ్రాహ్మణులు అంటే నడిచే తీర్ధాలని, ఆవులు పవిత్ర మైనవని, గోవు గిట్టల నుండి రేగిన దుమ్ము కణాలు గంగా జలం అంత పవిత్ర మైనవని, ఆవుల కొమ్ముల చివర్లలో అన్ని తీర్ధాలు ఉన్నాయని, గిట్టలలో అన్ని పర్వతాలు ఉన్నాయని, కొమ్ముల మధ్య గౌరీదేవి ఉంటుందని, గోదానం చేస్తే పితృదేవతలు మహా సంతోషిస్తారని, ఋషులు దేవతలు ప్రీతీ చెందుతారని, గోవు లక్ష్మీ స్వరూపమని, పాపాలను పోగొట్టు తుందని వివరించాడు. గోమయం యమునా నది అని, గోమూత్రం నర్మదా నదీ జలం, ఆవు పాలు గంగోదకం అని,  దాని అన్ని అంగాలలో అన్ని లోకాలు ఉన్నాయని బ్రహ్మ చెప్పాడు. ఎవరు గంగా స్నానం చేస్తూ ఆ నది ఒడ్డున నివశిస్తూ పురాణాలు వింటాడో వాడు సత్యలోకానికి అర్హుడు అని తెలిపాడు. ఇంతకూ దేవతలెందుకు వచ్చారో మళ్ళీ అడిగాడు. వింధ్యాద్రి చేసిన పనిని వివరించారు దేవతలు. అప్పుడు బ్రహ్మ వారితో ‘’కాశీ క్షేత్రం  అవి ముక్త క్షేతం. అక్కడ మహా తపస్వి అయిన అగస్త్య మహర్షి నిత్య విశ్వేశ్వర దర్శనం, గంగా స్నానాలతో పునీతుడవుతున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళండి. ఆయనే తగిన ఉపాయం చెప్పగలడు. మీ ప్రయత్నం సఫలం అగు గాక‘’ అని చెప్పి అదృశ్య మయాడు. బ్రహ్మ దర్శనం అయి నందుకు, కాశీ క్షేత్ర దర్శనం, గంగా విశ్వేశ్వర అగస్త్య దర్శనం  చేయమని ఆయన చెప్పిన సలహాకు ఆనంద పడి దేవత లందరూ కాశీ పట్నానికి బయల్దేరి వెళ్లారు.
                                 ***
వారాహీ దేవి ఆలయం వుంది. ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్)లో వుంటుంది. నేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే. ఈవిడ గ్రామదేవత. ఉగ్రదేవత. ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.
భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. ఉదయం 7 గంటల లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీయరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.

వారాహిదేవి ఉగ్రదేవతే కానీ, గ్రామ దేవత కాదు. అష్టమాతృకా దేవతలలో ఒకటి.
                             ***
సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం.

ఈ 70 నామములను ఉచ్చరించుచూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనము, దూర్వారాంకురములు, అక్షతలు ఉంచి, ఆ పాత్రను తన నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునకు అర్ఘ్యము నొసంగిన వారు దరిద్రులు కారు, దుఃఖములను పొందరు, భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందెదరు, మరణానంతరము సూర్య లోకమున నివసింతురు.

౧. ఓం హంసాయ నమః
౨. ఓం భానవే నమః
౩.ఓం సహశ్రాంశవే నమః
౪.ఓం తపనాయ నమః
౫.ఓం తాపనాయ నమః
౬.ఓం రవయే నమః
౭.ఓం వికర్తనాయ నమః
౮.ఓం వివస్వతే నమః
౯. ఓం విశ్వ కర్మణే నమః
౧౦. ఓం విభావసవే నమః
౧౧. ఓం విశ్వ రూపాయ నమః
౧౨. ఓం విశ్వ కర్త్రే నమః
౧౩. ఓం మార్తాండాయ నమః
౧౪. ఓం మిహిరాయ నమః
౧౫. ఓం అంశు మతే నమః
౧౬. ఓం ఆదిత్యాయ నమః
౧౭. ఓం ఉష్ణగవే నమః
౧౮. ఓం సూర్యాయ నమః
౧౯. ఓం ఆర్యంణే నమః
౨౦. ఓం బ్రద్నాయ నమః
౨౧. ఓం దివాకరాయ నమః
౨౨. ఓం ద్వాదశాత్మనే నమః
౨౩. ఓం సప్తహయాయ నమః
౨౪. ఓం భాస్కరాయ నమః
౨౫. ఓం అహస్కరాయ నమః
౨౬. ఓం ఖగాయ నమః
౨౭. ఓం సూరాయ నమః
౨౮. ఓం ప్రభాకరాయ నమః
౨౯. ఓం లోక చక్షుషే నమః
౩౦. ఓం గ్రహేస్వరాయ నమః
౩౧. ఓం త్రిలోకేశాయ నమః
౩౨. ఓం లోక సాక్షిణే నమః
౩౩. ఓం తమోరయే నమః
౩౪. ఓం శాశ్వతాయ నమః
౩౫. ఓం శుచయే నమః
౩౬. ఓం గభస్తి హస్తాయ నమః
౩౭. ఓం తీవ్రాంశయే నమః
౩౮. ఓం తరణయే నమః
౩౯. ఓం సుమహసే నమః
౪౦. ఓం అరణయే నమః
౪౧. ఓం ద్యుమణయే నమః
౪౨. ఓం హరిదశ్వాయ నమః
౪౩. ఓం అర్కాయ నమః
౪౪. ఓం భానుమతే నమః
౪౫. ఓం భయ నాశనాయ నమః
౪౬. ఓం చందోశ్వాయ నమః
౪౭. ఓం వేద వేద్యాయ నమః
౪౮. ఓం భాస్వతే నమః
౪౯. ఓం పూష్ణే నమః
౫౦. ఓం వృషా కపయే నమః
౫౧. ఓం ఏక చక్ర ధరాయ నమః
౫౨. ఓం మిత్రాయ నమః
౫౩. ఓం మందేహారయే నమః
౫౪. ఓం తమిస్రఘ్నే నమః
౫౫. ఓం దైత్యఘ్నే నమః
౫౬. ఓం పాప హర్త్రే నమః
౫౭. ఓం ధర్మాయ నమః
౫౮. ఓం ధర్మ ప్రకాశకాయ నమః
౫౯. ఓం హేలికాయ నమః
౬౦. ఓం చిత్ర భానవే నమః
౬౧. ఓం కలిఘ్నాయ నమః
౬౨. ఓం తాక్ష్య వాహనాయ నమః
౬౩. ఓం దిక్పతయే నమః
౬౪. ఓం పద్మినీ నాధాయ నమః
౬౫. ఓం కుశేశాయ నమః
౬౬. ఓం హరయే నమః
౬౭. ఓం ఘర్మ రశ్మయే నమః
౬౮. ఓం దుర్నీరీక్ష్యాయ నమః
౬౯. ఓం చండాశవే నమః
౭౦. ఓం కశ్యపాత్మజాయ నమః

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
  *🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
                        🌷🌷🌷

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: