పుణ్యఫలం - ధనయోగాలు - అదృష్టం - దైవానుగ్రహం

మనిషికి ధనం 3 రూపాలలో వస్తుంది. 
1. యోగంద్వారా. 2. ప్రాప్తము ద్వారా 3.  శ్రమ ద్వారా.

1. యోగము కూడా 3 రకాలుగా మారుతూంది.

1. ధనవంతునిగా పుట్టడం
2. మధ్యవయసులో ఏదో ఒక   వ్యాపారములోనో ధన వంతులు కావటం
3. తన సంతానము ద్వారా వృద్దాప్యంలో సంపన్నుడు అవటం.

అదృష్టం కూడా అంతే

1. తాను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కలసివచ్చి ధనవంతులు అవటం.
2. తన జీవిత భాగస్వామి అడుగుపెట్టిన సమయము ద్వారా సంపన్నులు అవటం.
3. తన సంతానము ద్వారా ధన వంతులు అవటం
లంటివన్నీ యోగం అంటారు

2. ప్రాప్తము.
1. తనకు ఎవరో వ్రాసిన వీలునామా మూలకంగా ధనం రావటం.
2. నిధి, నిక్షేపాలు, దొరకటం.
3. ఏ లాటరీ ద్వారానో లేదా జూద వ్యసనం ద్వారానో ధనం రావటం.

ఈ ప్రాప్త్య ధనాన్ని అనుభవించే యోగ్యతా చాలా తక్కువ.

3. శ్రమ ద్వారా ధనము రావటం. ఇది కలియుగములో అసాథ్యం మారే ఇతర విధములుగా ధనము రాదు.

ధనానికి ముగ్గురు శత్రువులు.
1.అహంకారం.
2.వ్యసనం.
3.వాంఛ.
ఈ మూడు లేకుంటే ధనం నిలుస్తుంది.
సామాన్యముగా ప్రాప్తము ద్వారా వచ్చే ధనము వారు ఉన్నంత వరకు ఉంటుంది తరువాత పోతుంది.

మనము చాలా మంది విషయంలో వింటూవుంటాము, చూస్తూవుంటాము, పెద్దలు ఇచ్చిన ఆస్థిని కరిగించి వేసిన కారణంగా పిల్లలు రోడ్డు మీద ఉన్నారని కారణం ఇదే.

సాధారణముగా గురువులు కానీ మారెవరైనా కానీ ప్రాప్తని మార్చలేరు. కానీ యోగాన్ని మార్చవచ్చు.

ప్రతిజీవికి ఎక్కడో ధన యోగం ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకు రావచ్చు. మంత్రము ద్వారా కానీ తంత్రము ద్వారాకాని పొందవచ్చు. ఇది మార్చాలంటే జాతకం లేదా ధ్యానము ద్వారా చేయ వచ్చు. ప్రయత్నం, సాధన, భయభక్తులు  దైవానుగ్రహం అవసరం. అంటే కొంత శక్తి ని ధారపోసి చూడాలి. ఇది ఆధ్యాత్మక  గురువు చెయ్యలేరు.

జాతకం పరిశీలించి  గత జన్మ ఈ జన్మ వచ్చే జన్మ మూడు గమనించి చూడాలి. ఇలా ఒక జాతకం గురించి ఆలోచించటానికి,  పరిశీలించాటానికి జాతకుడికి గురువు ( ఇక్కడ గురువు అంటే జ్యోతిషం చెప్పే వారు)  మీద. - జాతకాలు చెప్పించుకునే అలవాటు ఉన్నవారికి అనుభవపూర్వక నమ్మకం, విశ్వాసం, గురి అలాంటి వాటి మీద ఆధారపడి వుంటుంది. సాధారణంగా మంచి జ్యోతిష్యుని గుర్తించడానికి, ఆయనకు అందుబాటులో ఉండటానికి, వినయ విధేయతలు ఫలితాలు పొందేవరకూ ప్రదర్సిచాటానికి అంత ఓపిక వీరికి ఉండదు. కొందరు మహానుభావులు ముఖ కవళికలు చూసి చెప్పగలిగేవారు వుంటారు,  క్షుణ్ణంగా జాతకం చూసి పది నిమిషాలలో చెప్పగలిగేవారు, ఒక వారం రోజులు ఆలోచించి చెప్పేవారు వూటారు. అర్జెంట్ గా గురువు మంత్రమో తంత్రమో ఇస్తే తెల్లవారేసరికి ధనము కురుస్తుంది అనుకొంటారు చాలా మంది. అది అసాధ్యం. వీరి అశ చూసి మీరు ఈ పూజ చేయండి. లేదా యంత్రం పెట్టుకోండి. లేకుంటే ఈ తాయేతూ కట్టుకోండి అని వీరిని నమ్మించ్చి చుట్టూ తిప్పుకునే వాళ్లు తారసపడుతుంటారు. నేను చాలా గొప్పవాణ్ణి అనీ, అద్భుత శక్తులు ఉన్నాయనీ, అవి ఇవి చెప్పి చివరకు మీ యోగం బాగాలేదు అంటారు. ఇది మానవుడి నైజం. ఇదే చాలామంది బలహీనత.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: