చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రo

చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రo  వివరణ మరియు  చక్కని  కథ...(మీ  వేదమయీ )

చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రo ప్రకారం ఒక దేశంలో సంపద సృష్టి పెరిగిన కొద్ది అది సంపన్న దేశమౌతుంది.
ఇక ద్రవ్య సరఫరా (డబ్బు చలామణి) పెరిగిన కొద్ది ఆ దేశ ప్రజల అవసరాలు తీరుతూ ప్రజలలో తృప్తి శాతం పెరుగుతుంది.

చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రాల ప్రకారం సంపద సృష్టి ఎంత ముఖ్యమో డబ్బు చలామణి కావడం కూడా అంతే ముఖ్యం.

ప్రజల వద్ద పోగుపడిన డబ్బు తిరిగి సంపద సృష్టికి (పునరుత్పాదనకు) అయినా ఉపయోగపడాలి.లేదా చలామణిలోనైనా ఉండాలి.అప్పుడే ఆ
డబ్బు వల్ల దేశానికి ప్రయోజనం.

ఈ రెండూ లేకుండా డబ్బుకు మరింత డబ్బును చేర్చుతూ గుట్టలు గుట్టలుగా పోగు చేయడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు.

ఈ విధంగా విరివిగా ద్రవ్య సరపరా (డబ్బు చలామణి) అయ్యేలా  తీర్థ యాత్రలు - వివాహాది ఉత్సవాలు - పండుగలు - దాన ధర్మాలు - పుష్కరాలు - జాతరలు.... వంటి వ్యవస్థలు భారతదేశంలో పూర్వం నుండే ఉన్నాయి.

సనాతన భారత దేశంలో ప్రజలందరు తమకున్న శక్తి సామర్థ్యాలనూ - నెైపుణ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వల్ల దేశంలో సంపద సృష్టి కూడా జరిగి కొన్ని వేల సంవత్సరాల పాటు సంపన్నదేశంగా నిలిచింది.
ప్రజలు తమకు తెలియకుండానే బలమైన అర్థ శాస్త్ర సూత్రాలను పాటించేవారు.

కాని,బౌద్ధ మతానంతరం కొన్ని శతాబ్దాల పాటు భారతదేశం అశాస్త్రీయ వైరాగ్యాన్ని పాటించడం వల్ల ఆర్థిక విషయాలలోనూ, యుద్ధ విద్యలలోను నిర్లక్ష్యం వహించింది. దానివల్ల విదేశి దండయాత్రలు ఎదుర్కునే విషయంలోనూ, పారిశ్రామిక విప్లవం విషయంలోనూ ఇబ్బందులు పడింది.

ఇక పోతే...చక్కని  కథ.

చాణుక్యుని అర్థ శాస్త్ర సూత్రాల ప్రకారం  విరివిగా జరిగే ద్రవ్య సరపరా
(డబ్బు చలామణి) ప్రజల అవసరాలను తీర్చి ఎలా తృప్తిగా ఉంచుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాము !

ఒక వ్యక్తి తీర్థయాత్రకు వెళ్లాడు.

అక్కడ ఒక లాడ్జికి వెళ్లి అడ్వాన్స్ గా 1000 రూపాయలు ఇచ్చి గదులు చూడడానికి వెళ్లాడు.

లాడ్జి మేనేజర్ ఆ వెయ్యి రూపాయలను తమకు ఆహారాన్ని సరఫరా చేసే వ్యక్తి వసూలుకు వస్తే ఇచ్చాడు.

అతడు ఆ డబ్బు తీసికెళ్లి కిరాణా కొట్టులోని అప్పు చెల్లించాడు.

కిరాణా కొట్టు యజమాని, తమకు దినుసులు సరఫరా చేసే వ్యక్తి వసూలుకు వస్తే ఆ1000 రూ॥లు ఇచ్చాడు.

దినుసులు సరఫరా చేసే వ్యక్తి ఆ డబ్బు తీసికెళ్లి తమకు దినుసులిచ్చిన రైతు అప్పు తీర్చాడు.

ఆ రైతు తన క్రింద పని చేసే కూలీలకు ఇవ్వాల్సిన 1000 రూ॥ఇచ్చి వేశాడు.

ఆ కూలీలు ఒక చిన్న హోటల్ యజమాని వద్ద ఉన్న అప్పును తీర్చేశారు.

హోటల్ యజమాని ఆ డబ్బును తీసికెళ్లి  లాడ్జి మేనేజర్ వద్ద ఉన్న అప్పు తీర్చేశాడు.

లాడ్జి మేనేజర్ ఆశలు వదులుకున్న ఆ  అప్పు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించాడు.
అంతలోపు ఆ గదులు చూడడానికి వెళ్లిన యాత్రికుడు తిరిగి వచ్చి గదులలో వాసన వేస్తుంది. నాకు నచ్చలేవు అన్నాడు.

లాడ్జి మేనేజర్ అతని 1000 రూ॥అతనికి ఇచ్చాడు.
ఏమీ తగ్గించకుండా పూర్తిగా తన డబ్బులు తనకు వచ్చినందుకు ఆ యాత్రికుడు చాలా సంతోషించాడు.

ఈ మొత్తం ఉదాహరణలో ఏ వ్యక్తి క్రొత్తగా సంపాదించలేదు. అలాగే ఏ వ్యక్తి నష్టపోలేదు.పైగా అందరూ తృప్తి పడ్డారు.డబ్బు చలామణి వేగంగా జరిగింది. దాదాపు పది కి పైగా చేతులు మారి అందరి అవసరాలు తీర్చింది. అందరిని సంతోషపరిచింది.

అది "ద్రవ్య సరఫరా (డబ్బు చలామణి)" మహాత్మ్యం.

                      స్వస్తి

        (ఓపికగా చదివిన వారికి )
         ధన్యవాదములతో
        S. సూర్య ప్రదీప్

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: