జ్యోతిష్యంలో చతుర్విద పురుషార్ధలు

జ్యోతిష్యంలో చతుర్విద పురుషార్ధలు

ధర్మ, కామ త్రికోణాలు రెండు కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్యేశ్వర యంత్రం.....

రాశి చక్రంలో దర్మ, అర్ధ, కామ, మోక్ష త్రికోణాలనే 4 పురుషార్ధాలు ఉన్నాయి.

1, 5, 9 ధర్మ త్రికోణాలు.

2, 6, 10 అర్ధ త్రికోణాలు,

3, 7, 11 కామ త్రికోణాలు,

4, 8, 12 మోక్ష త్రికోణాలు.

ధర్మ త్రికోణాలను కామ త్రికోణాలు ఎదురెదురుగా ఉండి సూటిగా ఖండించుకుంటాయి.

ఈ రెండు త్రికోణాలకు సామాన్యంగా పొసగదు. కానీ ఈ రెండిటినీ చక్కగా వినియోగించుకుంటే జీవితం భగవంతుని ఆదేశాలకు (1, 5, 9), ప్రకృతి (3, 7, 11) యొక్క అమరికలకు అనుగుణంగా ఉంటుంది. అప్పుడు మానవుడు భూమ్మీద భగవంతుని ఆదేశాలతో ప్రతిరూపం కాగలడు.

పార్వతి పరమేశ్వరుల సంతానం కుమారస్వామి. ఎవరైతే ధర్మ భావాలను (1, 5, 9), కామ భావాలను (3, 7, 11) సరిగా సమన్వయం చేయగలడో వాడు కుమారుని అంశ అవుతాడు. దీనిని సూచిస్తూ ఎదురెదురుగా ఖండించుకుంటున్న రెండు త్రికోణాలు ఉంటాయి.

ఊర్ధ్వముఖంగా ఉన్న 1, 5, 9 భావాలు దర్మాత్రికోణాలు, అగ్నితత్వం కలిగి ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ఉంటాయి.(అగ్నిజ్వాల ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ప్రజ్వలిస్తూ ఉంటుంది.)

అదోముఖంగా ఉన్న 3, 7, 11 భావాలు కామ త్రికోణాలు, జలతత్వం కలిగి ఎప్పుడు అదోముఖంగానే ఉంటాయి.(నీరు ఎప్పుడు అదోముఖంగానే ప్రవహిస్తూ ఉంటుంది.)

దర్మ, కామ రాశి చక్రంలోని భావ త్రికోణాలు ఆరు కోణాలుంటాయి. అందుకే శివశక్తుల కలయిక అయిన కుమార స్వామిని "షణ్ముఖుడు" అంటారు.

"ధర్మం ఎక్కువై కామం తగ్గితే దైవత్వం
కామం ఎక్కువై ధర్మం తగ్గితే రాక్షతత్వం"

రెండు సమపాళ్ళలో ఉంటేనే మానవత్వం.

ఈ ఙ్ఞానం కలగాలంటే పై ఆరు భావాలు బాగుండాలి. కాబట్టి సంతానం లేనివారు షట్కోణ సుబ్రమణ్యేశ్వరస్వామి యంత్రాన్ని నిష్ఠగా పూజిస్తే సంతానం కలుగుతుంది అని ప్రతీతి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: