ఈ 19-8-2018అంతర్యామిఆనందానుభవం 

ఆనందం అనే పదానికి- సంతోషం, సుఖం, పరమాత్మ అని అర్థాలు చెబుతుంది నిఘంటువు. మనసుకు ఆహ్లాదం కలిగించేది ఏదైనా ఆనందమే! ఎవరైనా ఇష్టపడి కొనసాగించే వ్యాపకాన్నీ ఆనందంగానే పరిగణించవచ్చు.

ముష్కరులు తమ ఆనందం కోసం ప్రపంచాన్ని భయభ్రాంతం చేస్తుంటారు.

.

ఇలాంటి చర్యలను లోకం ‘ఉగ్రవాదం’గా పరిగణిస్తుంది.

సంగీతం, సాహిత్యం, క్రీడలు వంటివి పలువురి సంతోషానికి దోహదపడే అంశాలు. వాటిని సాధన చేసేవారు ఆయా వ్యాపకాలతో ఆనందం పొందుతుంటారు.

అవి అందర్నీ సంతోష తరంగాల్లో ముంచెత్తుతుంటాయి. ఆ సాధనలు ఆనంద ప్రేరకాలు-కారకాలు, సామాజిక ఉద్ధారకాలు! వాటిని సాధన చేయడం ద్వారా వ్యక్తి సుఖానుభూతి అందుకోవచ్చు.

అందరూ సామూహికంగా అనుభవించే సంతోష మార్గమే ఆనందం. వ్యక్తి సంతోషమే సమాజ సౌఖ్యానికి ప్రేరణ అవుతుంది. మానవ జీవితంలో ఆనందం అనేది సంక్రమించే లక్షణం గల ఓ దివ్య వైభవం. ఒకరు నవ్వుతుంటే- ఇతరుల పెదవులపైనా ఆనంద పుష్పాలు వికసించాలి, ఆనందాల సిరులు లాస్యం చేయాలి. సర్వుల ఆనందం-సమాజ వైభవం అంటే అదే!
 
ఆశాభావ పూరితమైన, మహత్వపూర్ణమైన ఇంద్రియానుభవం ఆనందంలో వ్యక్తమవుతుంది. ఆ ఆనందం ఆ భక్తుడికే పరిమితమైంది. అతడు దైవాంశ సంభూతమైన ఆ ఆనంద వైభవాన్ని తాను అనుభవించి ఇతరులతోనూ పంచుకుంటే, అది మహదానందం! ఆరోగ్యప్రదాయినిగా ఆనందాన్ని పరిగణిస్తారు.

శాంతికి, ప్రగతికి కారణమయ్యే ఆనంద మార్గాల్ని అన్వేషించి సాధకుడు తన జీవితాన్ని పండించుకోవాలి.

భారతీయ తత్వచింతనాపరులు అటువంటి ఔన్నత్యాన్ని సాధించి లోకంలో అపార గౌరవాదరాలు పొందగలిగారు. వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవిస్తూనే- మన సంస్కృతి, సంప్రదాయాల ఆచరణ వల్ల ఉన్నతమైన ఆనందం సాధించవచ్చు. సమాజం మెచ్చే ప్రతి పనితోనూ, అటువంటి సంతృప్తికర జీవనాన్ని అనుభవించవచ్చు. అదే అందరి లక్ష్యమూ కావాలి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12

KAPU SURNAME AND GOTRALU: