నవగ్రహ జపం

నవగ్రహ జపం



విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ జపం. ఇది సాధారణంగా స్వయంగా చేసుకోవాలి. కానీ దానికి గట్టినమ్మకం, సంకల్పం కావాలి. సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది పూర్తి చేయలేరు. అటువంటి వారు బ్రాహ్మణులను పెట్టుకుని జపం చేయించుకోవాలి. బ్రహ్మణులను పెట్టుకుని జపం చేయించుకుంటే వారు వేద ప్రోక్తమైన మంత్రాలను జపం చేస్తారు. స్వయంగా చేసుకునే జపమే ఉత్తమం. స్వయంగా చేసే వారు " నవగ్రహ శ్లోకాలను" జపం చేయాలి.

 ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుఃఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.

నవగ్రహ శ్లోకాలు:



నవ గ్రహ శ్లోకం :

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి: 6000 సార్లు
జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

చంద్ర: 10,000 సార్లు
దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.

కుజ: 7,000 సార్లు
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

బుధ: 17,000 సార్లు
ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

గురు: 16,000 సార్లు
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

శుక్ర: 20,000 సార్లు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

శని: 19,000 సార్లు
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

రాహు: 18,000 సార్లు
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

కేతు: 7,000 సార్లు
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

ఈ నవగ్రహ శ్లోకాలు ఎవరైనా పఠించవచ్చు. పైన గ్రహ శ్లోకాలు వాటి ప్రక్కనే చేయవలసిన జపసంఖ్య చెప్పడం జరిగింది. ఒక్కో సారి పరిస్ఠితుల తీవ్రతను బట్టి 2,3 లేక 4 గ్రహాలకు కూడా జపాలు చేసుకోవలసి రావచ్చు. ఆ జపసంఖ్యను పూర్తిచేయడానికి చాలాసమయం పడుతుంది కనుక ఒకేరోజులో పూర్తిచేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ( ఉదా: 3 లేదా 5 లేదా 9 లేదా 11 లేదా 21 లేదా 41) నియమం పెట్టుకుని రోజుకి కొంత పూర్తి చేసుకుని, ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం ఇష్టమైన వారంలో దానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నవ గ్రహాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ గ్రహాలను ప్రార్ధించడం ద్వారా ధర్మ బద్ధమైన మీ కోరిక ఎంతటిదైనా ఖచ్చితంగా తీరుతుంది. ముందుగా మీకున్న సమస్య ఏమిటో, దాన్ని తీర్చగలిగే శక్తి ఏ గ్రహానికుందో తెలుసుకోవటానికి అనుభవజ్ఞులైన జోతీష్యులను సంప్రదించి వారి సలహాపై జపం ప్రారంభించాలి. 

ఈ 41 రోజులు దీక్షపూని, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మితంగా మాట్లాడుతూ ఉండాలి. ఉదయాన్నే చేసే జపం సంఖ్యానియమం కలిగి ఉండాలి. అంటే రోజుకు వెయ్యి చేస్తాననో, రెండు వేలు అనో నియమం పెట్టుకోవాలి. అది ఎట్టి పరిస్థితులలోనూ ఆపకుండా సంఖ్య పూర్తి అయ్యే వరకూ రోజూ చెయ్యాలి. అలాగే మిగతా సమయంలో ( పనులు చేసుకుంటున్నప్పుడు ) కుడా  వీలయినన్ని సార్లు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి. కానీ ఉదయం పూజా స్థలంలో కూర్చుని చదివే సంఖ్య మాత్రమే లెక్కకు వస్తుంది.

ఉదా: శుక్రునికి మొత్తం జప సంఖ్య 20,000 అయితే రోజుకు 1,000 చేస్తాము అన్న నియమంపెట్టుకుంటే మొత్తం జపం 20 రోజులు పడుతుంది. అదే 2 వేలు చేస్తాము అనుకుంటే 10 రోజులలో జపం పూర్తవుతుంది. మీ శక్తిని, సమయాన్ని బట్టి సంకల్పం చేసుకోవాలి. 

 ఈ శ్లోక జపం చేసే రోజులలో మనసు జపం పై మరింత లగ్నం అవ్వడానికి ఏదో ఒక పురాణ ప్రవచనాన్ని వినే నియమాన్ని విధించుకోండి.   మీరు జపం చేద్దామని సంకల్పించ గానె పూర్తిచేయలేరు. గ్రహాలు మధ్య మధ్యలో అవాంతరాలు కలిగిస్తాయి. ఆపరీక్షకు తట్టుకుని పూర్తి చేయాలంటే మీ జప దీక్షా సమయంలో నవగ్రహ  ప్రదక్షిణం, గ్రహ జపం, పురాణ కథా శ్రవణం అను మూడూ నిత్యం జరగాలి.  ప్రదక్షిణ, జపం ఉదయం 6 నుండి 8  లోపు పూర్తి చేయాలి. పురాణం సాయంత్రమైనా వినవచ్చు.  ఈ మూడూ ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. జపానికి మధ్యలో అవాంతరాలు రాకుండా  మిగతా రెండూ మిమ్మల్ని కాపాడతాయి.

ఫలితం తప్పక రావాలంటే...
నేను ఇక్కడ రాశే ప్రతీ ఒక్కటీ తప్పక ఫలితాన్నిస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవి కావు, ఎందరో అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పినవి. అయితే చేసే మీదగ్గరే ఉంటుంది ఫలితం రావడం, రాకపోవడం. ఎందరో ఎన్నో పూజలూ, వ్రతాలూ చేస్తున్నారు. మరి వాళ్లందరికీ ఫలితాలు వస్తున్నాయా అంటే రావట్లేదనే చెప్పాలి. ఫలితాలు వచ్చినవాళ్లకీ, రాని వాళ్లకీ తేడా ఒక్కటే... "నమ్మకం" అవును నమ్మకమే! అది ఉన్ననాడు ఫలితం తప్పక వస్తుంది. దానికి "ప్రయత్నం" తోడవ్వాలి. అలాంటి నమ్మకంతో కూడిన ప్రయత్నం చేస్తే " అదృష్టం" మీదవుతుంది.

ఉదాహరణకు: మీకు చిన్న ఉద్యోగం ఉంది. దానికి వచ్చే జీతం మీ అవసారలకు సరిపోక పోగా అప్పులపాలవుతున్నారు. సమస్యలు చుట్టుముట్టాయి. మీకు పెద్ద జాబ్ చేయగలిగె విద్య ఉంది, కానీ తగిన అవకాశాలు రావటంలేదు. అప్పుడు మీరు నగ్రహ ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా మీకు చక్కటి జాబ్ దొరుకుతుంది. అయితే ప్రదక్షిణలు చేశాను కదా అని కాలుమీద కాలేసుకుని కూర్చుంటే జాబ్ మీ చేతుల్లోకి రాదు. ప్రదక్షిణలు చేస్తూనే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. వచ్చిన ఇంటర్వ్యూలను మీకు తెలిసినంతవరకూ చక్కగా ప్రిపేరై హాజరు అవ్వాలి. ఒక వేళ అది పోయినా మరో దానికి నమ్మకంతో ప్రయత్నించాలి. అప్పుడు చక్కటి జాబ్( 41 రోజుల ప్రదక్షిణలు చేసిన 3 నెలల్లో) మీకు తప్పక దొరుకుతుంది.

"ఆహా ఏమి చెప్పారండీ... మా అర్హతకు తగిన జాబ్ కోసం `నమ్మకం'తో మళ్లీ, మళ్లీ `ప్రయత్నం' చేస్తూ పోతే జాబ్ దొరక్క ఎక్కడికి పోతుందీ? అలా చేస్తే ఎవరికైనా జాబ్ దొరుకుతుంది. పది రాళ్లు విసిరితే ఒక్కటైనా తగలక పోదా..? ఆ మాత్రం దానికి 41 రో...జు...లు... మీరు చెప్పినట్లు చేయండందేనికి? " అంటారా....?

అవును మీరనుకునేది నిజమే... "నమ్మకం తో కూడిన ప్రయత్నంఎక్కడ ఉంటుందో అక్కడ అదృష్టం ఉంటుంది". మీమీద మీకు అంత నమ్మకం ఉన్నంత వరకూ ఏ పూజా అవసరంలేదు. కానీ (పోనీ) ఆ ఆత్మవిశ్వాసం మీకు లేనప్పుడే నేను చెప్పిన ప్రదక్షిణలు చెయ్యండి. మీచుట్టూ సమస్యలున్నప్పుడే... మీ వల్లకాదు అనుకున్నప్పుడే... ఎవ్వరూ మీకు సాయపడలేరు అనుకున్నప్పుడే... పది సార్లు కాదు ఇరవై సార్లు మీ సొంత ప్రయత్నం చేసిన తరువాతే ఈ ప్రయత్నం చేసి చూడండి.

సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మ విశ్వాసం ఎవరికి ఉంటుంది? అటువంటి సమయంలో మీకు వచ్చే మంచి జాబ్ అవకాశాలను కూడా సరిగా వాడుకునే శక్తి మీకు సన్నగిల్లుతోంది. దానికి కారణం మీకు ఆ జాబ్ కు సంబంధించిన పరిజ్ఞానం తగినంత లేకపోవడం కాదు, మీకు తగినంత ఆత్మ విశ్వాసం లేకపోవడం. మీ "ఆంతరంగిక భయం". ఇంటర్వూకి వెళ్లినప్పుడు ఒకవేళ ఈ అవకాశం పోతే నా పరిస్థితి అధోగతే అనే ఆలోచనలతో, తెలియని ఆందోళనతో వంట్లో సన్నని వణుకు లాంటిది కూడా వస్తోంది. ఇక నావల్ల కాదు అని మీకు అనిపించింది. నిరాశ ఆవహించింది. ఏ దిక్కూ తోచటంలేదు. పోనీ అప్పుడే ప్రయత్నించండి. కాని చేతులు కాలేదాకా వేచి ఉండడం కన్నా... పరిస్థితులు మీకు కష్టంగా మారుతున్నాయి అని తెలిసిన వెంటనే ప్రత్నించడం మంచింది. 


Comments

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: