ఈ అంతర్యామి సాహసం
అంతర్యామి
సాహసం
‘బలమే సంతోషం, బలమే శాశ్వతం. బలహీనతే మరణం, బలహీనతే దుఃఖం. అందువల్ల బలాన్నే సముపార్జించండి’ అనేవారు స్వామి వివేకానంద.
శారీరక బలానికి సాహసమూ తోడైతే, విజయతీరానికి చేరడం కష్టమేమీ కాదు.
పిరికితనం అంటువ్యాధి వంటిది. యుద్ధసమయాల్లో జన క్షయం అధికంగా ఉంటుంది. ధైర్యవంతులు ఆ రణసీమలో మరణించినా బతికి ఉన్నట్లే, భయస్థులు బతికి ఉన్నా మరణించినట్లే!
ఛత్రపతి సాహస కృత్యాల్ని, ఆయన జీవించి ఉండగానే పలువురు కథలు కథలుగా చెబుతుండేవారు.
వారిలో అంతటి గౌరవ విశ్వాసాలకు మూల కారణం, ఆ మహనీయుడి సాహస గుణసంపద! సాహసం ఎంత అవసరమో వివేకానందుడు విస్పష్టంగా ప్రకటించారు. ‘సమస్తమూ ధైర్య సాహసాలపైనే ఆధారపడి ఉంది’ అని చాటిచెప్పారాయన.
కాలం గడిచేకొద్దీ మహాత్ముల మాటలకు విలువ పెరుగుతుంటుంది.
Comments
Post a Comment