నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (1)


చాలాకాలం క్రిందట ఒక పేరుగల రచయిత ఒక వారపత్రికలో ఒక సీరియల్ వ్రాసారు. తమిళ్‌నాడులో వైదీశ్వరన్ కోయల్ అనే ప్రాంతంలో నాడీ జ్యోతిషం ఆ నవలలో ప్రధానాంశం. సదరు వూర్లో అడుగుపెట్టిన ప్రతివారి జాతకం అక్కడ వున్న అనేకానేక జ్యోతిష్యుల ఇళ్ళలో వశపారంపర్యంగా వస్తున్న తాళపత్ర గ్రంధాలలో వ్రాసి వుంటుంది. ప్రతి రాత్రి అగస్త్య మహాముని స్వయంగా వచ్చి ఆ గ్రంధాలలో మర్నాడు జాతకం చెప్పించుకునేందుకు రాబోయే వారి వివరాలు వ్రాసి వెళ్తాడు. చిత్రంగా అక్కడికి వచ్చిన వారందరి వివరాలు, పేరు, వూరు, తల్లిదండ్రుల పేర్లు, గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, ఆఖరికి ఫలానా ఫలానా రోజు సదరు వ్యక్తి రాబోతున్నాడన్న విషయంతో సహా అన్నీ సవివరంగా వ్రాయబడి వుంటాయి. ఆ నవల అప్పట్లో సంచలనం రేపింది. ఎందరెందరో స్వయంగా అక్కడికి వెళ్ళి తమ తమ నాడీ జ్యోతిషం చెప్పించుకున్నారు. కేవలం వేలి ముద్ర మాత్రమే తీసుకొని ఆ వేలు ముద్ర ఆధారంగా అంత వివరంగా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పటం చూసి అబ్బురపడ్డారు. 

అలా వెళ్ళిన వ్యక్తులలో నా మిత్రుడు ఒకడున్నాడు. వాడు తిరిగొచ్చి ఆ విశేషాలు చెప్తుంటే మా మిత్ర బృందం నోరెళ్ళబెట్టి విన్నాము. ఒక కేసెట్‌లో అన్ని వివరాలు రికార్డ్ చేసి ఇచ్చారు. అది వింటుంటే దాదాపు అన్ని విషయాలు అంత సరిగ్గా చెప్పటం చూస్తుంటే ఇదెలా సాధ్యం అని అనుమానం వచ్చింది. అలాగని నేను జ్యోతిషం నమ్మనని కాదు. నాకు కూడా జ్యోతిషంలో ప్రావీణ్యం కాకపోయినా ప్రవేశం వుంది. నాకు ఆ విద్యను పరిచయం చేసిన గురువుగారు అందులో వున్న శాస్త్రీయతని, తార్కాన్ని చెప్పి వుండటంతో అలాంటిదేమి లేని నాడీ జ్యోతిషం గురించి అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత ఆ విషయాన్ని తొందర్లోనే మర్చిపోయాను. 

అయితే ఆ మిస్టరీ ఛేదించాలని అగస్త్య మహామునే వ్రాసాడేమో అన్నట్టు మళ్ళీ ఒక సంవత్సరం తరువాత మళ్ళీ అదే విషయం గురించి చర్చ జరిగింది. మా మిత్ర బృందంలో ఒక అమ్మాయి ఏదో ఒక సమస్య గురించి నాడీ జ్యోతిష్యులని సంప్రదించే ప్రయత్నంలో వుండింది. అప్పటికి హైదరాబాదులో నాడీ జ్యోతిష్యుల బ్రాంచి ఒకటి (శివం దగ్గర) మొదలైందని తెలిసి మరింత సంతోషించింది. మొత్తానికి అదేంటో తెలుసుకోవాలని ఇద్దరం, తమ జాతకం తెలుసుకోవాలని ఇద్దరు, మొత్తం నలుగురం బయలుదేరి అక్కడికి చేరుకున్నాం. 

ఎంట్రీ ఫీజు లాంటిదేమి లేదు. మీ జాతకం అక్కడ దొరికితేనే అది చెప్పించుకుంటేనే డబ్బులు ఇవ్వాలి. దాంతో నలుగురం మా మా వేలి ముద్రలిచ్చాం. నలుగురిని నాలుగు గదుల్లోకి పంపించారు. అప్పటికీ మేమెవరైనా ఆ అమ్మాయికి తోడుగా వుంటామని చెప్పినా వొప్పుకోలేదు. నాడీ జ్యోతిష్యం కేవలం వ్యక్తిగతంగానే చెప్పబడుతుందని అందుకని వేరే వ్యక్తిని ఎవరినీ (తల్లిదండ్రులైనా, తోడబుట్టినవారైన సరే..!) అనుమతించరని చెప్పారు. చేసేది లేక నేను నాకోసం చెప్పబడిన గదిలో అడుగు పెట్టాను. 

లోపల చాలా తక్కువ వెలుతురు వుంది. అక్కడేదో పూజ జరిగినట్టు దీపంలో నూనె కాలుతున్న వాసన. అంతలో ఒక తాళ పత్ర గ్రంధం చేతిలో పట్టుకొని, కాషాయ వస్త్రాలతో ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. నా ముందు పద్మాసనం వేసుకొని అన్నాడు - 

"మీ వేలిముద్రను అనుసరించి కొన్ని తాళపత్ర గ్రంధాలను తీసి పెట్టాము. అందులో వున్న కొన్ని విషయాలను చదివి చెప్తాను. అవన్నీ తమిళంలో వుంటాయి కాబట్టి పద్యం చదివి తెలుగులో చెప్తాను. అవి మీ విషయంలో సరైనవి అయితే "అవును" అని లేకపోతే "కాదు" అని మాత్రం సమాధానం చెప్పాలి. ఆ విధంగా మీకు సంబంధించి అన్ని వివరాలు సరిగా దొరికే తాళపత్ర గ్రంధం దొరికే వరకు చేస్తాము. ఒకసారి మీ నాడీ గ్రంధం దొరకగానే అన్ని వివరాలు మేమే చెప్తాము." 

నేను సరే అని స్థిరంగా కూర్చున్నాను. అతను ప్రారంభించాడు. ఒక్కొక్క పత్రమే తిప్పుతూ అందులో వున్న ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను అవును, కాదు అని మాత్రం చెప్తున్నాను. ఒక గ్రంధం పూర్తైపోగానే మరో గ్రంధం తెచ్చాడు. అది అయిపోగానే మరొకటి.. ఒక నాలుగు గ్రంధాలు చూసిన తరువాత పెదవి విరిచి చెప్పాడు - 

"మీ నాడీ జ్యోతిషం ఈ రోజు చెప్పించుకుంటారని అగస్త్య మహాముని వ్రాయలేదు. మీరు మళ్ళీ ప్రయత్నించాలి - ఒక నెల తరువాత." 

నేను నిరాశగా వెనుతిరిగాను. బయట నాతో వచ్చిన మరో మిత్రుడు నిలబడి వున్నాడు. "నాదీ దొరకలేదు" అన్నాడు నవ్వుతూ. 

"వాళ్ళిద్దరు?" అడిగాను కుతూహలంగా. 

"లోపలున్నారు. వాళ్ళవి దొరికినట్టున్నాయి.." అన్నాడు ఆ గదుల వైపు చూపిస్తూ. వాడూహించింది నిజమే. కొంతసేపటి తరువాత ఆ ఇద్దరూ బయటకి వచ్చారు. వాళ్ళిద్దరి ముఖంలో వెలుగు..!! 

లోపల జరిగినది వింటే కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం, కొంత థ్రిల్.. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ సరిగ్గా వున్నాయి. 

పేరు, వూరు, పుట్టిన తేది, నక్షత్రం, మూడేళ్ళ వయసులో జరిగిన ప్రమాదం, తండ్రి పేరు, ఆయన చేసే వుద్యోగం, ప్రస్తుతం వేధిస్తున్న సమస్య, దానికి పరిష్కారం, జరగబోతున్న విషయాలు. మరీ ఒకరికైతే అన్నయ్య పేరు అతను చేస్తున్న వుద్యోగం, పుట్టుమచ్చల్తో సహా చెప్పేశారు. 

"ఇదెలా సాధ్యమైంది?" 

"తెలియదు. వాళ్ళు తీసిన చివరి గ్రంధంలో వరసగా అన్ని విషయాలు వ్రాసున్నాయి. ఆశ్చర్యం కదూ" 

"ఆశ్చర్యం కాదు అనుమానం.. ఇదేంటో కనిపెట్టల్సిందే" అనుకున్నాను నేను బయటకి నడుస్తూ.

(అసలు రహస్యం తరువాత టపాలో)
రెండో భాగం కోసం ఇక్కడ నొక్కండి
మూడో భాగం కోసం ఇక్కడ నొక్కండి


Aripirala Satyaprasad ద్వారా 10th February 2009 క్రితం పోస్ట్ చేయబడింది


లేబుల్‌లు: సత్యంవద

  


10 

వ్యాఖ్యలను వీక్షించండి


Anonymous10 ఫిబ్రవరి, 2009 2:55 PM

aa tapaa eppuDoa kaasta.. cheptea.. baguntundi,,,

ప్రత్యుత్తరం


laxmi10 ఫిబ్రవరి, 2009 3:18 PM

అన్యాయం, ఇలా సస్పెన్స్ లో పెట్టటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా

ప్రత్యుత్తరం


Young Buzzer10 ఫిబ్రవరి, 2009 3:21 PM

నేను కూడా వైదీశ్వరన్ కోయిల్ కి వెళ్ళాను...!!!
అది 2005 లో అనుకుంట...నేను, నా ఫ్రెండ్స్ అందరం ఒక సారి టూర్ వేద్దామని అనుకున్నాము...
అప్పటికే మా అందరికి కాంపస్ ప్లేస్ మెంట్స్ వచ్చేయటం వల్ల ఫైనల్ ఇయర్ లో కొంచెం ఫ్రీ అయిపోయాం!!! సో ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించి ఈ ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం. చదివింది తమిళనాడు లో కాబట్టి పెద్ద దూరం కూడా కాదు....ఆల్రెడీ దీని గురించి విన్నాం...సో టెస్ట్ చేద్దాం అని వెళ్ళాం basical ga...

వెళ్ళాక అక్కడ ప్రతి ఇంటిలో కూడా నాడీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళే ఉన్నారు...చివరకు ఆ ఊర్లో ఉన్నా ఒక పెద్ద పేరున్న (!) వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాం...అచ్చం మీరు చెప్పినట్టే జరిగింది మాకు అక్కడ...

తాళపత్రాలు తీసుకు వచ్చి, ఏదో చదువుతూ అవునా, కాదా, పేరులో మొదటి అక్షరం ఇదా...అదా...అని అడిగాడు...చివరకు మన నోట్లోనుచి కావలసినంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని...ఏదో ఆకు తీసి...ఇదే నీది అన్నాడు!!!
అది చదువుతూ టేప్ లో రికార్డు చేస్తున్నాడు....అతను చెప్పిన కొన్ని విషయాలు వింటే నాకు నవ్వాగలేదు...కాని అక్కడ ఉన్న వాళ్ళ personalities చూసి తేడా వస్తే అక్కడి నుండి బయటకు రావడం కూడా కష్టమని నోరు మూసుకున్నాను.......
అతను చెప్పిన ఒక విషయం, నాకు btech ఐపోయాక చాల రోజుల తర్వాత కాని ఒక జాబు రావటం కష్టం అన్నాడు.....కామెడి ఏంటంటే...అప్పటికే మా అందరికి జాబ్స్ confirm అయిపోయాయి...
మొత్తం 6guri లో నలుగురు dare చేసి మాకు nachaledu అని చెప్పి బయటకు వచ్చారు...ఇద్దరం చెప్పించుకున్నాం.....
రిటర్న్ లో అక్కడ జరిగిందంతా చెప్పుకుని తెగ నవ్వుకున్నాం!!!!
how is urs!!!

ప్రత్యుత్తరం


రవి10 ఫిబ్రవరి, 2009 5:52 PM

నేనూ వెళ్ళానా ఊరికి. అయితే ఏమీ చెప్పించుకోలేదు. (చెప్పినా చేసేదేమీ లేదు కనక :-)).

ప్రత్యుత్తరం


మురళి10 ఫిబ్రవరి, 2009 6:32 PM

రెండో భాగం కోసం ఎదురుచూస్తూ.. (మీరు రాయాల్సింది బ్లాగు కాదు, వీక్లీ సీరియల్ అని మనసులో అనుకుంటూ..)

ప్రత్యుత్తరం


నరహరి10 ఫిబ్రవరి, 2009 9:49 PM

నాకు సరిగ్గా చెప్పారే? నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్న వారి దగ్గర చెప్పించుకున్నాను...నాకు పెల్లికి ముందు మా ఆవిడ పేరు కూడా చెప్పారు .....నేను వాళ్ళని నమ్ముతున్నాను....మిగతా వాళ్ళ గురించి తెలియదు కాని ఖైరతాబాడ్ లో ఉన్న వాళ్ళు నాకు మా ఫ్రెండ్ కి సరిగ్గా చెప్పారు ....

ప్రత్యుత్తరం


seenu24 నవంబర్, 2011 8:49 PM

idi motam nijame. ma amma garu nadi jyotishyalayam lo translate ga pabichestaru. naku a vishayalu mottam telusu. kavalante naku call cheyyandi. na no 8686665880

ప్రత్యుత్తరం


Anonymous22 మార్చి, 2012 9:42 PM

Nadi jyotishyalayam address cheppandi plz..iam living in Guntur,AP. my email address :- shareef151@gmail.com

ప్రత్యుత్తరం


Anonymous1 ఫిబ్రవరి, 2013 7:30 PM

నరహరి గారు 

ఖైరతాబాద్ లో ఎక్కడ? 

అడ్రస్ చెప్పగలరు 

ప్రత్యుత్తరం


voleti Pandari Nath28 జులై, 2013 5:05 PM

madi addanki oksari eelane okalu addanki lo petaru nenu velechepechukunanu chalabaga chapadu atani pearu raju...mob9177216686 edhi athani number .........

okati mathram gurhu petukondi....mana mundhu tharala valu manakante telivegala varu arochanlatho(mind)tho ...prapamchamlo ne anne mullaku velagala sata vaki vundhi.....kabati dineni nenu namuthanu.....
piga nenu MBB hr cadivanu ....it's reail .....bhratha kandam chala gopadi...manku teleyani veshyalu anno enka mulana padi vunaayi vatine taruvaha taralavari ki andhichadam mana karthvyam,......pandari.nath.37@facebook.com

ప్రత్యుత్తరం


లోడ్ అవుతోంది


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: