ఉత్సవాలు, ఆచారాలు, ధర్మ కర్మ విధులు (హిందువుల వేద సంపద - 4)


ధర్మ కర్మ విధులు

చాలామంది హిందువులు తమ ఇళ్ళలో ప్రతిరోజూ 

దీపారాధన, నైవేద్యం, వేద పారాయణం, దేవుని స్తోత్రాలు మరియు మంత్ర పఠనం, ధ్యానం మరియు ఇతర పూజా కార్యక్రమాలు వంటి వాటిని నిష్ఠగా నిర్వహిస్తుంటారు. ఈ ఆచారాలు, వ్యక్తిని బట్టి, గ్రామాలను బట్టి, మరియు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలలో గుర్తించదగిన విషయం ఏమిటంటే ఇవి ఆచరించే ముందు ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా పరిశుద్ధులై ఉండాలి. అందుకే స్నానం ఆచమనీయానికి అతి ముఖ్యమైనది. త్యాగం ద్వారా, దాన ధర్మాల ద్వారామూటకట్టుకొన్న పుణ్యం
మరుజన్మలో ఉపయోగపడుతుందని హిందువులు విశ్వసిస్తారు. యజ్ఞ యాగాదుల గూర్చి పురాణాలలో గొప్పగా కీర్తించారు. కానీ ఈ కాలంలో ఇవి తరచుగా నిర్వహించనప్పటికీ పెళ్ళిళ్ళలోనూ, కర్మకాండలలోనూ యధావిధిగా నిర్వర్తిస్తుంటారు.Most Hindus observe religious rituals at home.


పుట్టినరోజు, పెళ్ళి, మరణం మొదలైనవి మతసంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకు అన్నప్రాసన రోజు బిడ్డకు మొట్టమొదటిసారిగా ఘనాహారం తినిపిస్తారు. 
ఉపనయనం రోజు జంధ్యాన్ని తొడుగుతారు. ఒక మనిషి చనిపోయిన తరువాత అతని దినం రోజున విందు పెడతారు. పెళ్ళి ఏ రోజున జరగాలనే ముహూర్తాన్ని వధూవరుల జాతక చక్రాన్ని బట్టి తల్లిదండ్రులు జ్యోతిష్కులచే నిర్ణయిస్తారు. సన్యాసులకు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, మరియు హిజ్డాలకు తప్పించి మిగతా వారందరికి సాంప్రదాయకంగా కర్మకాండలు జరుపుతారు. శవాన్ని నేలలో పూడ్చడాన్ని ఖననం అంటారు. కాల్చడాన్ని దహనం అంటారు. ఇవి చేసేముందు శవాన్ని తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచుతారు.

పరమాత్మ స్వరూపం

హిందూ మతంలో భగవంతుని స్వరూపం మరియు సృష్టి గురించి భాగవతంలోని ద్వితీయ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు. భగవంతుడిని పరమేశ్వరుడని, విరాట్పురుషుడని ఇంకా అనేక పేర్లతో హిందూమతం వర్ణిస్తుంది. భగవంతుడు శాశ్వతుడు అంత్యకాలంలో సృష్టి ఆయనలో లీనమౌతుంది. తిరిగి భగవంతుని నుండి సృష్టి అనేకరూపాలతో ఆయననుండి ఉద్భవిస్తుంది. హిరణ్యమయమైన భగవంతుని శరీరంనుండి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు విధాలుగా ఈ జగత్తు ను శృష్టించాడు. పరమాత్మ శరీరంలోని ఆకాశం నుండి ప్రవృత్తి సామర్ధ్యమైన ఓజస్సు, వేగ సామర్థ్యం, బలసామర్థ్యం ఉద్భవించాయి. ఆయనలోని సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణం పుట్టింది. ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉంది. భగవంతుని జఠరాగ్ని నుండి ఆకలి దప్పిక పుట్టాయి. పరమాత్ముని ముఖం నుండి నోరు, నాలుక, దవడలు పుట్టుకొచ్చాయి. నాలుక నుండి రసేంద్రియాలు ఉద్భవించాయి. ఆయన ముఖం నుండి వాగేంద్రియం పుట్టింది. వాగేంద్రియానికి అగ్ని దేవుడు అధిష్టాన దేవత అయ్యాడు. వాగేంద్రియం నుండి సంభాషించే శక్తి పుట్టింది. ఆయనలోని వాయు శక్తి నుండి ఘ్రాణేంద్రియం పుట్టింది. ప్రాణులకు వాసనా శక్తి వచ్చింది. ఘ్రాణేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు. పరమాత్మ ఆత్మను అవలోకించగానే నేరాలు పుట్టాయి. నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది. నేత్రాలకు సూర్యుడు అధిదేవత అయ్యాడు. దిక్కులు అధిష్టాన దేవతగా కర్ణేంద్రియాలు పుట్టాయి. పరమాత్మ నుండి చర్మం పుట్టింది. దానికి స్పర్శా శక్తి వచ్చింది. చర్మం నుండి వెండ్రుకలు పుట్టాయి. వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి. ఆ తర్వాత వాయువు నుండి చేతులు ఉద్భవించాయి వాటికి ఇంద్రుడు అధి దేవత అయ్యాడు. ఆ తరువాత పాదాలు పుట్టాయి. పాదాలకు విష్ణువు అధిదేవత అయ్యాడు. పరమాత్మ ఆనందపారవశ్యుడు కాగానే జననేంద్రియాలు పుట్టాయి. జననేంద్రియాల నుండి పునరుత్పత్తి శక్తి ఆవిర్భవించింది. జననేంద్రియాలకు ప్రజాపతి అధిష్టాన దేవత అయ్యాడు. మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది. దానికి నిస్సార పదార్ధాలను విసర్జించే శక్తి పుట్టింది. జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాలన్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు ఉపయోగపడుతుంది.ప్రాణ ఆపాన వాయువులు శరీరాన్ని వదిలి వేయగానే మృత్యువు సంభవిస్తుంది. క్రింది శరీరాన్ని పై శ్రీరాన్ని వేరు చేస్తూ మధ్య భాగంలో బొడ్డు ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రేవులు, రక్తప్రసరణ ఇతర కార్యాలకు నాడీ వ్యవస్థ అవతరించాయి. వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలు అయ్యాయి. పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి, సంకల్పానికి నెలవైన హృదయం జనించింది. హృదయం నుండి సంకల్పం, బుద్ధి, చంద్రుడు, కాముడు జనించాయి. విరాట్పురుషుడి స్థూల శరీరం భూమి తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం, అవ్యక్తం అనే ఎనిమిది అనే ఎనిమిది ఆవరణలతో ప్రకాశిస్తుంది. ఇలా శుకమహర్షి పరీక్షిత్తు భాగవతంలో భగంతుని గురించి సృష్టి గురించి వివరించాడు.

ఆశ్రమాలు

హిందువుల ఆచారం ప్రకారం హిందువుల జీవనం నాలుగు ఆశ్రమాలుగా విభజించ బడి ఉంది.

మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, విద్యార్థిగా, బ్రహ్మచారిగా, నియమబద్ధులై,  ప్రశాంతంగా గురువు అదుపాజ్ఞలలో ఉంటూ ఆధ్యాత్మిక సంపత్తి కొరకై మనసును సిద్దం చేసే దశ. 

రెండోది గృహస్థ్యాశ్రమం. ఇందులో పెళ్ళి ద్వారా మరియు తమ వృత్తుల ద్వారా కామాన్ని సంతృప్తి పరచడం మరియు అర్థాన్ని (డబ్బు) సంపాదించడం ముఖ్యమైనవి. ఇంకా తల్లిదండ్రులను, పిల్లలను, అతిథులను, పెద్దలను ఆదరించడం హిందువుల యొక్క విధులు. 

మూడోది వానప్రస్థం. నెమ్మదిగా ఈ ప్రపంచంతో బంధాలను తెంచుకోవడం, బాధ్యతలు పిల్లలకు అప్పగించి తీర్థ యాత్రలు చేయడం ప్రధానమైనవి. ఇక చివరిదైన సన్యాసాశ్రమంలో ఈ ప్రపంచంతో బంధాలన్నింటినీ తెంచుకుని మోక్ష సిద్ధి కొరకు దేహ త్యాగం చేయడం.

సన్యాసం

మోక్ష సాధనకు మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కొద్దిమంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. సన్యాసాన్ని స్వీకరించిన వారు, నిరాడంబర జీవనం, బ్రహ్మచర్యం, ఐహిక సుఖములపై అనాసక్తి, భగవంతునిపై నిశ్చల భక్తిని తమ జీవన విధానంగా మలుచుకుని ఉంటారు. వీరిని సన్యాసులు, సాధుపుంగవులు, లేదా స్వాములని పిలుస్తారు.[సన్యాసం స్వీకరించిన మహిళలను సన్యాసినులు అంటారు. ఈ సన్యాసుల పట్ల హిందూసమాజం అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉంటుంది. ఎందువల్లనంటే వారు స్వార్థం, మరియు ఇంద్రియ సుఖములందు అనాసక్తులై ఉంటారు. కొద్ది మంది ఆశ్రమాల్లో తమ జీవనం కొనసాగిస్తుంటారు, కొద్ది మంది మాత్రం తమ అవసరాలను ఆ సర్వేశ్వరుడే తీరుస్తాడని దేశ సంచారం చేస్తుంటారు. సన్యాసుల తిండి మొదలైన అవసరాలు తీర్చడం గృహస్తులు గొప్పగా భావిస్తుంటారు. సాధువులు పేద-ధనిక, మంచి-చెడు, తేడా లేకుండా అందరిపై సమదృష్టి కలిగి ఉంటారు. పొగడ్తలకు, నిందలకు, సంతోషాలకు, భాధకు చలించకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటారు.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12

KAPU SURNAME AND GOTRALU: