కుంభకోణం పట్టణము
కుంభకోణం పట్టణము
కుంభకోణం
Location in Tamil Nadu, Indiaభౌగోళికాంశాలు: 10°58′N 79°25′E / 10.97°N 79.42°ECountry Indiaరాష్ట్రముతమిళనాడుప్రాంతముచోళనాడుజిల్లాతంజావూరు జిల్లాప్రభుత్వం • Municipal ChairpersonRathna Sekarవిస్తీర్ణం • Total12.58Elevation m ( ft)జనాభా (2011) • Total1,40,156 • సాంద్రత11Languages • Officialతమిళముసమయప్రాంతంIST (UTC+5:30)పిన్‌కోడ్612001Telephone code(91) 435వాహన రిజిస్ట్రేషన్TN 68
దక్షిణభారత దేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో కుంభకోణం ఒకటి. ఇది మరియొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరంకు నైఋతి దిశలో 70 కిలోమీటర్లు (43 మైళ్ళు) దూరంలో ఉంటుంది. పట్టణానికి కావేరి నది ఒకవైపు, అరసలార్ నది ఒకవైపు ప్రవహిస్తూ ఉంటాయి.
సృష్టి కారకుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృతభాండము ప్రళయంలో కొట్టుకుపోతూ పరమశివుడి ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందనీ దానివల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందనీ స్థానికుల విశ్వాసం. ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి[1]. పన్నెండు శైవ ఆలయాలు, నాలుగు వైష్ణవాలయాలు మరియు అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. వీటిలో సారంగపాణి (విష్ణువు) దేవాలయం చాలా ప్రాశస్త్యమైనది. దీని మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలో కెల్లా అతి ప్రాచీనమైనది, ఎందుకంటే పన్నెండు మంది వైష్ణవాళ్వార్లలో ఎనిమిది మంది దీని ప్రాశస్త్యాన్ని కీర్తించడం జరిగింది. క్రీ.శ 1300-1700 మధ్యలో నాయక్ రాజులు ఈ ఆలయాన్ని పలుదశల్లో విస్తరించడం జరిగింది.
దీని గోపురం 44 మీటర్ల (146 అడుగులు) ఎత్తు, 12 అంతస్థులు కలిగిఉంటుంది. ఈ గుడికి రెండు ప్రధాన ద్వారాలుంటాయి. దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ, ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణకాలంలోనూ ఉపయోగిస్తారు. ఆలయానికి ఉత్తర భాగంలో కోమలవల్లి అమ్మవారి గోపురం ఉంటుంది. ఆలయ ఆవరణలో భక్తులు ప్రవేశించే ముందే స్నానం చేయడం కోసం ఒక పుష్కరిణి కూడా ఉంటుంది. ప్రతీ సంవత్సరం ఈ పుష్కరిణిలోనే తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడి పూజలు ఇతర కార్యక్రమాలు పంచరత్ర ఆగమాలను అనుసరించి జరుపబడతాయి. దేవాలయానికి అత్యంత రమణీయంగా చెక్కబడిన రెండు రథాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సంధర్భాల్లో వాడేందుకు ఒక వెండి రథం కూడా
Comments
Post a Comment