భీముడు  గదతో మోదటం వలన భీమకుండ్ జలాశయం ఏర్పడింది. -  తప్పక వెళ్లిరావలసిన విహారయాత్ర ప్రదేశం


భీముడు  గదతో మోదటం వలన భీమకుండ్ జలాశయం ఏర్పడింది. -  తప్పక వెళ్లిరావలసిన విహారయాత్ర ప్రదేశం

ప్రపంచ వింతలలో అత్యద్భుత జలాశయం !

ఫ్రెండ్స్ మన దేశంలో ఒక మిస్టీరియస్ జలాశయం వుంది. అది చూట్టానికి నార్మల్ గానే వుంటుంది. కానీ ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే పెరిగిపోతాయి.

దాంతో ఎపుడైతే సడెన్ గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఆపద ముంచుకురానుందని జ్యోస్యం చెప్పేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జ్యోస్యం 100కి 100 పాళ్ళు చాలాసార్లు నిజమైంది. 2004లో సంభవించిన ప్రకృతి భీభత్సం సునామీ సమయంలో నయితే ఈ జలాశయంలోని నీరు ఏకంగా 1500 మీల ఎత్తుకు చేరుకుంది. అలాగే నేపాల్, గుజరాత్ లలో సంభవించిన భూకంపాల సమయంలో కూడా ఈ జలాశయంలోని నీరు విపరీతంగా పెరిగిపోయిందట. వినటానికే ఆశ్చర్యంగా వుంది కదూ. కానీ ఇది నిజం.

ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు త్రాగించింది. చేసేదేమీలేక ఆ టీం వారు తోక ముడుచుకుని వెనుదిరిగారు. ఇంతకీ ఆ జలాశయం పేరు చెప్పలేదు కదూ. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఏంటీ మధ్యలో భీముని పేరు ఎందుకొచ్చిందని ఆశ్చర్యపోతున్నారా?

ఈ జలాశయానికి భీంకుండ్ అని పేరు పెట్టడం వెనుక ఒక పురాణ గాథ వుంది. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపదీసమేతంగా వనవాసానికి వెళ్ళేటప్పుడు, మార్గ మధ్యంలో సూర్యునిధాటిని తట్టుకోలేక విపరీతమైన దాహంతో ద్రౌపదీ విలవిలలాడి పోయింది. అది ఒక కొండ ప్రదేశం.

కను చూపు మేర ఎక్కడ నీటి ఆనవాళ్ళు కనిపించలేదు. దాంతో భీముడు తన గద తీసుకుని కోపంతో ఆ కొండపై ఒక్క వేటు వేసాడంతే. ఇంకేముంది. భీముడు ఎక్కడైతే గదతో మోదాడో ఆ కొండపైనున్న భూమి కిందికి కృంగి జలాశయం ఏర్పడినది.

ఆ నీటిని త్రాగి అందరూ తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకూ యుగయుగాలుగా ఆ జలాశయం ఎండిపోకుండా ఇంకా అలాగే వుంది. అందుకే ఈ జలాశయానికి భీంకుండ్ అని పేరు పెట్టారు.

ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80కిమీ ల దూరంలో వుంది. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నో అడ్వాన్సెడ్ ఎక్విప్ మెంట్స్ అందుబాటులో వున్నప్పటికీ ఎన్నో ఈ జలాశయం లోతును మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. సుప్రసిద్ధ భూగర్భశాస్త్రవేత్తలు సైతం మావల్ల కావట్లేదని చేతులెత్తేసారు.

అలాగే ఈ జలాశయం లోతును కనుక్కోవటానికి డిస్కవరీచానల్ టీంలోని వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ కూడా చాలా ప్రయత్నం చేసారు. అయితే వారికి కొన్ని విచిత్రమైన ఇంతకు ముందు ఎన్నడూచూడని కొన్ని జలప్రాణులు మాత్రం కనిపించాయట. అలాగే వారికి 80అడుగుల లోతులో సముద్రపు అలలు తగిలినప్పుడు కలిగే అనుభూతి కలిగిందట. దాంతో సైంటిస్ట్ లు ఈ జలాశయం సముద్రంతో లింక్ చేయబడివుందనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

అలాగే ఈ జలాశయానికి అండర్ గ్రౌండ్ లో వాటర్ రావటానికి ఒక ఇన్ పుట్, వాటర్ వెళ్ళటానికి ఒక ఔట్ పుట్ మార్గాలున్నాయని అందుకనే ఈ జలాశయం అడుగులో సముద్రగర్భం అంతర్భాగంలో వుండే భయానక లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఇ న్ని చెప్పారుకాని ఆ జలాశయం లోతెంతా అని అడిగితే మాత్రం నీళ్ళు నమిలారు.

ఈ జలాశయానికి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం సాధారణంగా చెరువుల్లో, బావుల్లో, జలాశయాలలో గనక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది. కానీ ఈ జలాశయంలో ఎవరైనా మునిగిచనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి.

ఈ జలాశయంలో మునిగి చాలా మంది చనిపోయినప్పటికి ఒక్కరంటే ఒక్కరి శవంకూడా ఇప్పటివరకూ పైకి తేలలేదు.వింటుంటే ఏదో మిస్టరీగా వుంది కదూ. ఈ జలాశయంలోని నీరు సముద్రపునీటిలాగా బ్లూకలర్ లో వుండి ట్రాన్సపరెంట్ గా క్లిస్టర్ క్లియర్ గా వుంటుంది.రోజూ ఎంతో మంది ఈ జలాశయంలో స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేసినప్పటికీ ఈ జలాశయం మాత్రం ప్రతీరోజూ క్లీన్ చేసే లాగా స్విమ్మింగ్ పూల్ లాగా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది.

అందుకే స్థానికులు ఈ జలాశయాన్ని నేచ్యురల్ స్విమ్మింగ్ పూల్ అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని, సర్వపాపాలు నశిస్తాయని, ఈ నీరు హిమాలయాపర్వతప్రాంతాలలోని పవిత్రగంగా జలంతో సమానమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు.

అందుకే సుదూరప్రాంతాల నుండి ఈ జలాశయంలో స్నానం చేయటానికి యాత్రికులు వస్తూ పోతూ వుంటారు. ఈ ఫోటోను చూడండి. పై భాగంలో ఓ చిన్నరంధ్రం వుంటుంది. లోపల సువిశాల ప్రాంతం. చూస్తుంటే పురాణాలను నమ్మనివారు సైతం భీముడు నిజంగానే గదతో మోదటం వలన ఈ జలాశయం ఏర్పడిందని ఖచ్చితంగా నమ్మేలావుంది కదూ.

ఈ జలాశయంలోని నీరు నీలంగా వుండటంవలన దీనిని నీల్ కుంట్ అని, నారద్ కుంట్ అని పిలుస్తుంటారు.మధ్యలో నారదుడు ఎందుకొచ్చాడు అని అనుకుంటున్నారా? దానికీ ఓ ఫేమస్ స్టోరీ ఇక్కడ ప్రచారంలో వుంది.

నారద మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రాంతంలో ఘోరతపస్సు చేసాడట. నారదుని గాంధర్వ గానంతో శ్రీమహా విష్ణువు పులకించిపోయాడట. నారదుడిభక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ జలాశయం నుండి బయటకువచ్చాడని అందుకే శ్రీ మహావిష్ణువు శరీరఛాయతగిలి ఈ జలాశయంలోని నీరు నీలిరంగులోకి మారిపోయాయని భక్తుల విశ్వాసం.

ఈ జలాశయం ఎంట్రన్స్ కి ఎడమవైపు ఓ శివలింగం కూడా మనకు కనిపిస్తుంది. సునామీ సమయంలో ప్రశాంతంగా వున్న ఈ జలాశయం నుండి ఒక్కసారిగా నీరు 15ఫీట్ ల వరకూ అలల్లాగా ఎగరటం మొదలైందట. దాంతో స్నానంచేయటానికి అందులో దిగినవారు బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పైకి పారిపోయారు.

వెంటనే ఈ విషయం తెలిసి దేశ విదేశాల నుండి మీడియా మొత్తం ఈ ప్రదేశానికి చేరుకున్నారు. దేశవిదేశాల నుండి ప్రఖ్యాతశాస్త్రవేత్తలు ఈ చోటికి చేరుకున్నారు.ఆఖరికి వరల్డ్ ఫేమస్ డిస్కవరీ ఛానల్ టీంకూడా ఈ ప్రదేశానికి చేరుకుంది.లేదంటే విదేశీమీడియా ఇదంతా ఓ కట్టుకథ అని కొట్టిపారేసి వుండేవాళ్ళేకావచ్చు.

కానీ కళ్ళతో చూసిన నిజం, కెమేరాలో ఖైదైన నిజం అబద్దమని ఎలా భుకాయిస్తారు. ఈ జలాశయం రహస్యం తెలుసుకోవటానికి డిస్కవరీ ఛానల్ టీంసభ్యులు రంగంలోకి దిగారు. భారత మిలటరీ విభాగానికి చెందిన గజ ఈతగాళ్ళు సైతం క్రిందికి దిగారు.

ఇక అప్పటినుండి ఈ జలాశయం మరింత ఫేమస్ అయ్యింది. ఈ జలాశయం లోపలికివెళ్ళటానికి మెట్లు కూడా వున్నాయి. లోపలికి వెళ్ళే ముందు ఎంట్రెన్స్ దగ్గర శ్రీ మహావిష్ణువు,లక్ష్మీ దేవి విగ్రహాలు మనకు కనిపిస్తాయి.

అదేవిధంగా సూర్యుని కిరణాలు నేరుగా ఈ జలాశయంపై పడి నీటి రంగు రంగురంగులుగా ఇంధ్రధనస్సులాగా కనిపిస్తుంది.ఆ అద్భుత చిత్రాలను ఖైదుచేయటానికి ఫోటోగ్రాఫర్లుసైతం ఈ ప్రదేశానికి క్యూ కడుతుంటారు.

1978లో జిల్లా ప్రభుత్వం ఈ జలాశయ మిస్టరీని చేధించటానికి, ఈ జలాశయం లోతును కనుక్కోవటానికి, అందులోని నీటిని ఖాళీచేయటానికి ఇక్కడ 3 పంపుల ద్వారా విశ్వ ప్రయత్నం చేసారు. ఇలా ఒకటికాదు, రెండు కాదు 7 రోజుల పాటు వారి ప్రయత్నం నిరంతరంగా కొనసాగింది.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏడు రోజులలో భీంకుండ్ లోని నీళ్ళు ఒక్కఇంచ్ అంటే ఒక్క ఇంచ్ కూడా తగ్గలేదు. మహా భారతంలో ద్రౌపదీవస్త్రాపహరణం ఘట్టంలో లాగా దుశ్శాసనుడు ద్రౌపదీ చీర లాగినాకొద్దీ వచ్చినట్లు ఈ జలాశాయంలోని నీటిని పంపులద్వారా తరలించిన కొద్దీ కొత్తనీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు బిత్తరపోయి తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

దీంతో ఆ నీటిని అత్యంత పవిత్రమైనదిగా భావించి ఇక్కడకు వచ్చిన యాత్రికులు బాటిళ్ళలో నింపుకుని ఈ నీటిని తీసుకెళ్తూవుంటారు. ఫ్రెండ్స్ ఇదేదో శంభాలలాగా అదృశ్య నగరమూకాదు అట్లాంటిస్ లా కాల్పనిక గాథ కాదు మన కళ్ళ ముందే కనిపిస్తున్న నిజం.ఈ నిజాన్ని కళ్ళారా చూడాలి అనుకుంటే మీరు కూడా ఈ ప్రదేశానికి ఒక్కసారైనా వెళ్లి చూడండి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: