98. ఈశ్వరేఛ్ఛ చేత కర్మఫలితం లభిస్తుంది

98.ఈశ్వరేఛ్ఛ చేత కర్మఫలితం లభిస్తుంది

98.కర్తురాజఞయా ప్రాప్యతే ఫలమ్
కర్మ కిం పరం ? కర్మ త జ్జడం

కర్తు - దేవుడు ( కర్త )
ఆజ్ఞయా - ఆజ్ఞచే
ప్రాప్యతే - పొందబడేది
ఫలమ్ - కర్మ ఫలము
కర్మ - చేసిన కార్యం ( పని )
కిమ్ - ఏ విధంగా
పరమ్ - ఉన్నతమైనది ?
కర్మ - చేసిన కార్యం ( పని )
తత్ - నిస్సంశయముగా
జడం - ప్రాణంలేనిది

ఈశ్వరేఛ్ఛ చేత కర్మఫలితం లభిస్తుంది. మరి కర్మ ఉన్నతమైనదా ? కాదు. కర్మ జడము.

తనంతటతానుగా కర్మ ఫలాన్నివ్వలేదనియు , కర్మఫలప్రదాత ఆజ్ఞప్రకారమే కర్మఫలం దక్కుతుందని  భగవానులు ఈ శ్లోకంలో వివరించారు. కొన్ని సందర్భాలలో కర్మఫలితాలు మనము ఊహించినరీతిలో ఉండును కదా ! అని మనకు అనిపించవచ్చు. మనము అనుకున్నవి జరిగినప్పుడు ఈశ్వర సంకల్పము కూడా అదేవిధంగా ఉందని మనము గ్రహించవలెను. తనంతటతానుగా కర్మ ఫలాన్నివ్వలేదు కాబట్టి కర్మ జడమని మనము గ్రహించవలెను . కర్మఫలప్రదాత అంటూ ఇంకొకరున్నారనమాట. ఆ దాత ఆజ్ఞ ప్రకారమే కర్మఫలం దక్కుతుంది. అందువల్లనే శ్రీ భగవానులు " కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్ " అని సెలవిచ్చారు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: