శని వృశ్చికరాశిని వదిలి అదృష్టాలను తెస్తున్నాడు!

శనీశ్వరుడు ది 26 అక్టోబర్ 2017 ప 10.47ని లకు
వృశ్చికరాశిని వదిలి అదృష్టాలను తెస్తున్నాడు!

శనీశ్వరుడు  తన నివాసాన్ని వేరో రాశిలోకి మార్చుకుటుంనాడు.శనీశ్వర  గ్రహం అన్ని జన్మ రాశుల్లోనూ నిర్ణీత కాలం పాటు ఉంటూ మళ్లీ వేరే రాశిలోనికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ గ్రహం 30 ఏళ్ల కాలపరిమితిలో ఒక్కో జన్మ రాశిలో రెండున్నరేళ్లు ఉంటుంది. తర్వాత వేరో రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో నుంచి 26 అక్టోబర్ 2017 ప 10.47ని ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. వృశ్చికం నుంచి ధనస్సులోకి శని మారడం వల్ల ఆ రాశి వారికి ఏలినాటి శని చివరి దశకు చేరుకుంటుంది.

మీరు వృశ్చిక రాశికి చెందిన వారా?

అయితే మీరు చాలా లక్కీ. ఇక మీ జీవితంలో నుంచి శని వెళ్లిపోయాడు. అందుకే వృశ్చిక రాశి వారు ఇక మనసారా ఊపిరి పీల్చుకోండి. వృశ్చిక రాశి వారితో పాటు మరో రెండు రాశుల వారికి ఇక అంతా గుడ్ టైమే ఉంటుంది. అక్టోబరు 26, 2017న ఈ అద్భుతం చోటుచేసుకుంది.

శని గ్రహాన్ని అందరూ పాప  గ్రహంగా భావిస్తారు. అది అంటేనే భయపడతారు. దురదృష్టానికి మారుపేరుగా తలుస్తారు. ఎందుకంటే అది ఒక వ్యక్తి అదృష్టాన్నీ విధిని పూర్తిగా మారుస్తుంది. అయితే జ్యోతిష్యుల ప్రకారం ఆ అద్భుతం ఈ రోజు 10.47ని మధ్యాహ్నం నుంచి జరగనుంది. శని ధనుస్సు రాశిలో  ప్రవేశిస్తాడు.

అందువల్ల వృశ్చికం రాశితో  మరో రెండు రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడిన శని ప్రజల జీవితాలపై మాత్రం చాలా ప్రభావం చూపుతూనే ఉంటుంది.

శని గోచారం అనేది వృశ్చికం రాశి నుంచి ముగుస్తుంది. తదుపరి   రాశిచక్రమైన ధనుస్సులోకి ప్రవేశించింది. దీంతో వృశ్చికం రాశి వారికి నష్టపోయే ఆలోచనలు పరిస్థితులు  కాస్తా ముగిసినట్లేనని చెప్పవచ్చు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది.

మేష రాశివారు:-

ఈ రాశి వారు జూన్, అక్టోబరు మధ్య కాలంలో ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు తర్వాత వీరి గ్రహస్థతులు మారిపోతాయి. మరొక వైపు, ఈ రాశి వారికి వారి బంధువులు, సహచరులతో మంచి సానిహిత్యం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రాశివారు వ్యాపార విస్తరణలు లేదా ఏదైనా వ్యవస్థాపనలు చేయడానికి ఈ సంవత్సరం వీరికి చాలా మంచిది. అలాగే ఈ రాశివారికి మరో 6 నెలల్లో వారి జీవితాల్లో వారి జీవిత గమనాన్ని మార్పుచేసు కోగలిగే సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే ఇప్పటికే ఈ రాశివారి జీవితాల్లో ఆనందం ప్రవేశించింది.

సింహ రాశి వారు:-

ఏడాది పాటుగా ఈ రాశివారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. గ్రహస్థితి గ్రహదృష్టి మార్పు జరుగుతుండటంతో తరువాత  కాలంలో  ఈ రాశి వారు స్వంత ఇంటిని నిర్మించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.

సింహరాశి వారి జీవితంలోకి మరింత అదృష్టం రానుంది. ఈ సమయంలో మీ అధికారులు, సీనియర్లు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే వారితో స్నేహ సంబంధ అలు బలపడనున్నాయి. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఇక మీదంతా మంచి సమయమే. మీ చుట్టూ అంతా మంచి సమయం నడుస్తుంది. మీరు చేయవలసినదంతా మీ కోపాన్ని అవసరానికి అదుపుచేసుకోవడం, నియంత్రించుకోవడమే.

తులా రాశి వారు.

ఈ రాశి చక్రం వారు ఇక ప్రతి క్షణం ఆనందమయమే.
3 సంవత్సరాల పాటు ఈ రాశి వారు సంతోషమయమైన జీవితాన్ని గడపనున్నారు. ఆర్ధి లావాదేవిలల్లో లాభాలు ఉద్యోగం చేసేవారైతే అనుకోకుండా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వద్దన్నా వస్తుంటాయి. అలాగే వ్యక్తిగత జీవితాలు సంతోషంగా, జీవితంలో ఊహించనంత ఆనందాన్ని పొందుతారు. కాలం కలసిరావటానికి వేచి చూడాలి. ఇక ఈ రాశుల వారి నుండి డబ్బు తీసుకునిగానీ, మరోవిధంగా డబ్బును తరిగి ఇవ్వకుండా ముప్పతప్పలు పెట్టేవారు ఎవరైనా ఉంటే, మొండి బకాయిలుంటే వారు కూడా వీరి వద్దకే వచ్చి డబ్బు చెల్లించిపోతారు. ఇంతకాలం జీవితం మీద విరక్తి కలిగి విసిగిపోయిన వీరికి ముందువున్నదంతా మంచికాలమే.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: