చాణక్య నీతి
చాణక్య నీతి!
.
ఏకవృక్షసమారూఢా నానా వర్ణా విహఞ్గమాః |
ప్రభాతే దశసు దిక్షు తత్ర కా పరివెదనా ||
-
జీవితం లో నైనా ఇదే జరుగుతుంది! ఎవరెవరో ఎక్కడెక్కడ నుండియో వస్తారు . తమ పని తీరిపోతూనే ఎవరిదారి వారిదే! ఈ విషమై వాల్మీకి రామాయణములో ఈ విధముగా అంటాడు.
యదా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవే
సమేత్యపి వ్యపేయేతాం కాలమసాధ్య కంచన
ఒక పెద్ద వరదలో అటువైపునుండి ఒక దుంగ ఇటువైపునుండి ఒక దుంగ కలిసి కొంత దూరము పయనించుతాయి. కానీ ఆవి కాలమనే ఒరవడికి విడిపోతాయి. ఇది ప్రకృతి సహజము. పైగా ఇక కలవవు అని కూడా చెప్పలేము. లేక తప్పక కలుస్తాయి అనలేము. ఒకే చెట్టు పక్షులు ఎటు తిరిగినా రాత్రికి రావలసినదే కదా! చెట్టుకు కూడా ఆ సహనము కావాలి.
మనకైనా పై విషయము అదే విధముగానే వర్తిస్తుంది. ఏవేవో కారణాలతో ఒకేచోట పోగైనవారు తమ అవసరము తీరగానే తమదారి తాముచూసుకొంటారు. వారు కృతజ్ఞత చూపలేదే అని మనము బాధపడితే కోరి రోగాలు కొనితెచ్చుకోవడమే! దానికంటే వారి రాకపోకలవల్ల మనకు వచ్చిందీ లేదు పోయిందీ లేదు అని ఊరకుంటే ఆరోగ్యము వుంటుంది ఆనందమూ వుంటుంది.
ఆశ్రయించినవారికి అయినంతవరకు సమకూర్చు. కృతజ్ఞత చూపలేదని కృంగిపోవద్దు.
Comments
Post a Comment