54.ఏకవింశతిమహాదోషములు - అపవాదములు

54. ఏకవింశతిమహాదోషములు - అపవాదములు



1. పంచాంగ శుద్ధిహీన - ఏష్యము, దుష్టగ్రహవేధ,క్రాంతులు, వైప్రా, అనుదోషములు గల రోజులు కాని బుధ, గురులు బలముగా నున్నచో దోషములు లేదు.


2. సూర్య సంక్రాంతి - రవి ప్రవేశమునకు 19 ఘడియలు ముందు వెనుకలు, మేష, కర్కాటక,తులా, మకర, సంక్రమణములకు ఆయన ప్రవేశములకు 30 ఘడియలుముందు వెనుకలు దోషము.

3. పాపషడ్వర్గలు - లగ్న, హోర, ద్రేక్కాణ, నవాంశ,ద్వాదశాంశ, త్రింశాంశల యందు పాపగ్రహములు లేకుండుట.

4. భృగుషట్కం - ఉచ్చంగతుడైన శుక్రుడు 6వ యింట ఉండకూడదు. శత్రునీచ స్థానములో అస్తంగతుడైన దోషము లేదు అని కొందరందురు. కాని, ప్రమాణములు కానరావు.

5. అష్టమకుజ - 8వ యింట కుజుడు ఉచ్చస్తుడైను కాకున్నను దోషమే శత్రునీచ అస్తంగతుడైన దోషము లేదు.

6. గండాంతము - 10 ఘ।।ల మధ్యమ 4-9 మధ్యమ 10-11 మధ్యమ 4ఘ।।లు తిథి గండదోషము. ఆశ్రేష, మఘ, జ్యేష్ట, మూల, రేవతి,అశ్వినుల మధ్య 4 ఘ నక్షత్ర గండదోషము. నంద తిథులకు ప్రారంభమున 2 ఘడియలు, పూర్ణ తిథులకు అంత్యమున 2 ఘడియలు గండాంతములగును.

7. రాశిగండదోషము - కర్కాటక, సింహ, వృశ్చిక,ధనుస్సు, మేష, మీన రాశుల మధ్య 4ఘడియలుచంద్ర గురులు శుభులైనచో ఈ దోషము బాధించదు.

8. కర్తరీ - లగ్నమునుండి 2వ యింట వక్రగ్రహము 12వ యింట ఋజుగ్రహము, సమభాగములనున్న దోషము. 1, 4, 5, 7, 9, 10, 11వ యింట బుధ, గురు,శుక్రులున్న దోషము లేదు. ఈ కర్తరులందు గృహనిర్మాణాది పనులు చేయరాదు. తదితర వివాహాది శుభముహూర్తములకు ఈ కర్తరీ దోషముతో సంబంధం లేదు.

9. రిఃఫషష్ఠాష్టమ, సగ్రహచంద్ర - చంద్రుడు 6,8,12వ యింట జన్మలగ్న నక్షత్ర లగ్నములకు 8వ లగ్నము, 8వ యింట చంద్రుడున్నను అష్టమాధిపతి లగ్నమందున్నను దోషము. ఆయా 8 స్థానములు శుభగ్రహ వీక్షణ పరస్పర మైత్రులు కలిగినచో దోషము లేదు.

11. అష్టమచంద్ర- అష్టమచంద్రుడైనచో, ఆ చంద్రుడు నీచ నవాంశగతుడైనచో దోషము లేదు.

12. వర్జ్య, దుర్ముహూర్తదోషములు - పంచాంగంలో వ్రాసిన వర్జ్య దుర్ముహూర్తకాలములు పనికిరావు.

13 కుళికా : ఆది 1,సోమ 2, మంగళ 12, బుధ 11, 3 శుక్ర, 7శని, 15 ఘడియలుతరువాత 4 ఘ।।కు కుళికాదోషము. లగ్నమునుండి చంద్రుడు 3,4,5,7,9,10 స్థానములతో నున్న శుభప్రదము.

14. ఖర్జూరయోగము : 1. పంచశలాక, సప్తశలాక,ఖర్జూర చక్రములందు (అభిజిత్తుతో) వ్రాసిన నక్షత్రములు ఒక రేఖపై గలవి వేధించబడును. 2. క్రూర గ్రహమునకు ముందు వెనుక నున్నవి. వేధానక్షత్రములు క్రూరాక్రాంత గలవి.

15. ఏకార్గళ - దుష్టయోగములైన, 1.వ్యాఘా-పున,2. శూల-మృగ, 3. పరిఘ-మఘ, 4. వ్యతీ-ఆశ్రే, 5. నిష్కం-అశ్విని, 6. గండ-మూల, 7. అతిగండ-అనూరాధ, 8.వజ్ర-పుష్య, 9.వైధృ-చిత్ర మొ।।గాగల నక్షత్రములు మొదటి రేఖపై నున్నచో ఏకార్గళ దోషము. సూర్య చంద్ర నక్షత్రములు 1-4, 4-1, 2-3 పా।।కానిచో దోషము లేదు.

16. ఉత్పాత - భూకంపములు, తోకచుక్కలు,మొదలగునవి ఉత్పాత అనబడును. దాని నుండి 7 రోజుల వరకు దోషము.

17. గ్రహణ : గ్రహణములు సంభవించిన నక్షత్రములు ఆ పిదప 7 రోజుల వరకు దోషము. అర్ధగ్రాస గ్రహణమైన 3రోజులు మాత్రమే వదలవలెను. ఏ నక్షత్రమున గ్రహణము పట్టునో ఆ నక్షత్రము ఆరు మాసముల వరకు ముహూర్తములకు పనికి రాదు.

18.క్రూరగ్రహ వేధ - పాప గ్రహ, ప్రవేశ వర్జ్యరాశులు పనికి రానివి. ఆ రాశులు శుభగ్రహయుక్తమైనపుడు శుభప్రదము.

19. అశుభ విబద్ధ నక్షత్రములు - పంచాంగములోని రవే, రాక్రాం, రావే, కుక్రాం, కువే, శక్రాం, శవే మొదలైననక్షత్రములు దోషములు.

20. క్రూరగ్రహ నవాంశ - లగ్న, నవాంశాధిపతులు,నవాంశులను చూచుచుండినను,లగ్ననవాంశాధిపతులు పరస్పరదృష్టి,లగ్నగతులైనను, శుభ, మిత్ర, దృష్టి కలిగినను శుభప్రదము.

21. మహావ్యతీపాత వైధృతి- శోభ, హర్షణ, శూల,వైధృతి, వ్యతీపాత, గండ అనువాటి చివర భాగములలో సూర్య,చంద్ర కాంతి దోషము కలిగిన వ్యతీపాత దోషము.

మొత్తము మీద పర్యాలోచన చేయగా, లగ్న కేంద్ర, దోషములయందు గురు, శుక్ర బలములున్నచో శుభము. ముహూర్తములకు బలము నిర్ణయించునపుడు లగ్నబలము చూచుట ముఖ్యము.

·         నైసర్గిక పాపులైన రవి, కుజ, రాహు, కేతువులు 3,6,11 స్థానములందును,

·    శుభ గ్రహములైన గురు, శుక్ర, బుధ, చంద్రులు 1,2,4,5,7,9,10,11 స్థానములందుండుట ఉత్తమము. గ్రహములెంత బలముగానున్నను లగ్నబలము లేనిచో ప్రయోజనము లేదు.

·         గర్భాధాన, వివాహ, ఉపనయన, అన్నప్రాశనలకు తప్ప, మిగిలిన సమస్త శుభ కార్యములకు లగ్నమందు చంద్రుడికంటే ఇతరమైన శుభగ్రహము లెన్ని వున్న అంత లగ్నబలము,

·         వివాహేతర శుభకార్యములకు సప్తమమునుండి ముహూర్తలగ్నమును శుభులు చూచుట మంచిది. కోణములందుండి గురుడు, షష్ఠమము నుండి కుజుడు, ఏకాదశము నుండి శని చూచుట మంచిదే అగును.

·         గురువు కేంద్రస్థానమునందు, రవి ఏకాదశమునుండి అన్నచో సమస్తదోషములు పరిహారమవుతాయని శాస్త్రకారులు తెలిపారు.
ముఖ్యముగా ఈ దోషములు 
లేకుండగా చూసుకొనవలెను.



Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: