62.చర,స్ధిర,ద్విస్వభావ రాశులు

*చర, స్ధిర, ద్విస్వభావ రాశులు.
మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు. 

*చర రాశులు:- చర రాసులలో జన్మించిన వారికి చురుకుదనం, శీఘ్ర గమనం, దైర్యం, సాహసం, కొత్త విషయాల యందు ఆసక్తి, పరిసరాలు, పరిస్ధితులు, వృత్తులు, దినచర్యలలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. క్షణ కాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహము చూపుట, ఎప్పుడు తిరుగుతుండుట వీరి లక్షణాలు.

*వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్ధిర రాశులు.

*స్ధిర రాశులు:-స్ధిర రాశులలో జన్మించిన వారికి స్ధిరమైన అభిప్రాయాలు, సుఖ జీవనం, ఉన్న చోటును, ఇంటిని వదులుకోలేక వచ్చిన అవకాశాలు జార విడిచికొందురు. పొలం, గృహం, స్ధిరాస్తులపైనా మక్కువ చూపిస్తారు. పనులు కార్య రూపం దాల్చవలెనన్న వీరి సహాయం తీసుకొన్నచో పనులు కార్య రూపం దాల్చేదాకా నిద్రపోరు. మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు.


*మిధునం, కన్య, ధనస్సు, మీనం రాశులు ద్విస్వభావ రాశులు. 

*ద్వి స్వభావ రాశులు:- ద్విస్వభావ రాశులలో జన్మించిన వారికి పలు అంశాలపైనా సమన్వయం ఉండును. వ్యాఖ్యాతలు, భోధన చేసేవారుగా రాణిస్తారు. సందేహాలు ఎక్కువ, సంకోచాలు ఎక్కువ, ఏ విషయాన్ని నిర్దారించలేరు. తొందరగా ఒక నిర్ణయానికి రాలేరు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు. స్వతంత్రంతో ఏ పని చేయలేరు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: