63.ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి.


కాక్ - సి.వో.సి (coc) అంటే ఏమిటి? వాస్తులో "కాక్" పదానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇంటిలో ఎంతో కాలంగా ఉపయోగించని వస్తువుల్ని ఏరిపారేసి ఆయా దిక్కుల్లోని పంచభూతాలకు పరిశుభ్రమైన గాలిని అందించే ప్రక్రియనే క్లియరింగ్ ఆఫ్ క్లట్టర్ (సి.వో.సి - coc - కాక్) అంటారు. ఇంటి ఆవరణ, వంటగది, పడక గదులను తప్పనిసరిగా ఈ ప్రక్రియతో ఎప్పుడూ క్లీన్ చేస్తూనే వుండాలి. అంటే అష్టదిక్పాలురకు నిరంతరం పంచభూతాలతో అనుసంధానం వుండేట్లు చేస్తూనే వుండాలన్నమాట. తూర్పులోని చెత్త అంటే పనికిరాని సామానులుంటే అది మీ పరువు ప్రతిష్టలపైనా, వృత్తి మీదా, డబ్బు పైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. పడమరలోని చెత్త దరిద్రాన్ని, నీటి కొరతను, శరీరంలో డీహైడ్రేషన్‌ను కల్గిస్తుంది. దక్షిణంలోని చెత్త వల్ల అనారోగ్యం, ఉత్తరంలోని చెత్తవల్ల అధిక ఖర్చులూ, నైరుతీలోని చెత్తవల్ల నిద్ర పట్టకపోవడం, వాయవ్యంలోని చెత్తవల్ల పిల్లలు చదువులో వెనుకబడిపోవడం, ఈశాన్యంలోని చెత్తవల్ల దైవ కృపకు దూరం అయ్యి శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడటం వంటివి సంభవిస్తాయి.


ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ? సైద్ధాంతికపరంగా ఏ గది ఎక్కడ వుంటే మంచిది. ఏ గదిలో ఏయే వస్తువుల్ని వుంచుకోవచ్చు అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే సిద్ధాంతం వేరు, దానిని జౌపయోగికంగా (ప్రాక్టికల్) ఉపయోగించడం వేరని మనం తెలుసుకోవాలి. పెన్సిలిన్ ఇంజక్షన్ మందులోని ఫార్ములా ఒకటే అయినా భిన్నరకాల వ్యాధులకు దానిని ఉపయోగించే తీరుమారినట్లుగా అన్నమాట.ఈ చిత్రం కేవలం సిద్ధాంతపరమైన గదుల అమరికలను, వాటిలో వుంచాల్సిన వస్తు సముదాయాల్ని మాత్రమే సూచిస్తుంది. ఇదే రీతిలో ఇళ్ళు కట్టిన వారందరికీ అభివృద్ధి వుంటుందన్న నియమం లేదు. ఆయా వ్యక్తుల జాతకాల్లోని గ్రహబలాన్ని అనుసరించి ఇంటి నిర్మాణంలోని గదుల హోదా, వుంచాల్సిన వస్తువుల జాబితాలో మార్పు చెందుతాయని గ్రహించాల్సివుంది. నాలుగు ప్రధాన దిక్కులైన తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి మనిషి జీవితంలోని నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు పరోక్షమైన సూచికలు (ప్రతీకలు). తూర్పు ధర్మం, పడమర కామము, ఉత్తరం అర్థము (డబ్బు) ,దక్షిణం మోక్షము(మృత్యువు - పరలోక ప్రయాణాలు మొదలైనవి అని అర్థము). ఒక్కో దిక్కు, ఆ దిక్కును పాలించే దేవతలకు ఇష్టమైన రంగులూ, వస్తువులూ వుంటాయి.



Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: