55.వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు
55.వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు
వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు
పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము.
కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి.
(భట్టభాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః।(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః))
శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।
మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥
చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా।
మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।
అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥2॥
వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...
1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము
2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము
3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము
4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము
5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము
6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము
7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము
8. రౌద్రీ శాంతి ---85 వ సంవత్సరము
9.కాలస్వరూప శౌరి శాంతి ---90 వ సంవత్సరము
10. త్ర్యంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము
11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము
Comments
Post a Comment