59.ఏలి నాటి శ‌ని ప్ర‌భావం

59.జాత‌క చ‌క్రంలో 12 రాశులు ఉంటాయని తెలిసిందే. అయితే ఆయా రాశుల్లో గ్ర‌హాలు ప్ర‌వేశించిన‌ప్పుడు గ్ర‌హ ప్ర‌భావం ప్రారంభ‌మ‌వుతుంది. ఇక శ‌ని గ్రహం 12, 1, 2 స్థానాల్లో ప్ర‌వేశిస్తుంది. అలా ప్ర‌వేశించిన‌ప్పుడు ఏలి నాటి శ‌ని ప్ర‌భావం ఉంటుంది. ఒక్కో స్థానంలో శ‌ని రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఉంటాడు. అప్పుడు మొత్తం క‌లిపి ఏడున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతుంది. అందుకే ఏలినాటి శ‌ని ప్ర‌భావం ఏడున్న‌ర సంవ‌త్స‌రాల పాటు ఉంటుంది. ఇలాంట‌ప్పుడు ఎవ‌రికైనా ప్రాణభయం, ధనం లేకపోవడం, అథ‌మ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి. శ‌ని ప్ర‌భావం త‌గ్గాలంటే ఎవ‌రైనా కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే... * విష్ణు సహస్ర నామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాలి. * ప్రతి శనివారం శని దేవునిని ఆరాధించాలి. * నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. * పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. * కాకుల‌కు ఆహారం పెడితే మంచిది * ఆవుల‌కు ఆహారం పెట్టాలి. న‌ల్ల చీమ‌ల‌కు చ‌క్కెర వేయాలి. * యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెట్టాలి. * ఈశ్వ‌రాధ‌న‌, హ‌నుమంతుడి ఆరాధ‌న చేసినా శ‌ని ప్ర‌భావం త‌గ్గుతుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: