వివిధ రకాల గణపతులు - పూజలు - ఫలితాలు

వివిధ రకాల గణపతులు - పూజలు - ఫలితాలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
వివిధ గణపతులను పూజించటం వల్ల వచ్చే ఫలితాలు 
☘☘☘☘☘☘☘☘☘
1. ఎర్ర చందనం గణపతి - అనారోగ్యం నుంచి విముక్తి.


2. ముత్యపు గణపతి - మానసిక ప్రశాంతత.

3. పగడపు గణపతి - రుణ విముక్తి.

4. మరకత గణపతి - వ్యాపారాభివృద్ధి.

5. చందనం గణపతి - ఉద్యోగం, సంఘంలో గౌరవం.

6. స్ఫటిక గణపతి - భార్యాపుత్రులతో సుఖజీవనం.

7. నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి.

8. సైకతశిల గణపతి - పీడల నుంచి విముక్తి.

9. శ్వేతార్క గణపతి - విఘ్న వినాశనం.

నవగ్రహదోష నివారణ-వివిధ గణపతుల పూజలు ............

1. రవి - ఎర్ర చందనం గణపతిని ఆదివారం పూజించాలి.

2. చంద్రుడు - వెండి, లేదా ముత్యం, లేదా పాలరాతి గణపతిని సోమవారం పూజించాలి.

3. కుజుడు - రాగి లేదా పగడం గణపతిని మంగళవారం పూజించాలి.

4. బుథుడు - మరకత గణపతిని బుథవారం పూజించాలి.

5. గురువు - బంగారు లేదా పసుపు లేదా చందనం గణపతిని గురువారం పూజించాలి.

6. శుక్రుడు - స్ఫటిక గణపతిని శుక్రవారం పూజించాలి.

7. శని - నల్లరాయి గణపతిని శనివారం పూజించాలి.

8. రాహువు - శాండ్‌స్టోన్‌ గణపతిని ఆదివారం పూజించాలి.

ఎర్ర చందనం /రెడ్ స్టోన్ గణపతి..........

దీర్గ కాలం బాదిస్తున్న అనారోగ్యం నుంచి విముక్తి.ఆదివారం నాడు పూజించాలి.

ముత్య గణపతి/ మోతి గణేష్/ pearl ganesh.................

వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి. గణేశుని కృపా కటాక్షం ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగుతుంది. సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాలా విలక్షణమైనవి. 
ముత్యం ఒక చల్లని రత్నం. ఈ రత్నం చంద్రుడి శక్తులను గ్రహించేందుకు తోడ్పడుతుంది. ఈ రత్నం తల్లి, మృదుత్వం, దాతృత్వం, మనోహరమైన కళ్ళు, స్థిరమైన మనస్సును, ముట్టు-రుతుక్రమం, శిశువుల ప్రేమ, ఛాతీ, కుటుంబం, కుటుంబ జీవితం, అందం, జల ప్రదేశాలు, మంచి కోరికలు, గర్భధారణ మరియు శిశువు జననానికి సంకేతం.
గణేశుడి పూర్ణకుంభంవంటి దేహం, బాన వంటి పొట్ట - ఇవి పరిపూర్ణ జగత్తుకి సంకేతాలు. గజముఖం, సన్నని కళ్ళు - ఇవి సున్నితమైన పరిశీలనకి, గ్రహణ, మేథా శక్తులకు సంకేతాలు. వక్రతుండం - ఇది ఓంకారానికి సంకేతం. చుట్టి ఉండే నాగం - జగత్తును ఆవరించి ఉన్న మాయాశక్తికి సంకేతం. నాలుగు చేతులు - మానవాతీతశక్తి, సామర్థ్యాలకి  చిహ్నం. ఒక చేతిలో పాశం, దండం - బుద్ది, మనస్సులను సన్మార్గంలో నడిపించే సాథనం. మరొక చేతిలో విరిగిన దంతం (మహాభారత రచనకోసం ఆయన తన దంతాన్నే విరిచి కలంగా చేసుకొన్నాడు) - ఇది విజ్ఞాన సముపార్జన కొరకు చేయవలసిన కృషి, త్యాగాలకు సంకేతం. మరొకచేతిలో మోదకం లేదా వెలగపండు - ఇది బాహ్యంలో గంభీరత, అంతరంగంలో సున్నితత్త్వానికి చిహ్నాలు. చేటంత చెవులు - ఇవి భక్తుల మొర ఆలకించటానికి గుర్తు. ఈ మూర్తి దర్శనం జ్ఞాన, విజ్ఞాన, వినోదదాయకం.
ఈ మూర్తి దర్శనం ద్వారా అందం లేకపోయినా తెలివితేటలు, జ్ఞానం, విజ్ఞానం, ఎదుటి మనిషి చెప్పేదానిని శ్రద్ధగా వినటం, సూక్ష్మంగా ప్రతి విషయాన్నీ పరిశీలనచేయటం, ప్రకృతికి దగ్గరగా నివసించటం, ఆహారంలో పండ్లు, కూరలు (ఎక్కువ ఉడకనివి, ఆవిరిపై ఉడికినవి), నూనెలేని పదార్థాలు తినటం, ఏకసంథాగ్రాహ్యం, అహంకారం, గర్వం లేకుండా ఉండటం, ఎదుటివారివల్ల ఇబ్బందులు వచ్చినా వారిని క్షమించటం, తల్లిదండ్రులను గౌరవించటం, భక్తికే ప్రాధాన్యం, ఢాంబికంగా ఉండకపోవటం... ఇవన్నీ నేర్చుకోవాలి.
ముత్యపు గణపతిని పూజించడం వలన కలిగే లాభాలు :-
1.        స్త్రీ, పురుషులు, చిన్నా, పెద్దా ఎవరైనా సోమవారంనాడు ముత్యపు గణపతిని పూజిస్తే చంద్రుడి వలన కలిగే చెడు ప్రభావాలు తొలగుతాయి.
2.        మానసిక ప్రశాంతత కావాలని కోరుకునేవారు ముత్యపు గణపతి ఆరాధన / ధారణ చేసి తీరాలి.
3.        ముత్యపు గణపతి ఆరాధన / ధారణ ద్వార చెడు కలలు లేని మంచి నిద్రను కలిగిస్తుంది, మేథోశక్తిని, అందాన్ని మరియు ముఖవర్చస్సును పెంపొందిస్తుంది.
4.        కళలు, మందులు, ఔషధ నూనెలు, పరిమళ ద్రవ్యాలు, పాలు, నూనె, పానీయాలు, నౌకా నిర్మాణం, ఎగుమతి దిగుమతులు, కూరగాయలు మరియు పువ్వులు సంబంధిత రంగాలలో వ్యాపారం లేక ఉద్యోగం చేసేవారు ముత్యపు గణపతిని పూజిస్తే లాభాలు కలుగుతాయి.
5.        మోతి గణేశ్ ఆరాధన వలన భార్యాభర్తల మధ్య మంచి సామరస్యం, భాగస్వాముల మధ్య ప్రేమ మరియు విశ్వాసం కలుగుతాయి.
6.        సినిమా, నాటక, వ్యవసాయం, వస్త్రం, ఫోటో స్టూడియో, శిల్పం, చిత్రలేఖనం మరియు రచయితలకు మోతి గణపతి ఆరాధన ద్వారా బహుప్రయోజనాలు చేకూరుతాయి.
7.        ముత్యపు గణేష్ ఆరాధన ద్వారా డిప్రెషన్ మరియు నిరాశావాద సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
8.        చేపలు, రొయ్యల పెంపకం, భూగోళశాస్త్రం, పరిశోధన, తత్త్వశాస్త్రం, క్రీడలు, కంప్యూటర్లు, హోటల్స్ మరియు ఆభరణాల సంబంధిత రంగాల ప్రజలు మోతి గణేష్ ఆరాధిస్తే లాభాలు చేకూరుతాయి.
9.        ముత్యపు వినాయకుడి ఆరాధన మంచి జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. నిద్రలేమి, కంటి వ్యాధులు, గర్భాశయ సమస్యలు, గుండె సమస్యలు, TB, మలబద్ధకం, మూర్ఛ మొదలైనవాటికి ఉపశమనం కలుగుతాయి.
10.     సంగీతము, న్యాయవాద, ఫైనాన్స్, ఈత, వాటర్ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, గానం, క్రీడలు, స్టేషనరీ మరియు చిత్ర నిర్మాణ రంగాలవారు మోతి గణపతిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
11.     ముత్యపు గణపతి ఆరాధన వలన రక్తహీనత, కిడ్నీ సమస్య, మధుమేహం, నిద్రలేమి, పిచ్చి, ఆస్త్మా, కంటి సమస్య, రక్తపోటు, మెదడు కణితి, ఋతు రుగ్మత మరియు క్లోమ సమస్యలు, గుండెజబ్బు వంటి వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది.

12.     ప్రతి రోజు స్నానానంతరం పూజ గదిలో కూర్చుని మోతి గణేషుడ్ని తాకి “ఓం శ్రీ గణేశాయ నమ:” అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే సర్వ శుభాలు కలుగుతాయి.

హరిద్ర గణపతి.................

హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే  అన్ని విధాల ధన ,కనక ,వస్తు ,వాహనాలు వృద్ది చెందుతాయి .పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజవలన దేహ కాంతి పెరుగుతుంది .సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి .
పసుపు గణపతి లేక హల్దిగణపతి లేక హరిద్ర గణపతి పూజతో పాటు గౌరీ దేవీని పూజించటం ద్వార ఇంట్లో వుండే వధువుకు లేక వరుడుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది.
  హరిద్ర గణపతిని పూజిస్తే వారికి డబ్బు సమస్య రాదు .అప్పుల బాధ తొలగిపోతుంది.
కామెర్లు ఉన్నవారి ఇంటి వారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలిగిపోతుంది.
హరిద్ర గణపతిని పూజించి దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి .దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే వ్యాపారం అవుతుంది.గురు గ్రహం ... ఒక రాశి నుంచి బయలుదేరి తిరిగి అదే రాశికి చేరుకోవడానికి 'పుష్కర కాలం' పడుతుంది. మేధో పరమైన ఉన్నత లక్షణాలను ప్రాసాదించే గురువు, కొన్ని రకాల వ్యాధుల బారిన పడటానికి కారకుడు అవుతుంటాడు. జాతకంలో గురువు స్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోలోపల విస్తరించే షుగర్ ... కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయి.ఆయా రోగాల నివారణకు కూడా హరిద్ర గణపతిని పూజించటం శ్రేయస్కరం.

పగడపు గణపతి  (coral ganesh)................

పగడపు గణపతి ని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది.ఇంటిలోగాని,వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు,ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు,నేత్రసమస్యలు ఉన్నవారు,తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముక్యంగా రుణ విముక్తి కోసం పగడపు గణపతిని పూజించాలి.

మరకత గణపతి ....................

మరకత గణపతి ని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి,జ్ఞాపకశక్తి పెరుగును.వ్యాపారం సీగ్రంగా అభిబృద్దిపదంలో నడుస్తుంది.గుండె జబ్బులు,ప్రసరణ వ్యవస్థ లో లోపాలు,ఆపరేషన్ తర్వాత త్వరగా కొలుకోవడం, సరిచేస్తుంది. శరీరంలో ప్రాణ శక్తిని పెంపొందిస్తుంది.కంటి చూపు ని సరిగా ఉంచుతుంది.వివిధ గ్రంధుల పనితనాన్ని సరిచేయడం తో పాటు కోలేస్తాల్ తగ్గిస్తుంది.డబ్బు దుబార ని తగ్గిస్తుంది.

చందనం గణపతి....................

ఉద్యోగం లో  ఉన్నతి మరియు  సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజిస్తారు.

స్ఫటిక గణపతి................ 

భార్యాపుత్రులతో సుఖజీవనం మరియు వృత్తి ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్పటిక గణపతిని పూజించాలి.వెండి గణపతిని పూజించిన ఇదే ఫలితం ఉంటుంది.

నల్లరాతి గణపతి..................... 

అధిక శ్రమనుంచి విముక్తి మరియు శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి .అంతేకాకుండా వీధి శూలాల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహలనే వాడడం మంచిది.

సైకతశిల గణపతి/ sand  stone ganesh ................

అప్పుల వాళ్ళ వేధింపులు తగ్గడానికి మరియు ఇతర పీడల నుంచి విముక్తి సైకత సిల గణపతిని పూజించాలి.

శ్వేతార్క గణపతి ....................

శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు.

శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుందిట, ఏదైనా శుభముహూర్తాన శుచియైన తర్వాత ఆవునెయ్యి, గోరోజనం సిద్ధంగా ఉంచుకుని, ఈ ఆవు నెయ్యి గోరోజనంలో శ్వేతార్క మూలాన్ని గంథంలాగా అరగదీసి ఇష్టదైవాన్ని మనసులో ప్రార్ధిస్తూ నుదుటి మీద తిలకం వలె ధరిస్తే ఆ తిలకానికి ఉన్న వశీకరణ శక్తి స్వయంగా వస్తుంది. 

శరీర రక్ష కోసం శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం. విఘ్న వినాశనం.

వక్క గణపతి...................

జీవితం పైన విరక్తి ,ఏకాంతంగా ఉండాలనే కోరిక, తనని తాను గొపావాడిగా  ఊహించుకోవడం,ప్రతి దానికి భయపడడం, అతిగా భక్తి, వైద్యులు గుర్తించలేని రోగాలు, మానసికంగా ఆందోళన పడడం,అయిన వారిని పట్టించుకోకుండా తిరగడం మొదలైన దోషాలకి వక్క గణపతిని పూజించటం శ్రేయస్కరం.

వక్క  గణపతిని పూజించటం ద్వారా కార్యాలు సఫలిక్రుతం అవ్వటం తో పాటు కేతు గ్రహ దోషాలు నివారించబడతాయి.

కేతువు చతుర్దం లో విద్య సంబంద దోషాలు, కేతువు పంచమం లో ఉంటె సంతాన దోషాలు, కేతువు ద్వాదశం లో ఉంటె బాలారిష్టాలు ,ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు.ఆయా దోష నివారనార్దం వక్క గణపతిని పూజించండి.



Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: