వివాహానికి అనుకూలమైన వ్యక్తి ఎవరు?

వివాహానికి అనుకూలమైన వ్యక్తి ఎవరు?

నూటికి నూరుపాళ్ళు మనకు అనుకూలమైన వ్యక్తికోసం వెదకడం అసంభవమైన విషయాల్ని ఆశించడమే. 






వివాహంలో ఒడిదుడుకులు ఎందుకు ఎక్కువగా వస్తాయంటే మిగతా అన్నిటిలోకంటే ఈ అనుబంధంలో మీరు రెండవవ్యక్తితో చాలా విషయాలు పంచుకోవాల్సి వస్తుంది. సమస్య వివాహమూ కాదు, అది పురుషుడు గురించో, స్త్రీ గురించో, భర్తో, భార్యో కాదు. మీరు చాలా విషయాలు ఎవరితోనైనా పంచుకోవలసిన ప్రతి సందర్భంలోనూ ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూనే ఉంటారు.












 వివాహంలోగాని, కలిసి సహజీవనం చెయ్యడంలోగని మీరు ఒకే స్థలాన్ని , ప్రతి వస్తువునీ కలిసి పంచుకోవాలి. పర్యవసానంగా, ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఏదో ఒక విధంగా ఒకరి హద్దుల్లోకి రెండవవారు ప్రవేశించే పరిస్థితి వస్తూంటుంది. ఇతర అనుబంధాలలోనైతే, ఎవరైనా హద్దులుమీరి ప్రవర్తించినపుడు, మీరు దూరంగా జరిగిపోవచ్చు. ఇక్కడ మీకు అటువంటి అవకాశం లేదు. ఒకరి హద్దుల్లో మరొకరు ప్రవేశించడం ఎక్కువవుతున్నకొద్దీ, సంఘర్షణ ఎక్కువవుతుంటుంది. ఎంతో అందంగా జీవిస్తూ, ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమతో, ఒకరికొకరు ఆసరాగా జీవిస్తున్న దంపతులు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈ అనుబంధం ఎంతో వికృతంగానూ పరిణమించగలదు. దానికి మూసిన తలుపుల వెనక ఏమిటి జరుగుతోందో ఎవరికీ తెలియకపోవడం ఒక కారణం. రోడ్డుమీద పోతున్న వ్యక్తి మీ కాళ్లు తొక్కినపుడు మీరు ఒక విధంగా ప్రతిస్పందిస్తారు, ఎందుకంటే అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు గనుక. ఈ అనుబంధంలో ఎవరూ గమనించేస్థితిలో ఉండరు. కనుక ఏదన్నా జరగవచ్చు. ఒకరి హద్దుల్లో మరొకరు ప్రవేశించడం ఎక్కువవుతున్నకొద్దీ, సంఘర్షణ ఎక్కువవుతుంటుంది. 









వివాహం ఫలప్రదం జరగడానికి కావలసింది ఏ లోపాలూ లేని వ్యక్తి కాదు… ఏ లోపాలూ లేని వ్యక్తి భూమి మీద ఉండడు. మీకు కావలసింది ఆ వ్యక్తికి నైతిక నిష్ఠ ఉండడం. ఎవరు మిమ్మల్ని పరిశీలిస్తున్నా, పరిశీలించకున్నా మీరు ఒక్కలాగే ప్రవర్తించాలి. మీ వ్యక్తిత్వం మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అన్నదాన్ని బట్టి మారిపోకూడదు. ఒకసారి మీ ప్రవర్తనాసరళిని నిర్ణయించుకున్నాక, మరొక వ్యక్తితో ప్రతిస్పందించడం ఎంతో ఆనందదాయకంగా పరిణమించగలదు. మీరిద్దరూ ఒకరినుండి రెండవవారు ఏదో ఒకటి రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నంత సేపూ, మీ ఇద్దరిలో ఎవరికి తాము రాబట్టదలుచుకున్నది దొరకకపోయినా అది అనునిత్యం సంఘర్షణకి దారి తీస్తుంది. మీరు వ్యక్తిగా మిమల్ని మీరు పరిశీలించి చూసుకోవాలి: మీకు ఆ వ్యక్తిమీద ఉన్నది ఇలా ఉండి అలాపోయే వ్యామోహమా, లేక ఆ వ్యక్తి మీకు తోడుగా ఉండాలన్న బలమైన కోరికా? ప్రతివ్యక్తీ ఏదో ఒక అనుబంధంలో చిక్కుకోవలసిన అవసరమూ లేదు; ప్రతి వ్యక్తీ అలాగని ఒంటరిగా ఉండనూ అవసరం లేదు. ఇది ప్రతి వ్యక్తీ తమకు తాముగా తీసుకోవలసిన నిర్ణయం. మీరు ఒక తోడు లేకుండా జీవించలేననీ, వివాహం మీ శ్రేయస్సుకి ఒక సోపానమనీ అనుకున్నప్పుడే మీరు వివాహం చేసుకోవాలి. 












పెళ్ళి చేసుకోవడంలో తప్పులేదు. కానీ మీకు ఆ అవసరం ఉందని అనిపించకుండా పెళ్లిచేసుకోవడం మాత్రం నేరం. ఎందుకంటే ఇలా చేయడంవల్ల మీ జీవితమూ, కనీసం మరొక వ్యక్తి జీవితమూ దుర్భరం అవుతాయి గనుక. ఈ మానవజాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే, అందరినీ వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తాము. కానీ ప్రపంచ జనభా విస్ఫోటనం చెందుతోంది. మీరు పిల్లల్ని కనకపొతే మీరు మానవజాతికి మహోపకారం చేస్తున్నట్టే. అది పక్కనబెడితే, ముఖ్యమైన విషయం అందరూ పెళ్ళిచేసుకోవలసిన అవసరం లేదన్నదే. “నాకు తోడు అవసరమా?” అని ఎవరొ గౌతమ బుద్ధుణ్ణి అడిగితే ఆయన, “మూర్ఖుడితో ప్రయాణం చెయ్యడం కన్నా, ఒంటరిగా ప్రయాణం చెయ్యడమే మిన్న” అని సమాధానం చెప్పాడట. నేను అంత నిర్దాక్షిణ్యంగా ఉండను. నేను “మీకు మీ వంటి మూర్ఖుడే దొరికితే ఏదో ఒక అంగీకారానికి రావొచ్చు” అని అంటాను. అందరూ వివాహం చేసుకుంటున్నారు కాబట్టి నేనూ చేసుకోవాలనుకునో, ఒంటరిగా ఉండవలసి వస్తుందన్న భయం చేతనో, సమాజం ఏమని అనుకుంటుందో అన్న భయంవల్ల కాకుండా, మీ వ్యక్తిగత అవసరాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. మీరు గుర్తుంచుకోవలసిన మరొక విషయం, మీకు ఆసరా కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మీరు తోడుని కోరుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటి? “నేను దారి తప్పిపోతే, నాతోపాటే దారితప్పిపొయే మరో వ్యక్తిని తోడు తీసుకుందాం,” అన్నది కాకూడదు. 








వివాహమూ, సహజీవనమూ అస్తిత్వ సమస్యకి పరిష్కారాలు కావు. అవి మీ వ్యక్తిగత అవసరాలు కొన్ని తీర్చడానికి పనికి వస్తాయి అంతే. మీకు బలమైన శారీరక, భావావేశాత్మక, మానసిక అవసరాలుంటే, మీరు తప్పకుండా ఒక తోడు వెతుక్కోవలసిందే. మీరు కేవలం సామాజిక ఆర్థిక కారణాలకోసమే పెళ్లి చేసుకోకూడదు. మీరు గుర్తుంచుకోవలసిన మరొక విషయం, మీకు ఆసరా కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. 









మీరు ఆశించే ఆసరా, శరీరకమైనది కావచ్చు, భావావేశాత్మకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, సామాజికమైనదీ, ఆర్థికమైనదీ అయినా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ, మీరు ఒకరికి ఉపకారం చెయ్యడానికి పెళ్లి చేసుకోవడం లేదు. మీరు పెళ్లి చేసుకుంటున్నది మీకు కొన్ని అవసరాలు తీరాలి గనుక. అవతలి వ్యక్తి మీకు మీరు కోరుకున్నది ఇవ్వడానికి సిద్ధపడినపుడు మీరు కృతజ్ఞతతో ఉండగలిగితే, అనుబంధంలొ సంఘర్షణలు తలెత్తే అవకాశమే లేదు. 









ఆదర్శ పురుషుడుకోసమో, ఆదర్శ స్త్రీ కోసమో వెతకొద్దు. అటువంటి వాళ్లు ఎవరూ లేరు. మీ అవసరాలే మీరొకతోడుకోసం వెదకడానికి కారణమని మీరు గ్రహించినపుడు, ఆ అవసరాలు తీరడానికి తగిన వ్యక్తిని ఎంపికచేసుకొండి. మీరు ఆ వ్యక్తిని అంగీకరించి, గౌరవించి, ప్రేమించి, మీ జీవితంలోకి ఆహ్వానించి, ఆ వ్యక్తి శ్రేయస్సు కాంక్షించి, ఒకరి బాధ్యత ఒకరు తీసుకోవడానికి మీరిద్దరూ సిద్ధపడిననాడు, అది ఎంతో అందమైన అనుబంధంగా రూపుదిద్దుకోగలదు. నీడపడకుండా .. ప్రతి ప్రేమికుడూ కోరుకునేది రెండుజీవితాలు ఒకటి కావాలని. మరొక జీవితంతో ముడిపడాలని కోరుకునే ఈ సమ్మేళనా కాంక్ష జీవితపు పరిపూర్ణత అనుభవించడం కొరకే. సౌందర్యం కేవలం కలిసి ఉండడంలో లేదు ఇద్దరి ఆలోచనలూ ఋజుమార్గంలో ఉండగలగడం .

    
ఒక స్త్రీ, ఒక పురుషుడి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు కలిస్తేనే వారు దంపతులుగా జీవితాంతం సుఖంగా జీవిస్తారని అందరూ చెబుతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ వారిరువురూ కలకాలం ఎంతో అన్యోన్యంగా ఉంటారని అంటారు. అయితే కేవలం అలవాట్లు, అభిరుచులే కాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం దంపతుల రాశులు మ్యాచ్ అయినా కూడా వారు జీవితాంతం సుఖంగా కలిసిపోయి ఉంటారట. ఈ క్రమంలో దంపతులకు ఏయే రాశులు ఉంటే మంచిదో, ఏయే రాశులు ఉన్న వారికి మ్యాచింగ్ కరెక్ట్‌గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.







తుల – సింహ రాశులు…
ఈ రాశులను కలిగి ఉన్న దంపతులు సామాజికంగా ఎక్కువ ఉత్తేజంగా ఉంటారట. వీరు ఎక్కడ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట. ఎల్లప్పుడూ ఓపెన్‌గా ఉంటారట. దంపతుల్లో ఒకరికి సింహ రాశి ఉంటే వారు డిమాండింగ్‌గానూ, తుల రాశి ఉన్న వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వారు గానూ ఉంటారట.


మేషం – కుంభ రాశులు…
దంపతుల్లో ఒకరికి మేషం, మరొకరికి కుంభ రాశి ఉంటే వారు ఎల్లప్పుడూ సాహస కార్యాలంటే ఇష్ట పడతారట. కొత్త వాటిని కనిపెట్టడంలో సృజనశీలురై ఉంటారట. దంపతులిరువు ఒకరికి ఒకరు స్వేచ్ఛను, ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటారట.




మేషం – కర్కాటక రాశులు…
లైఫ్ పార్ట్‌నర్స్‌లో ఒకరికి మేషం, మరొకరికి కర్కాటకం ఉంటే వారు ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా ఉంటారట. ఏ పని చేసేందుకైనా వెనుకాడరట. జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మరింత శక్తిశీలురవుతారట.



మేషం – మీన రాశులు…
మేషం, మీన రాశులు ఉన్న దంపతులు మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారట. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భేద భావాలు వారిలో రావట. ఒకరితో ఒకరు సులభంగా సర్దుకుని పోతారట. వారి సంబంధం జీవితాంతం కొనసాగుతుందట.



వృషభం – కర్కాటక రాశులు…
ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు గౌరవించుకుంటారట. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటారట. వీరిద్దరూ జీవితాంతం అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తారట.



మకరం – వృషభ రాశులు…
ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకుంటారట. ఒకరినొకరు ఎల్లప్పుడూ గౌరవించుకుంటూ, పొగుడుకుంటూ ఉంటారట. వీరిది కూడా అన్యోన్య దాంపత్యమేనట.




ధనుస్సు – మేష రాశులు…
ధనుస్సు, మేష రాశులను కలిగి ఉన్న దంపతులు అత్యంత అన్యోన్యంగా ఉంటారట. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుందట.


కర్కాటకం – మీన రాశులు…
ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తారట. ఎవరినీ నొప్పించని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారట.


సింహం – ధనుస్సు రాశులు…
ఈ రాశులు ఉన్న జీవిత భాగస్వాములు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే ధోరణిని కలిగి ఉంటారట. ఒకరిపై ఒకరికి బాగా నమ్మకం ఉంటుందట. వారు తమకు తామే సమస్యలను పరిష్కరించుకుంటారట.



కన్య – మకర రాశులు…
ఈ రాశులు ఉన్న దంపతులకు ఒకరంటే ఒకరికి ఆకర్షణ కలుగుతుందట. అదే వారిని జీవితంలో ముందుకు తీసుకెళ్తుందట. ఎల్లప్పుడూ ఓపెన్‌గానే మాట్లాడుకుంటారట.




సింహం – మిథున రాశులు…
సింహం, మిథున రాశులను కలిగి ఉన్న దంపతులు సాహస కృత్యాలంటే ఇష్టపడతారట. వీరు తమ తమ జీవిత భాగస్వాములను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు సాగుతారట.



కుంభం – మిథున రాశులు…
ఈ రాశులను కలిగి ఉన్న దంపతులు తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిబ్బరంగా ఉంటారట. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారట. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారట.


వృశ్చికం – సింహ రాశులు…
ఈ రాశులు ఉన్న దంపతులు తమ వ్యక్తిత్వాలు, స్వభావాలతో మంచి సంబంధాలను కలిగి ఉంటారట. వృశ్చికం రాశి వారిని సింహ రాశి వారు అన్ని విషయాల్లోనూ సంతృప్తి పరుస్తారట.



మిథునం – తుల రాశులు…
దంపతులిద్దరిలో ఒకరికి మిథునం, మరొకరికి తుల రాశి ఉంటే వారు లైంగిక పరంగా మంచి సంబంధాలను కలిగి ఉంటారట. వారిరువురు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారట.






Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: