శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రసిద్ద తత్వగీతి.

ఆకసంబు ఎర్రనవ్వును - ఆరు మతములు ఒక్కటవ్వును..
ఇది శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రసిద్ద తత్వగీతి.
ఇప్పుడు మనం గొప్పగా జబ్బలు సర్సుకుంటు మాట్లాడుతున్న దళిత, బహుజన ఐక్యతను, మహిళా విద్య, మహిళా సాధికారతను 400 ఏళ్ళకు ముందే ఆచరించి చూపిన మహోన్నతుడు.

మహిళలు చదువుకుంటే అరిష్టం అని మహిళలకు విద్యను దూరం చేసిన బ్రహ్మణులను సవాలు చేస్తూ గరిమిరెడ్డి అచ్చమ్మ - రెడ్డి కి, ఈశ్వరమ్మకు విద్యను...

దూదేకుల సిద్దయ్యను, మాదిగ కక్కయ్యను శిశ్యులుగా చేర్చుకుని వారికి విద్యనందించడం..

పురుషాధిక్య సమాజానికి ప్రతిగా మనుమరాలు ఈశ్వరమ్మకు మఠం బాధ్యతలు అప్పగించునట్లు చేసి, మహిళలకు నాయకత్వాన్ని అందించడం..

తన తదనంతరం బార్యను సమాజంలో ముత్తైదువ తనానికి చిహ్నంగా భావించే తాళి, మెట్టెలు, పసుపు, కుంకుమలను త్యజించవద్దని తెలపడం..

ఇవన్నీ ఇప్పుడు ఆచరించకుండా కేవలం వేదికలపైనే ఉపన్యాసాల్ని దంచుతున్నారు. 
వీరబ్రహ్మం ఆలోచనా విధానం వర్ధిల్లాలి..

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: