సాయనా చార్యగణన

సాయణా చార్యులవారు నిర్వచించిన కాంతి వేగము.

శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వందలు మరి రెండు యోజ
నములు గమన వేగ మమరిన రవి తేజ!
భవ్య వేగ! నీకు వందనములు. 
భావము.  అర్థ నిమేషమునందు 2202 యోజనముల మార్గమును ప్రయాణించు ఓ ప్రకాశమా నీకు నమస్కారము.

1 యోజన – 9 మైళ్ళ 160 గజాలు అనగా 9.11 మైళ్ళు
1 పగలు రాత్రి – 8,20,000 అర్థనిమిషములు 
 అనగా ఒక సెకనుకు – 9.41 అర్థనిమిషములు
 ఈ విధముగా మనము లెక్ఖించినచో ప్రతి అర్థనిముషానికి 2202 x 9.11 = 20,060.22 మైళ్ళు 
 అటులనే ప్రతి సెకనుకు 20,060 x 9.41 = 1,88,766.67 మైళ్ళు .
 1889 లో కాంతివేగాన్ని ప్రతి సెకనుకు1,87,327.5 మైళ్ళుగా మైకెన్సన్ ప్రకటించాడు. 
 సాయనాచార్యుల గణనకు   ఇది సుమారుగా సరిపోతుంది.



Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12