2019 చిన్న పిల్లలను బుజ్జగించడం

తమ పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులైతే చూడాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు.

తల్లిదండ్రులు   పిల్లలను అర్థం చేసుకోకుండా క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని దండిస్తున్నారు

తల్లులు తమ పిల్లలు ఫలానా వాళ్లతోనే ఆడుకోవాలని నిర్దేశిస్తున్నారు. క్రమశిక్షణ, పిల్లలు తమ మాటే వినాలనే పట్టుదలతో కనీసం వారిని బయటకు కూడా పంపని తల్లిదండ్రులు 62%మంది.

72%మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దండించిన తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు. 19% మంది తల్లిదండ్రులు ‘పిల్లలు క్రమశిక్షణతో పెరగాలంటే దండనే ఏకైక మార్గం’ అని విశ్వసిస్తున్నారు.

తల్లిదండ్రులు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలు అల్లరిచేయడం లేదా విసిగించడం వంటివి చేస్తే 76.4% మంది తల్లిదండ్రులు వెంటనే వారిపై చెయ్యెత్తుతున్నారు.  భోజన సమయంలో, నిద్రపుచ్చేటప్పుడు పిల్లలు మారాం చేస్తే వారిపై చెయ్యి చేసుకునే తల్లిదండ్రులు 76% మంది.

పిల్లలకు తొడపాశం పెట్టడం, వారిని దండించడం వల్ల కలిగే ప్రభావాల గురిచి 69% మంది తల్లిదండ్రులకు తెలిసినా ఆ సమయానికి మాత్రం నియంత్రణకోల్పోయి వారిపై విశ్వరూపం చూపిస్తున్నారు.భార్యా భర్తల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, బాధ్యతా రాహిత్యం వలన దండించడం, వారికి తొడపాశం పెట్టడం వంటి చర్యల వల్ల కలిగే నష్టాలు గురించి తెలిసిన వారే ఇలా చేస్తారు.  పిల్లల్ని అతి గారాబం చేస్తున్నామన్న భ్రమలో కొంత మంది తల్ వారిపిల్లలపై ఆంక్షలు విధిస్తున్నారు.

 తల్లిదండ్రుల పెంపకంపై అవగాహన పెంచి, పిల్లలకు మంచి పేరెంటింగ్‌ను   అందివ్వడమే అని చెప్పారు.

 దేశవ్యాప్తంగా పిల్లలపై ప్రతికూల భావోద్వేగాలు ప్రదర్శిస్తున్న తల్లిదండ్రులందరూ విద్యావంతులే కావడం గమనార్హం. కాలంతో పాటు పరిగెట్టే క్రమంలో వారి బాధ్యత మర్చిపోతున్నారు. ఇంట్లో ఉన్న కాస్త సమయాన్నైనా పిల్లలకోసం కేటాయించలేకపోతున్న తండ్రులు ఎందరో ఉన్నారు.  




ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే కథలు చెప్పడం, బుజ్జగించడం లాంటివి చేసేవారు.

వారికి చిన్నతనం నుంచే మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లెట్ల వంటి పరికరాలు  ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం, పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి

మెదడు ఎదుగుదలకు అడ్డుగా :  పిల్లలు పుట్టిన మొదటి ఏడాదిలో వారి మెదడు దాదాపు 300 శాతం అభివృద్ధి చెందుతుంది. 

ఈ వయసులో చిన్నారులతో త్రీడీ తరహా వస్తువులైన బంతితో ఆడుకోనివ్వడం వల్ల వారు అనేక విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది.
స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. బంతి వంటి వస్తువుల్ని పట్టుకున్న చిన్నారికి ఏ వస్తువు తినేది, ఏవి తినకూడనివీ అనేదానిపై అవగాహన కలుగుతుంది. బొమ్మలు, ఆట వస్తువులిచ్చి పక్కన కూర్చుని ఆడించకుండాలి.  ఇది వారి ఎదుగుదలకు పరోక్షంగా అవరోధంగా మారుతోంది. 

ఆలస్యంగా మాటలు రావడం :  కన్నబిడ్డలు తొందరగా అమ్మా, నాన్నా అని పిలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలకు త్వరగా మాటలు రావాలంటే తల్లిదండ్రులు రోజూ వారికోసం కచ్చితంగా కొంత సమయం కేటాయించాలి. వారిని మాట్లాడించే ప్రయత్నం చేయాలి. అప్పుడే పిల్లలు వారితో మాట్లాడుతున్న వారి ముఖ కవళికలూ, శబ్దాలు గమనిస్తూ మాట్లాడడం నేర్చుకుంటారు.

ఇలా చిన్న వయసులో ఈ తరహా స్మార్ట్‌ పరికరాలతో సావాసం చేయడం వల్ల పిల్లలకు మాటలు రావడం ఆలస్యం అవుతోంది.

తక్కువ పదాలు నేర్చుకుంటారు : తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడే సమయంలో దాదాపు 940 పదాలు మాట్లాడతారు. సాధ్యమైనంత వరకూ చిన్న పిల్లలను ఎంత ఎక్కువగా మాట్లాడిస్తే అంత త్వరగా మాటలు నేర్చుకుంటారు.

శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం :  రెండు గుంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూస్తే వారి శారీరక దృఢత్వం, చదువుపై ఆసక్తి తగ్గడం లాంటి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

  పరిమితికి మించిన స్మార్ట్‌ పరికరాలు పిల్లలు వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: