ఈనాడు ,,,,25/2/2018

మనిషి ప్రపంచాన్ని దూరం పెడితే- అది ఏకాంతం! ప్రపంచమే మనిషిని దూరంగా ఉంచితే- అది ఏకాకితనం.

ఊసులాడుకుంటూ

తనదైన ప్రపంచంలో హాయిగా విహరిస్తూ ఉంటుంది. 

. ఆ ఏకాంతానికైనా, ఈ ఒంటరితనానికైనా మనసే కారణం అంటుంది వేదాంతం. 

‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః - బంధానికీ బంధవిముక్తికీ మనసే మూలం’ అంది ఉపనిషత్తు. కాబట్టే, మనిషికి బలమూ బలహీనతా- మనసే అంటారు అనుభవజ్ఞులు. అది ఎక్కడుందో, ఎలా ఉంటుందో మాత్రం మనిషికి తెలియదు. ‘ఉండటం అయితే ఉంది’ అంది ఐతరేయ బ్రాహ్మణం . ‘శరీరం కన్నా భిన్నమైనది... అది అపూర్వమైనది... ప్రజాపతి దాన్ని మనిషిలోనే నిక్షిప్తం చేశాడు’ అని వివరణ ఇచ్చింది.

అది దేనికి ఉప్పొంగిపోతుందో, ఎందుకని కుంగిపోతుందో మాత్రం చెప్పలేదు. ప్రేమకు కరిగిపోతుంది. క్షణాల్లో పెరిగిపోతుంది. అంతలోనే ఒక్క మాటతో విరిగీ పోతుంది.

‘మనసే మనిషి ప్రత్యేకత’ అని యోగ వాసిష్ఠం స్పష్టంగా చెప్పింది. 

 ‘సజీవుడు’ అనే మాట మనిషికి మాత్రమే వర్తిస్తుంది... ఎందుకంటే ‘మననే వహి జీవతి’... మనసుతో జీవిస్తాడు కాబట్టి’ అని బోధించింది.

ప్రయాణం సజావుగా సాగడానికే బుద్ధి అనే ఆయుధాన్ని మనిషికి దేవుడిచ్చాడు. ‘మెదడన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విశ్వరహః పేటిక విపాటన జరగక తప్పదు’ అన్న మహాకవి పలుకులను మనం బుద్ధికి అన్వయించుకోవాలి.

మనసు మదగజం లాంటిది. అది తన (మానస) సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తుంటే, మొసలి ‘పవనున్‌ బంధించి పంచేంద్రియ ఉన్మాదంబుం పరిమార్చి బుద్ధిలతకున్‌ మారాకు హత్తించె’ అని భాగవతంలోని గజేంద్ర మోక్షం వర్ణించింది. ఇక్కడ మనసును ఏనుగుగా, మొసలిని బుద్ధిగా అన్వయించుకుంటే ‘అక్రము (మొసలి) విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్రమై... అన్న పోతన వర్ణనలోని ఆంతర్యం మన బుద్ధికి తోస్తుంది. తప్పులు చేసేది మనసయితే మనపెద్దలు ‘బుద్ధిలేదా’ అంటూ ఎందుకు నిలదీస్తారో తెలుస్తుంది.

కొట్టుమిట్టాడే మనసును ఓదార్చి, దానికి వాస్తవాన్ని ఎరుకపరచే మార్గదర్శి బుద్ధి! బుద్ధి చెప్పిన హితవును మనసు పట్టించుకోకపోతే ‘మనసు ఎరియంగనప్పుడు అవమానము, కీడు ధరిత్రియందు ఏ అనువుననైన తప్పవు’ అని భాస్కర శతకకారుడు చేసిన హెచ్చరిక జీవితంలో నిజమై వెక్కిరిస్తుంది.

నిరాశలో, ఒంటరితనంలో కుంగిపోతున్న మనసుకు- బుద్ధి గొప్ప ఔషధం. ప్రేమ దివ్యఔషధం. భర్తృహరి చెప్పిన ‘ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు తాల్మి(సహనం)’ బుద్ధి మూలంగానే సమకూరతాయి. ధీ అంటే బుద్ధి, మతి అంటే ఆలోచన. ధీమంతులంటే మనసును వశపరచుకొన్న బుద్ధిమంతులని అర్థం. మానసిక బలహీనుల్ని వేధించే కుంగుబాట్లు, ఒత్తిళ్లు ధీమంతులను పెద్దగా ప్రభావితం చేయవు. ప్రేమదీ అలాంటి స్వభావమే! ‘ఆర్ద్ర భావనల్‌ శుష్కించి అంతరించి సారహీనమై సాగు సంసారమందు...’ ఎడారిగా మారిపోయిన మనిషి హృదయానికి జీవం పోసే చిరునీటి చెలమ- ప్రేమ! బుద్ధి, ప్రేమ రెండూ దన్నుగా నిలిస్తే మనిషికి మానసిక స్థైర్యం విశేషంగా లభిస్తుంది. ఒంటరితనం ఆ మనిషి జోలికిపోదు. 

‘తనలోని ప్రేమను తానుగా గుర్తించి దృఢచిత్త చాతుర్య ధృతినెరింగి’ తనను తాను ప్రేమించడం, గౌరవించడం నేర్చినవాడే- ప్రేమను ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా యోగ్యుడవుతాడు. 

కనుక మనిషి తానే తనలో ప్రేమను కనుగొనాలి. తన బుద్ధికి తానే పదును పెట్టుకోవాలి. బుద్ధికి మనసును జతపరచి ప్రేమను సాధించాలి. ఒంటరితనాన్ని జయించాలి.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
________________________________________________ ------------------------------------------------------------------------------
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
...................................................................................
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ ....................................................................................
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
...................................................................................
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

బాల్యంలోకి అడుగులేద్దాం! 
అప్పుడే మనసుకు ఆరోగ్యం, ఆనందం 

బాల్యం... ఓ మధుర జ్ఞాపకం.  కల్లాకపటం ఎరుగని మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పేసే బోళాతనం..  ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అమాయకత్వం.. 

పెద్దల్లో కంటే పిల్లల్లో విశ్వాసం, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటానికి కారణాలు వారికి ఉండే అలవాట్లే. ఆరోగ్యంగా ఎదగడానికి, పనిలో వేగంగా నైపుణ్యం సాధించడానికీ బాలలకు ఈ అలవాట్లే ఉపకరిస్తున్నాయి.               పెద్దయ్యాక ఇదే అలవాట్లను పునరావృతం చేస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు, మరెన్నో సమస్యలు, సవాళ్లు, ఒత్తిళ్లను అధిగమించొచ్చు.

ఎక్కువగా పట్టించుకోవద్దు: మన గురించి ఇతరులు ఎదో అనుకుంటున్నారని మరీ అతిగా ఆలోచించొద్దు. చిన్నపిల్లల మనస్తత్వంతో వ్యవహరించి...ఇతరులకు హాని చేయని రీతిలో.. మీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేయండి.



చిన్నప్పుడు ఎంతోమందితో గొడవపడుతుంటాం. దాన్ని మరిచిపోయి కొద్దిసేపటికే మళ్లీ స్నేహం చేసేస్తుంటాం. 

పెద్దయ్యాకా అలాంటి అలవాటే ఉంటే.. ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. క్షమాగుణం అలవరచుకోవడం ముఖ్యం.

ప్రేమిస్తున్నానని చెప్పండి: మీరు ఎవరినైనా అభిమానిస్తున్నా.. ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని మనసులో దాచుకోకుండా వెంటనే చెప్పేయండి. బాల్యంలో అలా చెప్పడం వల్లే ఎందరో స్నేహితులు, అభిమానుల్ని సంపాదించుకోగలిగాం.

కావాల్సింది అడిగేయండి: చిన్నప్పుడు మనకు ఏదైనా కావాల్సి వస్తే నిర్భయంగా మన చుట్టూ ఉన్న వాళ్లను అడిగేసే వాళ్లం.  కాబట్టి అడగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించొద్దు.

క్షమాపణ తప్పుకాదు: ఏదైనా తప్పుచేసినపుడు క్షమాపణ చెప్పడం తప్పుకాదు. అది మన గౌరవాన్ని పెంచుతుంది. అపోహల్ని తొలగిస్తుంది. ఇతరుల మనసు బాధపడిందని గుర్తించినపుడు చిన్నపిల్లలు క్షమాపణ చెబుతారని  మరవకండి.









Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: