సంతాప సందేశం శ్రీ దేవి

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


 ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


సినీనటి శ్రీదేవి ఇకలేరు


ఇప్పడు 50లలో ఉన్న తరానికి ఆరాధ్యదైవంగాఉండేది...


80, 90 దశకాలలో తెలుగు సినిమాను  ప్రేక్షకులను కుదిపేసిన ప్రముఖనటి. 54 నాలుగేళ్ల జీవితంలో యాబై ఏళ్లు నటిగా కొనసాగి, 2013. శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నది.


సినిమాల పట్ల ఆమె పట్టుదల, అంకితభావం చాలా విలువైనది. 

బాలనటిగా తన నటనతో సినీ అభిమానులను మంత్రముగ్గుల్ని చేసి, కథానాయకిగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకుని, చెరగని ముద్ర వేసి, అదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.


బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. వసంత కోకిల సినిమాలో చిన్న పాపలా, తల్లిలా, అలరించింది.


పదహేరేళ్ళవయసు, క్షణక్షణం, జగదేకవీరుడు - అతిలోకసుందరి, రాణికాసుల రంగమ్మ,   ఎస్పీ పరుశురాం, దేవత....శ్రీదేవి అనగానే గుర్తుకొచ్చే కొన్ని సినిమాలు... నటనతో పెద్ద హీరోలను సైతం పక్కకునెట్టేసేది...


అందాల నటి శ్రీదేవి  1969లో వచ్చిన కుమార సంభవం ఆమె మొదటి మలయాళ చిత్రం. 1996లో వచ్చిన దేవరాగం ఆమె చివరి మలయాళ చిత్రం. పూంపట్ట(1971) చిత్రానికి గానూ మొదటిసారి బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కేరళ స్టేట్‌ నుంచి  అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మరో రెండు అవార్డులు కూడా దక్కాయి. మూండ్రమ్ పిరై, లమ్హే,  నటన ఎందరో సాటి నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.


ఎప్పటికీ ఏంజిల్సి, నీ పరిశ్రమలో దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, అత్యద్భుత ప్రతిభతో, సినీపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుభాషా నటి.


రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ వింగ్లీష్, మామ్ చిత్రాల్లో నటించి తన శైలిని ఈ తరానికీ చూపించారు. 


నటనకు విశ్వరూపం శ్రీదేవంటే..  కోటాను కోట్ల మంది ప్రేమను పొంది, అందరి మనసుల్లో చోటుదక్కించుకున్నది.


దుబాయ్ లో బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహ   వేడుకలో సంతోషంగా గడిపిన శ్రీదేవి.. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో  ది. 24-2-2018 శనివారం రాత్రి 11.30 గంటలకు ఈ లోకం విడిచి వెళ్లిన ఆమె మృతి కోటాను కోట్ల మంది అభిమానులను దిగ్భ్రాంతికి ఆవేదనకు గురిచేసింది.


ఆమె ఆత్మకు శాంతికలగాలని దైవాన్ని ప్రార్థిస్తూ....

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::




శ్రీదేవి చివరి ఫొటోలు















’ 




Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: