రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ .🍁
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
🍁ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ .🍁
🌹🌿🌹🙏'ఆత్మీయ సమావేశం🙏'🌹🌿🌹 హైదరాబాదు, లక్డీకాపూల్, అశోకాహోటల్లో
- ది.20-2-2018 మంగళవారం -
మనోరంజకంగా జరిగినది.
🌹 🌹 🌹
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
💐💐సర్వశ్రీ పి.వి. శాస్తి, డి.సంపత్ కుమార్, యమ్. రామమోహనరావు, కె. సూర్యారావు - అందరకీ వెలకట్టలేని మనశ్శాంతి, సంతృప్తి , ఆయురారోగ్యములు, మెండుగా ప్రసాదించాలనీ, భగవంతుని ప్రార్థిస్తూ, మరెంతో గొప్పగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు పాలైపొంగాలనీ, ఆకాంక్షిస్తూ, సన్మానించి వారియెడల ప్రేమాభిమానాలను శుభాకాంక్షలను తెలియజేశారు💐💐
🍇సంవత్సరాల పాటు కలిసిపనిచేసి దూరమైన కుటుంబ సభ్యులు ఒక్కసారి కలిసిన సంధర్భంగా అందరూ ముఖాల్లో సంతోషం, ఆనందం తాండవించింది.🍇
🦋విధినిర్వహణలో గురుతుల్యులు మార్గదర్శకులు తారసపడినందుకు వారియెడల తమకున్న గౌరవమర్యాదలు, వినయ విధేయతలూ అభిమానమూ తెలియపరచుకుని మురిసిపోతున్నవారిని చూస్తుంటే చాలా ఆనందం కలిగింది.🦋
🌹తమవద్ద అణకువగా భయభక్తులతో పనిచేసినవారు ఎదురైనప్పుడు వారి ఎడల గల ప్రేమ ఆప్యాయతని దాచుకోలేక సంతోషపడుతున్నవారిని చూస్తుంటే వారి ధన్యజీవులు అనిపించారు.🙏🙏🙏.
🔯 ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, తీపి జ్ఞాపకాలను, గుర్తుతెచ్చుకుంటూ చిరునవ్వులతో పాటు పట్టరాని సంతోషం, ఆనందం దాచుకోలేకపోయిన వారుకూడా ఉన్నారు.🔯
ఈ సమావేశంలో యస్. గోపాలచెట్టి గారు మిత్రులందరకీ పెన్నులు అందజేసి ఆనందపడ్డారు.
నిడుమోలు వేంకట సుబ్బారావు తనచే రచింపబడిన గ్రహసంచార కాలండర్లను మిత్రులకు, గురుతుల్యులకు అందజేసి ధన్యవాదాలు తెలిపారు. 🙏.
🌻ఏది ఏమైనా మళ్ళీ ఎన్నాళ్ళు ఎదురుచూడాలో కదా మరో 'ఆత్మీయ సమావేశం' జరగడానికి అని అందరికీ అనిపించింది.🌻
మీ అందరితో -🌷
మీ -🌷
నిడుమోలు వేంకట సుబ్బారావు🙏🙏.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
Comments
Post a Comment