Posts

Showing posts from March, 2018

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

2019 ఇతిహాసం

ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారు. * ధర్మరాజు కి : దేవిక, పౌరవతి. * భీమునికి : జలంధర, కాళి, హిడింబ. * అర్జునునికి : సుభద్ర, ఉలూచి, చిత్రాంగద, ప్రమీల. * నకులునికి : కరేణుమతి, (కరుణుక). * సహదేవునికి : విజయ. ***

2019 జ్యోతిష విజ్ఞాన చైతన్య సంగ్రహం - 13 - కాలమానం

కాలమానం     మనం ఈనాడు ప్రమాణంగా భావించే ఇంగ్లీషు - గ్రిగేరియన్ - కేలండరుకు శాస్త్రీయ ఆధారం లేదు! సంవత్సరానికి ఆధారమైన భూభ్రమణం మాత్రమే వారికి తెలుసు. నేలలకు ఆధారం లేదు. ఒకప్పుడు వీరి నెలలు 40, 35 రోజులుండేవి. జూలియస్ సీజర్ పేర జూలై నెల, ఆగస్టస్ పేరు మీద ఆగస్టు నెల ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఒక నెలకు 31, ఒకటి 30, ఒకటి 28 ఎందుకవుతుందో తెలియదు. వేదంలో భూమి గుండ్రంగా ఉందని వాచ్యంగా చెప్పబడలేదు. భూగోళం మీద ఆధారపడిన శాస్త్రం వారికి తెలుసు. భూమి గుండ్రంగా ఉంది. అది తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు లేక 24 గంటలు పడుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భాగానికి పగలవుతుంది. చాటుగా ఉన్న భాగానికి రాత్రి అవుతుంది.     వేదానికి రాత్రింబవళ్లు తెలుసు. పగలు, రాత్రి ఆచరించవలసిన వానిని వేదం నిర్దేశిస్తుంది. గ్రిగేరియన్ కేలండర్ నెలకు ఆధారం లేదు. వేదంలో పక్షానికి చంద్రుని కాంతి - వెన్నెల ఆధారం. భూమి నిరాధారంగా వ్రేలాడుతున్నదని వేదం వివరించింది. అలాగే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. అతనికి సూర్యుని వలన కాంతి లభిస్తున్నది అని చెప్పింది.     భూమి తన చుట్టు తాను తిరుగుతున్నది. చంద్రుడు భూమి

2019 జ్యోతిష విజ్ఞాన చైతన్య సంగ్రహం - 12. జ్యోతిష్యం - ప్రయోజనాలు

12. జ్యోతిష్యం - ప్రయోజనాలు మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య గొప్పది. జన్మించిన తేది, సమయం, ప్రదేశం.. ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం, అతడి భవిష్యత్ సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం. జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించే మంచి, చెడు రెండూ గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది. అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ 3 రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు

2019 - జ్యోతిష విజ్ఞాన చైతన్య సంగ్రహం 11 - ద్వాదశ లగ్నాలకు సంభందించిన విషయాలు

12 లగ్నాలకు సంభందించిన విషయాలు మేషలగ్నస్థ గ్రహములు మేషలగ్నస్థ గ్రహ జాతకులు చురుకైన తత్వం కలిగి ఉంటారు. కోప స్వభావం ఉండును. వీరికి దీర్ఘకాల శత్రువులు ఉంటారు. దైర్యము, ఆశ అధికమే. ఇక వీరు మంచి భోజన ప్రియులు. మేషలగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతి (లగ్నం అంటే జన్మరాశి చక్రంలో మొదటి స్థానం) కాక అష్టమాధిపతి (అంటే జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి 8వ స్థానం) కూడా. తృతీయ (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి మూడవ స్థానం) షష్టాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఆరవ స్థానం) బుధుడు, ధన (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి రెండవ స్థానం) సప్తమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఏడవ స్థానం) శుక్రుడు, వాహనాధిపతి (అనగా జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి నాలుగవ స్థానం) చంద్రుడు, పంచమాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి ఐదవ స్థానం) సూర్యుడు, భాగ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం) వ్యయాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి పన్నెండవ స్థానం) గురువు, రాజ్య (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి పదవ స్థానం) లాభాధిపతి (జన్మరాశి చక్రంలో లగ్నం నుంచి పదకొండవ స్థానం) శని. మేష లగ్నములో ఉండే గ్రహములు - ఫలితాలు సూర్యుడు మేషలగ్నా

2019 జ్యోతిష విజ్ఞాన చైతన్య సంగ్రహం - 10 బ్రహ్మముహూర్తం..!

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..! పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని