2019 జ్యోతిష విజ్ఞాన చైతన్య సంగ్రహం - 13 - కాలమానం

కాలమానం

    మనం ఈనాడు ప్రమాణంగా భావించే ఇంగ్లీషు - గ్రిగేరియన్ - కేలండరుకు శాస్త్రీయ ఆధారం లేదు! సంవత్సరానికి ఆధారమైన భూభ్రమణం మాత్రమే వారికి తెలుసు. నేలలకు ఆధారం లేదు. ఒకప్పుడు వీరి నెలలు 40, 35 రోజులుండేవి. జూలియస్ సీజర్ పేర జూలై నెల, ఆగస్టస్ పేరు మీద ఆగస్టు నెల ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఒక నెలకు 31, ఒకటి 30, ఒకటి 28 ఎందుకవుతుందో తెలియదు.

వేదంలో భూమి గుండ్రంగా ఉందని వాచ్యంగా చెప్పబడలేదు. భూగోళం మీద ఆధారపడిన శాస్త్రం వారికి తెలుసు. భూమి గుండ్రంగా ఉంది. అది తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు లేక 24 గంటలు పడుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భాగానికి పగలవుతుంది. చాటుగా ఉన్న భాగానికి రాత్రి అవుతుంది.

    వేదానికి రాత్రింబవళ్లు తెలుసు. పగలు, రాత్రి ఆచరించవలసిన వానిని వేదం నిర్దేశిస్తుంది.

గ్రిగేరియన్ కేలండర్ నెలకు ఆధారం లేదు. వేదంలో పక్షానికి చంద్రుని కాంతి - వెన్నెల ఆధారం. భూమి నిరాధారంగా వ్రేలాడుతున్నదని వేదం వివరించింది. అలాగే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. అతనికి సూర్యుని వలన కాంతి లభిస్తున్నది అని చెప్పింది.

    భూమి తన చుట్టు తాను తిరుగుతున్నది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలా తిరగేటప్పుడు సూర్యుని కాంతి చంద్రుని మీద పడుతుంది. అదే వెన్నెల అవుతుంది. వెన్నెల పక్షం రోజులు పెరుగుతూ పూర్ణిమ అవుతుంది. పక్షం అంటే సరిగ్గా పదిహేను రోజులు కాదు. చాంద్రమాసపు నెలలో సగం. తదుపరి పక్షం రోజులు తరుగుతూ అమావాస్య అవుతుంది.

    సాయంకాలం తరువాత పెరిగే వెన్నెలను శుక్ల పక్షం అంటాం. శుక్ల పాడ్యమి నుండి వెన్నెల రోజుకు రెండు ఘడియలు పెరుగుతుంటుంది. అలా తొలి 15 రోజులు రెండు ఘడియల చొప్పున 15 x 2 = 30 ఘడియలు పూర్ణిమ రాత్రి సాంతం వెన్నెల ఉంటుంది. కృష్ణ పాడ్యమి నుంచి వెన్నెల రోజుకు రెండు గంటలు తగ్గుతుంటుంది. అంటే పాడ్యమి నాడు రెండు ఘడియలు తప్ప రాత్రంతా వెన్నెల ఉంటుంది. ఆవిధంగా తరుగుతూ పక్షానికి వెన్నెల పూర్తిగా లేని అమావాస్య వస్తుంది.

కాలచక్రానికి సూర్యుడే ఆధారం. సావన సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలోని 360 డిగ్రీలు. దీని ప్రకారం 360 రోజుల్లో నాలుగోవంతు 90 రోజులు అవుతుంది. ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 (40 వారాలు) రోజుల్లో శిశువు జన్మిస్తుంది. 120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొందింది. ఉత్తరాషాఢ, శ్రవణాల మధ్య అభిజిత్‌ నక్షత్రం ఉంటుంది. ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రన్ని పరాశరమహర్షి రూపొందించారు. సౌర అంటే 72, హోర అంటే 82. వీటిని తిరగేస్తే 27, 28 వస్తాయి. 27 నక్షత్రాల ఆధారంగా సూర్యసిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి. అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం అన్నారు. నక్షత్ర మానం ప్రకారం 27.321 రోజులు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 120 సంవత్సరాలు మనిషి ఆయువు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని అనుకోవలసి వస్తోంది.

120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా బతకడం లేదు ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంటుంది. దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే. ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు. అర్ధశ్వాసలతో కాలం గడిపేస్తున్నాడు. మనిషి నిమిషానికి తీసే శ్వాసలు 15. రోజుకు 1440 నిమిషాలు. 1440ని 15తో హెచ్చిస్తే 21,600 శ్వాసలు వస్తాయి. 12 రాశులు, 12 నెలలు, పూర్ణాయువు 120 సంవత్సరాలు, కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు... ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కనిపిస్తూనే ఉంటుంది. తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది. ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది. మనం యోగశాస్త్రాన్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు.

Comments

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: