2019 శాంతి మంత్రాలు

శాంతి మంత్రాలు
(26_3_18)

7)        ఓం  వాఙ్మే  మనసి ప్రతిష్ఠితా మనో  మే  వాచి  ప్రతిష్ఠిత
           మావిరావీర్మ   ఏధి !     వేదస్య   మ   అణీస్థః  !

           శ్రుతం  మే  మా  ప్రహాసీరనేనా  ధీతేనాహోరాత్రాన్
           సందధామృతం   వదిష్యామి  ! సత్యం  వదిష్యామి  !  

           తన్మామవతు  ! తద్వక్తారమవత్వతు  !
           మామవతు    వక్తారమవతు  వక్తారమ్  !!

                      ఓం శాంతిః శాంతిః శాంతిః !!

ఉన్నత  జీవితాన్ని  ఆకాంక్షించే  వారికి  మనస్సు  వాక్కు  ఒక్కటిగా
ఉండడం  అత్యావశ్యకం.  బాహ్యాంతరాలు ఒకటిగా ఉండే స్థితికై
ప్రార్థించే మంత్రమిది.

ఈ మంత్రం  ఐతరేయ ఉపనిషత్తుకు శాంతిమంత్రం గా ఒప్పారుతున్నది.

మే =  నా,  వాక్ = వాక్కు  , మనసి = మనస్సులో,   ప్రతిష్ఠితా = ప్రతిష్ఠితం
అగుగాక,  మే మనః = నా మనస్సు,  వాచి = వాక్కుతో,  ప్రతిష్ఠితం =
ప్రతిష్ఠితమగుగాక,   ఆవిః = ప్రకాశమానమైన పరమాత్మా,  మే = నాలో,
ఆవిః ఏధి = ప్రకాశింౘుగాక,  మే = నాకు,  వేదస్య = వేదాల యథార్థాన్ని,
ఆణీస్థః = తీసుకొస్తారుగాక,  మే శ్రుతం =  నేను విన్నవి, మా ప్రహాసీః =
నన్ను వీడకుండా వుండుగాక,  అనేన అధీతేన = నేర్చుకున్న వాటిని,
అహః రాత్రాన్ = రాత్రిబవళ్ళు, సందధామి = అనుసంధానం చేస్తాముగాక,
ఋతం వదిష్యామి = నేను వ్యావహారిక సత్యాన్ని పలుకుతాను గాక,
సత్యం వదిష్యామి = నేను పారమార్థిక సత్యాన్ని పలుకుతాను గాక,
తత్ = ఆ భగవంతుడు,  మాం = నన్ను,  అవతు = కాపాడుగాక, 
తత్ = ఆ భగవంతుడు ,  వక్తారం = గురువును,  అవతు = కాపాడుగాక,
అవతు మాం = నన్ను కాపాడు గాక,  అవతు వక్తారం = గురువును కాపాడుగాక.

నావాక్కు మనస్సు లో ప్రతిష్ఠితమగునుగాక. మనస్సు వాక్కు లో
ప్రతిష్ఠితమగునుగాక . ప్రకాశమానమైన పరమాత్మా ! నాలో ప్రకాశించెదవు
గాక.  మనస్సు వాక్కు రెండూ వేదాల యదార్థాన్ని నాకు తీసుకొనివస్తాయి
గాక.  నేను విన్నది యావత్తూ నన్ను వీడకుండా ఉండుగాక !  నేర్చుకున్న దానిని
నేను రేయింబగళ్ళూ యోచిస్తాను గాక  !   నేను వ్యావహారిక సత్యాన్ని
పలుకుతానుగాక,  పారమార్థిక సత్యాన్ని పలుకుతాను గాక ! ఆ భగవంతుడు
నన్ను కాపాడుగాక, గురువును కాపాడుగాక, నన్ను రక్షింౘు గాక  గురువును
రక్షింౘుగాక !!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12