ఇక్ష్వాకు వంశము అమ్మా! విజయ సువర్ణా,ఒకసారి ఇక్ష్వాకు ను గూర్చి నీవదిగినట్లు గుర్తు. ఆయన శ్రీరాముని పూర్వీకుడు. బ్రహ్మ కుమారుడు మరీచి. ఆయన కుమారుడు కశ్యపుడు. ఆయన కొడుకు వివస్వంతుడు. అంటే సూర్యుడు. అందుకే ఆయనను 'కాస్యపేయం మహా ద్యుతిం' అని అంటారు. ఆయన కుమారుడు 'వైవస్వత మనువు'. ఆయనకు 10 మంది సంతానము.వారు వరుసగా. 1. ఇక్ష్వాకువు 2. నాభాగ. 3. ధ్రిష్ఠ 4.శర్యతి 5. నరిష్యంత 6. ప్రాంశు 7. రిష్ఠ 8.కరుశ 9. పిశాధ్ర 10.కుమార్తె ఇల వివస్వతుని తదనంతరము ఆ రాజ్యాన్ని సంతానము పంచుకొన్నారు. ఇక్ష్వాకువు పెద్ద కొడుకైన కారణంగా మొత్తము సామ్రాజ్యములోని తనకిష్టమైన మధ్యభాగము తీసుకొని అత్యంత జనరంజకముగా పాలించినాడు. ఆయన వంశజులు అందువల్ల ఇక్ష్వాకులైనారు. వివస్వతుని నుండి వచ్చిన వారైనందువల్ల సూర్య వంశజులైనారు. ఇక్షువు అంటే చెరుకు అని అర్థము. 'ఆక' అంటే కలిగిన అని అర్థము. బహుశా ఆయన మాటలు అంత తీయగా వుండేవేమో. ఇక్ష్వాకువు నుండి 20 వ తరమువాడు కకుత్సుడు. కాళీదాసు ఈయనను 'దిలీపునిగా' పేర్కొన్నాడు. ఈయన కూడా ఎంతో గొప్పగా పరిపాలించుటవల్ల అయన తదనంతరము వచ్చిన వారలు కాకుత్సులైనారు. అసలు 'కకుత్సము' అంటే పశువు. బహుశ ఆయన అంత బలశాలి ఏమో. 'కాకుత్స దూతం భజే' అని హనుమంతుని ప్రార్థనలో కూడా మనము రాముని బంటుగా వింటాము. ఇక రఘువును గూర్చి తెలిసినదే. ఆయన సూర్య వంశజులలో పేరెన్నిక గన్న వాడు కావున ఆ వంశమే రఘువంశమైనది. రాముడు రాఘవుడైనాడు.
ఇక్ష్వాకు వంశము
అమ్మా! విజయ సువర్ణా, ఒకసారి ఇక్ష్వాకు ను గూర్చి నీవడిగినట్లు గుర్తు. ఆయన శ్రీరాముని పూర్వీకుడు.
బ్రహ్మ కుమారుడు మరీచి. ఆయన కుమారుడు కశ్యపుడు. ఆయన కొడుకు వివస్వంతుడు. అంటే సూర్యుడు. అందుకే ఆయనను 'కాస్యపేయం మహా ద్యుతిం' అని అంటారు. ఆయన కుమారుడు 'వైవస్వత మనువు'. ఆయనకు 10 మంది సంతానము.
వారు వరుసగా.1. ఇక్ష్వాకువు 2. నాభాగ. 3. ధ్రిష్ఠ 4.శర్యతి 5. నరిష్యంత 6. ప్రాంశు 7. రిష్ఠ 8.కరుశ 9. పిశాధ్ర10.కుమార్తె ఇల
వివస్వతుని తదనంతరము ఆ రాజ్యాన్ని సంతానము పంచుకొన్నారు. ఇక్ష్వాకువు పెద్ద కొడుకైన కారణంగా మొత్తము సామ్రాజ్యములోని తనకిష్టమైన మధ్యభాగము తీసుకొని అత్యంత జనరంజకముగా పాలించినాడు. ఆయన వంశజులు అందువల్ల ఇక్ష్వాకులైనారు. వివస్వతుని నుండి వచ్చిన వారైనందువల్ల సూర్య వంశజులైనారు. ఇక్షువు అంటే చెరుకు అని అర్థము. 'ఆక' అంటే కలిగిన అని అర్థము. బహుశా ఆయన మాటలు అంత తీయగా వుండేవేమో. ఇక్ష్వాకువు నుండి 20 వ తరమువాడు కకుత్సుడు. కాళీదాసు ఈయనను 'దిలీపునిగా' పేర్కొన్నాడు. ఈయన కూడా ఎంతో గొప్పగా పరిపాలించుటవల్ల అయన తదనంతరము వచ్చిన వారలు కాకుత్సులైనారు. అసలు 'కకుత్సము' అంటే పశువు. బహుశ ఆయన అంత బలశాలి ఏమో. 'కాకుత్స దూతం భజే' అని హనుమంతుని ప్రార్థనలో కూడా మనము రాముని బంటుగా వింటాము. ఇక రఘువును గూర్చి తెలిసినదే. ఆయన సూర్య వంశజులలో పేరెన్నిక గన్న వాడు కావున ఆ వంశమే రఘువంశమైనది. రాముడు రాఘవుడైనాడు.
Comments
Post a Comment