వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన
వామనుడు రెండో సారి దర్శనమిచ్చిన ప్రాంతం...సందర్శనతో అనంతమైన ఐశ్వర్యం
భారత దేశంలో వామనాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో మూడు ఆలయాలు ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి. అందులో ఈ వామన రూపంలో విష్ణువు రెండు సార్లు సాక్షాత్కరించిన పుణ్యక్షేత్రం తిరుక్కోవలూరు. ఇక ఇక్కడే 12 మంది ఆళ్వారులో మొదటి ముగ్గురైన పోయ్ గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారులు విష్ణువును కీర్తిస్తూ మొదటిసారిగా పాశురాలు ( భక్తి పాటలు) ఈ క్షేత్రంలోనే పాడినట్లు స్థళ పురాణం చెబుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ తిరుక్కోవలూరు వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే అనంత మైన ఐశ్వర్యం మనకు దక్కుతుందని స్థానికులు చెబుతుంటారు. చెన్నై నుంచి తిరుక్కోవలూరు 237 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు నిత్యం బస్సు సర్వీసులు ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం
Comments
Post a Comment