గ్రహములు  -  దృష్టి -  పరాశర వివరణ.

గుమ్మా రామలింగ స్వామి
గ్రహములు  -  దృష్టి -  పరాశర వివరణ.

గ్రహములన్ని తామున్న రాశినుండి ఏడవ రాశిని చూస్తాయి. కాని శని, గురు, కుజుడు,  ఆ ఏడవరాశినే కాక, వరుసగా శని, 3వ రాశిని  10 వ రాశిని కూడా చూస్తాడు  గురుడు, 5వ, 9వ రాశులను,  కుజుడు, 4వ, 8వ రాశులను కూడా చుస్తాడు.  దీనిని విశేష ద్రుష్టి అంటారు.  అనగా ఏడవరాసిన చూచుట సామాన్య దృష్టి అని చెప్పుకోవాలి. ఏ గ్రహమునకు 10వ రాశి వెనుక దృష్టి ఉండదు.   సామాన్య దృష్టి కన్నా విశేష ద్రుష్టికి బలమెక్కువ.   ఈ గ్రహములను  సౌమ్య గ్రహములు, క్రురగ్రహములగా విభజించిరి.  సౌమ్య గ్రహములు, 1, 4, 7, 10 స్తానములకు అధిపతులైన శుభము నీయరు.  క్రూరగ్రహములు కేంద్రాధి పతులయిన,  రవి కన్నా క్షీణచంద్రుడు,   అతనికన్నా పాపి అయిన బుధుడు (బుధుడు పాప గ్రహములతో కలిసిన పాపిగా చెప్పవలెను) వారికన్నా కుజుడు, వానికన్నా శని  వారికన్నా రాహుకేతువులు మహా క్రూరులు.

శుభగ్రహములకు కేంద్రాది పత్యము మంచిది కాదు పాపులకు మంచిది.  ఈ విషయములు పరాశరుడు చెప్పినవి. లగ్నము, లగ్నము లగాయతు, 4వ, 7వ, 10వ   స్థానములు కేంద్రము.   1వ, 5వ, 9వ స్థానములు కోణములు. లగ్నము లగాయతు, 1, 2, 4, 7, 9, 10, 11   శుభస్తానములు.  ౩, 6, 8, 12 పాపస్తానములు.   పాపస్తానముకు అధిపతు లయిన  గ్రహములు నైసర్గిక శుభులయిన ఆధిపత్య పాపులు.   అల్లాగే పాపస్తానములకు అధిపతులైన గ్రహములు, నైసర్గిక పాపులైనను ఆదిపత్య శుభులు అగును.
***

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12