యోగములు
ఏకనక్షత్ర వివాహము – ఒక వివరణ
ఒకే నక్ష్త్రమున జన్మించిన స్త్రీ పురుషులకు వివాహము చేయు విషయమై చాలమందికి అనుమాలు కలుగుచున్నవి. అది దోషమని కొందరు కాదని మరికొందరు వాదించు చున్నారు.
దీనికి కారణం భార్యాభర్తలది ఒకే నక్షత్రమైన గోచార వశమున వారికి ఏలినాటి శని అష్టమ శని మొదలగునవి ఒకే మారు సంభవించును. కొన్ని జాతకములందు ఆ గ్రహముల ఉనికి వలన చెడు కాలము వచ్చునని వారి అభిప్రాయము.
కొంతమంది మహర్షులు ఏక నక్ష్త్రమునకు వివాహము చెయ్య వచ్చని చెప్పిరి వీరు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఒక నక్షత్రమైనను వివాహము చెయ్యవచ్చును. ఇవి ప్రశస్థములు గూడా.
అశ్వని, భరణి, ఆశ్లేష. , పుబ్బ, స్వాతి, అనూరాధ, మూల, శతభిషము, అను ఈ నక్షత్రములు మధ్యమములు, కుదరవని చెప్పకూడదు. వారి జాతకములు జ్యోతిష్కులు వివరముగా పరిశీలించి చూడవలెను.
ఉత్తర, హస్త, చిత్ర, జ్యేష్ట. పూర్వాషాడ, ఉత్తరాషాడ, ధనిష్ట పూర్వాభాద్రలలో జన్మించిన వధూవరులకు వివాహము చేయరాదు. మరికొందరు పాదభేధమున్నను, జనన ఘడియలు ముందు వెనుకలున్నను, చెయ్య వచ్చని వాదించుచున్నారు. ఈ విషయములన్నియు మధ్యమముగానే ఉన్నవి. శాస్త్రాను సారము పాటించుట ఉత్తమము.
***
శుభయోగములు
పారిజాత యోగము : విపరీత రాజయోగముగా చెప్పబడుచున్న ఈ యోగము చాలా
అరుదుగాజాతకములలో కనిపించును.నా 45 సం. అనుభవమున ప్రత్యేక దీక్షతో ప్రయత్నిచి
ఇట్టి జాతకులను చూచితిని.
లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి
రాశ్యాధిపతి ఉన్న నవాంశాధిపతి కేంద్రములందు కానీ కోణమందుకాని,ఉచ్చస్థితిపొంది దిగ్బలము పొంది
ఉండాలి. ఇట్టి జాతకులు బాల్యమున సాధారణ జీవితము తో ప్రారంభించి తరువాతి కాలమున మద్య వయస్సునుండి
అపారమైన గౌరవము, ప్రభువులచే,ధనికులచే సకల మర్యాదలు పొందినవారు, విశేష ధన ,వాహనములు,
ప్రబల కీర్తి కలిగి ఉందురు,అట్టివారు ఉన్నతపదవులలోను, పారిశ్రామిక వేత్తలు జమీందారులు అయి ఉన్నారు.
మరికొందరు సదాచారమును పాటించి మతగురువులుగాను, పీఠాధిపతులుగాను కూడా ఉన్నవారున్నారు.
త్రిలోచనయోగము.: ఇదియొక శుభయోగము దీనిలో ఆయుర్దాయము, శత్రువులపై విజయము,వంటి
శుభఫలములతో,పాటు సంపద కీర్తి మేధాశక్తి కలిగిఉందురు.
వీరి గ్రహస్తితి : రవి చంద్ర, కుజులు ఒకరికొకరు కోణములలో ఉండుటయె.వీరి జీవితము ఏ ఒడుదొడుగులు
లేకుండా నల్లేరు మీద బండి వలె సాఫీగా సాగును. ఇదియు నొక శుభయోగమే.
***
జాతకమున యోగములు, కళత్రమూల ధనయోగము.
ఈ యోగమున జన్మించినవారు భార్యమూలమున అనగా అత్తవారి ఆస్థి కలియుట లేక భార్య స్వతహ సంపాదించుట వంటివి జరుగును. ఈ యోగమునకు గ్రహస్థితి ధనాధిపతి బలవంతుడై శుక్రుని తో గాని, సప్తమాధిపతితో గాని కలసి ఉండి లగ్నాధిపతి కూడా బలము గలిగి ఉండవలెను.
ఆమరణాంత ధనయోగము
ఈ యోగము కలవారు, జన్మతః సంపదలు కలిగి జీవితాంతము ఆ ఐశ్వర్యము కలిగి ఉందురు. ధన స్థానమున (రెండవ ఇల్లు) ఎక్కువ గ్రహములుండి వారు శుభ గ్రహములై, ధనయోగకారకులు గావలెను. ఆ స్థానము వారికి స్వ, ఉచ్చక్షేత్రము కావలెను. ధనకారకుడయిన గురువు అక్కడ ఉన్నయెడల ఆ దశలో బాగుగా యోగించును.
ఆయాంత ధనలాభయోగము
ఏ ప్రయత్నము ఎక్కువ చెయ్యకుండా అమిత సంపదలు ధనము వాహనములు, సమకూరు యోగమిది. ఈ జాతకులు సామాన్య ప్రత్నముచే అధిక ఫలము పొందుదురు. వీరి గ్రహస్థితి ఇలా ఉండును. లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన (ఒకరి ఇంట్లో ఒకరు) ఉన్నయెడల ఈ యోగము కాలుగును. ఇదీ శుభయోగమే. కష్టము తక్కువ ఫలమెక్కువ మంచిదే కదా! 21/1/16
భాస్కరయోగము
జాతకమున రవి, బుధ, చంద్ర, గురు, గ్రహములవలన ఈ యోగమేర్పడుతుంది. రవి నుండి రెండవ ఇంట బుధుడు, బుధుని నుండి 11వ, ఇంట చంద్రుడు అతనినుండి కోణమందు గురుడు ఉన్న ఈ యోగము కలుగును. ఈ యోగమున జన్మించిన వారు సకల సంపదలు కలిగి సకల శాస్త్రము లందు ప్రావీణ్యము, పెద్ద కుటుంబములో పుట్టుట, సంగీతము సాహిత్యము జ్యోతిషమందు మంచి ప్రవేశము కలిగి ఉందురు. ఇదియొక మంచి యోగమే.
బుధయోగము.
లగ్నమందు గురుడు, ఒక కేంద్ర మందు, చంద్రుడు, అతనినుండి, రెండవ ఇంట రాహువు, అతనినుండి 3వ ఇంట రవి కుజులు ఉన్న ఈ యోగమేర్పడును.
లగ్నమందు గురుడు లక్ష దోషములను హరించును గదా! అటులనే బలములు గూడా ప్రసాదించును. చంద్రుని నుండి కేంద్రమందు గురుడు గజకేసరి యోగముకదా,
ఈ విధమయిన బలములు గల యోగము బుధ యోగము.
గుమ్మా రామలింగ స్వామి
భవానీ జ్యోతిష్యాలయ
***
Next
ధేనుయోగము
రెండవ ఇంటిని శుభగ్రహము చుచుచున్నానూ, లేక అందే ఉన్ననూ, రెండవ ఇంటి
అధిపతి స్వ ఉచ్చ క్షేత్రములో ఉన్ననూ ఈ యోగము ఏర్పడును.
ఈ యోగి మంచి భోజన ప్రియుడు, సకల సంపదలు ధనము
విద్యలు నేర్చి ఇంటికిపెద్దగా కుబేరునివలె తులతూగును.
శౌర్యయోగము
శౌర్యమునకు మూడవ ఇల్లు విక్రమస్థానము కదా !ఈ యోగము ఇచ్చటనే ఏర్పడును.
మూడవ ఇంట శుభులున్ననూ, శుభులు చూచున్ననూ ఆ ఇంటి అధిపతి
తన స్వ, ఉచ్చస్థానమున ఉన్ననూ ఈ యోగము కలుగును .26/1/16
కామయోగము
సప్తమము శుభ గ్రహము కలిగి, శుభులు చూచుచున్న ఆఇంటి అధిపతి
స్వ ఉచ్చ మిత్ర రాసులందున్ననూ కామయోగమేర్పడును,
ఈ యోగము పుట్టినవాడు, ధన వాహనములు సంపద గల భార్యగలిగి,
పర స్త్రీ వ్యామొహము లేక బందువులు లతో కలసిఉండి,
మంచిగుణము కలిగి తండ్రిని మించిన వానిగా గుర్తింపు పొందును.
అధిక ధనవంతుడగును.
ముసలయోగము.
ఈ యోగము చాలామందిలో కనిపించును.12 వ ఇంట శుభగ్రహమున్నానూ
శుభగ్రహము ఆ ఇంటిని చూచుచున్నానూ ద్వాదశాధిపతి తన స్వ ఉచ్చ మిత్ర
రాసులందున్న ఈ యోగము చెప్పవలెను. ఈ యోగమున పుట్టినవాడు,
కష్టపడి సంపాదించును. దీనునిగా కనిపించును, సంపదలు వచ్చుచూ పోవుచూ ఉండును.
భావములు గూడా స్థిరముగా ఉండవు, ఇది శుభయోగమే అయినను కొంచెము కష్టములు ఉన్నది కదా!
***
Next
జలధి యోగము
చతుర్ధమున శుభ గ్రహ మున్ననూ, లేక ఆ స్థానమును శుభగ్రహము చూచున్ననూ మరియూ చతుర్ధాధిపతి తన స్వ, ఉచ్చ,మిత్ర క్షేత్రమున ఉన్ననూ జలధియోగము సంభవించును. జలమనగా నీరు. ఇది నీటికి, గో, భూ విషయములలో కనిపించును.
ఈ యోగము కలవాడు, గోవులు భూములు, సుఖజీవనము, సత్కళత్రము,
బంధుపూజితము, దేవ బ్రహ్మణ భక్తికలిగి, తటాకము, నూతులు తీయించి, రాజ సన్మానము పొందును. ఈ యోగము ప్రస్తుత కాలమున చాలా జాతకములలోకనిపించును. కానీ వ్యసాయమునందు ఉండి, పసుసంపద, ధనము, కలిగిఉన్నవారే కాని ఇతరమైన లక్షణములు కనిపించుట లేదు. ఇది కాలముతో వచ్చిన మార్పు.
దుర్యోగములు
కుహూ యోగము :- చతుర్ధ స్థానమున పాపులున్ననూ, ఆ స్థానమును పాపులు
చూచుచున్ననూ, లేక చతుర్ధాధిపతి, 6వ, 8వ, 12వ, ఇళ్ళలో ఉన్న ఈయోగము కలుగును.
ఇదియొక దుర్యోగమే. ఇతనికి, మాతృ, మిత్ర, భూషణ, బంధుజనములు లేక, ఆ కారణముతో బాధపడుచూ, మరియూ వికృత గుణవంతురాలగు స్త్రీతో కాపురము చేయును. ఈ జాతకులు అధికముగా కనిపించును.
పామర యోగము :- పంచమ స్థానమున పాపులున్ననూ, ఆ స్థానమును పాపులు చూచుచున్ననూ, పంచమాధిపతి, పాపస్థితి పొందిననూ ఈ యోగమగును. ఈ యోగమున పుట్టినవారు, కష్ఠ జీవి, అనృతము లాడువాడు, మోసకారి, నిస్సంతు, నాస్తికుడు అగును. ఇదియునూ దుర్యోగమే.
మానవులలో ఎక్కువ మంది, పూర్వ జన్మమున, పాపకర్మలాచరించి ఆ పాపనివృత్తి కొరకు
మరల జన్మలెత్తి ఇట్టి యొగమున జన్మింతురు. ఇది గమనించి, పుణ్యకార్యము చేయుచూ,
పాపకర్మలకు దూరముగా ఉండి జీవించు చున్న, మరు జన్మలోఈ దుర్యోగమున పుట్టరు.
దుర్యోగము, దరిద్రయొగము, నిర్భాగ్యయోగము, మొదలగు యోగములు ఈ కోవకు చెందినవే.
***
Next
విమలయోగము
ద్వాదశ స్థానమున షష్టి , అష్టమ వ్యయాధిపతులు ఎవరయిన ఉన్నను
లేక ఆస్థానధిపతులు యెవరైనను, ద్వాదశమును ,చూచినను లేక ద్వదశాధిపతి
షష్ట అష్టమ వ్యయస్థానము లందు ఉన్ననూ విమలయోగ మేర్పడును.
విమలయోగ జాతకుడు ధనార్జన పరుడు, పొదుపరి, స్వజనులకు అనుకూలుడు,
సుఖవంతుడు ,గౌరవనీయుడు, ఖ్యాతిపరుడు అగును.
దరిద్ర యోగము
లాభాధిపతి, షష్టి , అష్టమ, వ్యయస్థానము లందేని యున్ననూ, లాభ స్థానమును ఈ దుస్థానాధిపతులు చూచినను లేక లాభ స్థానమందున్ననూ దరిద్ర యోగము అనవలెను. ఈ యోగము కలవారు రుణగ్రస్థుడు, ఉగ్రుడు అతిదరిద్రుడు సోదరహీనుడు, పాపకృత్యములందు ఆసక్తి, పరనిందా పరుడు అగును.
Comments
Post a Comment