భగవద్గీత - జీవనగీత

భగవద్గీత - జీవనగీత

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఈ జరిగిన సంఘటనను తలచుకుంటే, ఇప్పటికి నాకు సంతోషం, దుఃఖం రెండూ కలుగుతాయి. ఆనందం ఎందుకంటే ఎవరికీ అటువంటి అనుభవం దొరకదు కాబట్టి. కాని ఆ చిన్న వయస్సులో ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యత తెలియలేదు అన్న బాధ.

అప్పుడు నేను మదురైలోని ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాను. సంస్కృత అధ్యాపకులైన మా నాన్నగారు భగవద్గీతను నాటిక రూపంలో తయారుచేసి, మా ఇద్దరికీ అందులో శిక్షణనిచ్చారు. చాలా సార్లు దాన్ని ప్రదర్శించినా అలవాటు వల్ల నేను ఏకపాత్రాభినయంతో ప్రదర్శన చేసేదాన్ని.

చాతుర్మాస్యం సందర్భంగా పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని పండరీపురంలో మకాం చేస్తున్నారు అని మాకు తెలిసింది. వెంటనే మహాస్వామి వారి దర్శనం చేసుకోవాలని మా నాన్నగారు నిర్ణయించారు. ఇప్పుడు కాంచీపురంలో స్వామివారి ఆంతరంగిక సేవకులైన శ్రీ ఎ. కుప్పుస్వామి గారితో కలిసి అందరమూ పండరిపురం బయలుదేరాము.

ఒకనాటి ఉషోదయ సమయాన అక్కడకు చేరుకున్నాము. పరమాచార్య స్వామివారు చంద్రభాగ నది ఒడ్డున మకాం చేస్తున్నారు. స్థానికంగా ఎదో ఉత్సవం జరుగుతూండడంతో మాకు ఎక్కడా వసతి లభించలేదు. స్నానాదులు పూర్తీ చేసుకుని లగేజితో సహా మహాస్వామి వారు ఉన్న చోటుకు వెళ్ళాము. స్వామివారు కొందరు స్థానిక భక్తులతో మాట్లాడుతున్నారు. మా నాన్నగారి వంతు రాగానే భగవద్గిత నాటిక గురించి తెలుపగా, ప్రదర్శించమని చెప్పారు స్వామివారు. ప్రదర్శిస్తున్నప్పుడు సంభాషణలకు అనుగుణంగా హావభావాలతో నటిస్తున్నాను. దాని అర్థం నాకు తెలుసు. మహాస్వామి అంతటివారే నా నటనని ఆస్వాదిస్తున్నప్పుడు ఇంకా బాగా చెయ్యాలని నిశ్చయించుకున్నాను.

అప్పుడు పరమాచార్య స్వామివారు ఒక శిష్యుణ్ణి పిలిచి నా నటననను గమనించమని, చాలా ఆనందంతో మా నాటికను ఆనందిస్తూ అతనితో మాట్లాడుతున్నారు. అదేరోజు ఆ నాటికని మూడు నాలుగు సార్లు శ్రీవారి సాన్నిధ్యంలో ప్రదర్శించే అవకాశం దొరికింది.

భోజనం తరువాత భక్తులు ఎవరూ లేరు. నేను అక్కడ గులకరాళ్ళు ఎరుకోవడంలో నిమగ్నమై ఉన్నాను. మహాస్వామివారు ఒక్కరే కూర్చుని నన్ను గమనిస్తున్నారు. వారు నన్ను ఎన్నో విషయాలు అడుగుతున్నారు. నేను చాలా సామాన్యంగా వాటికి సమాధానాలు ఇస్తున్నాను. అప్పుడు నాకు తెలియదు అది ఎంత పెద్ద అవకాశమో, కాని అంత చిన్నపిల్లనైన నాతో మాట్లాడటానికి వారి సమయాన్ని వెచ్చించడం నిజంగా వారి అవ్యాజమైన కరుణ. వెంటనే స్వామివారు ఒక సేవకుణ్ణి పిలిచి “ఆ పిల్ల భోజనం చేసిందా?” అని అడిగారు. ఈ ఒక్క ప్రశ్న చాలదా, వారి కరుణ ఎంతటిదో అర్థం చేసుకోవడానికి.

అలా మధ్యాహ్నం గడిచిపోయింది. సాయింత్రం చాలామంది భక్తులు మహాస్వామివారి దర్శనానికి వచ్చారు. నేను హిందీ నేర్చుకుంటున్నాను అని స్వామివారికి మధ్యాహ్నమే చెప్పాను. సాయింత్రం కూడా గవ్వలు ఏరుకుంటూ ఆడుకుంటున్న నన్ను పరమాచార్య స్వామివారు పిలిచి, తమిళంలో మరిన్ని విషయాలు అడిగారు. అంత చిన్నపిల్లనైన నాకు స్వామివారు అంత ప్రాముఖ్యత ఇవ్వడంతో చాలా సంతోషపడ్డాను. స్వామివారికి తెలియని విషయం ఏదీ లేకపోయినా వారు ఇలాగే ఇతరులని బాధ్యతతో, ప్రేమతో పలకరిస్తారు. అది ఏడేళ్ళ పిల్లనైనా సరే!

ఆరోజు రాత్రికి మమ్మల్ని అక్కడే ఆశ్రమంలోనే ఉండమన్నారు. అక్కడ ఉండడానికి ఆడపిల్లలకి అనుమతి లేకపోయినా పరమాచార్యుల వారి దయ వల్ల అక్కడ ఉండగలిగాము. మరుసటిరోజు కూడా మాకు ఆ నాటికను ప్రదర్శించే అవకాశం లభించింది.

భోజనం తరువాత, బరువెక్కిన మనస్సుతో మధురై ప్రయాణమయ్యాము.

అక్కడ జరుగుతున్న ఉత్సవం కారణంగా పాండురంగ స్వామిని దర్శించుకోలేదు. కాని మహాస్వామివారిని దర్శించామన్న తృప్తి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మహాస్వామి వారి కరుణా కటాక్షములు ఆశీస్సులే కారణం. ఆ కరుణ సర్వ మానవాళిపై ఉండాలని పరమాచార్య స్వామివారిని ప్రార్థిస్తూ...

--- జె. సుధా, ‘kamakoti.org’ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: