3. హనుమత్ పరివారం కాలండర్ Pavan
3. హనుమత్ పరివారం కాలండర్ Pavan
భక్తులు స్వామిని దర్శించి తమతమ కోర్కెలను నెరవేర్చుకులకొనూటకై అర్చనాదులు జరిపించుకొనుచున్నారు.
అశేష భక్తజనావళి స్వామిని కొలిచి అభీష్టసిద్ధిని పొందారు. పండితులు, పామరులు, విద్యార్థులు, అవివాహి(త)తులు, మంత్రవేత్తలు, స్వామిని సేవించి స్వామి వారి అనుగ్రహ పాత్రులు అగుచున్నారు. ఆయన శక్తి అపారము, ఆమోఘము. ఎంతటి ప్రశాంత స్వరూపమో దుస్వభావుల పట్ల అంతటి ప్రఛండుడు.
హనుమదుపాసకుడు
🔴🙏 హనుమత్ పరివారం 🙏🔴
హనుమంతునకు సుషేణుడు ఛత్రము పట్టును.
మైంధుడు, ద్వివిదుడు చామరుములు ధరింతురు.
మాగధుడు బెత్తము పట్టుకుని నడచును. గంధమాధనుడు ముందు నడచుచు వంశ కీర్తనము చేయును. ద్వివిదుడు వివిధ స్తోత్రములు చేయుచుండెను. పనసుడు పాదుకలను పట్టుకుని హనుమంతుని పాదసేవన మొనర్చును. వృద్ధుడగు జాంబవంతుడు నీతి మార్గము దెల్పుచు హితము జెప్పుచు మంత్రాంగము నెరపుచుండును. సంకటములన్నింటిని పోగొట్టుచు వెడలు హనుమంతుని గవాక్షాది ప్రముఖులందరు అనుగమింతురు. హనుమంతుని వాహనము ఒంటె. చక్కగా అలంకరించిన ఒంటెపై అతడు పంపాసరోవర ప్రాంతమందు విహారించుచుండును.
🔴🙏 హనుమత్ దశ వీరులు 🙏🔴
1. గవాక్షుడు, 2. శరభుడు, 3. నీలుడు, 4.గవయుడు 5. గంధమాదనుడు, 6. నలుడు, 7. గజుడు, 8. ప్రహస్తుడు, 9.దర్థురుడు, 10. వేగవంతుడు.
ఈ దశ విరులు పూర్వముఖమున రక్షకులుగా నుందురు.
🔴🙏 అష్ట మహాబలులు 🙏🔴
1.ఋషభుడు 2. సుముఖుడు, 3. పృధుడు,
4. దధిముఖుడు,5. జ్యోతిర్ముఖుడు, 6. సంపాతి
7. రుంధ్రగ్రీవుడు 8. కేసరి.
ఈ మహానుభావులు ఐదులక్షల కపివీరులతో దక్షిణ తీరమున నుందురు.
🔴🙏 పంచ హరి శ్రేష్ఠులు 🙏🔴
1. మరీచి, 2. కేసరి, 3. రంభుడు, 4. తరుణుడు,
5. గోముఖుడు.
ఈ వానర శ్రేష్టులు పదునాలుగు వేల కపివీరుల గొని పశ్చిమ తీరమున నుందురు.
🔴🙏 కపి విక్రమ చతుష్టయం 🙏🔴
1. సువేషుడు, 2. హరిలోముడు, 3. విద్యుద్దంష్ట్రుడు 4. శతబలి.
ఈ పరాక్రమ శాలురు తొమ్మిది వేల వానర వీరులతో ఉత్తర తీరమున రక్షకులుగ మందురు.
Comments
Post a Comment