క్రియాయోగులు 4
క్రియాయోగులు 4
(గత సంచిక తరువాయి)
''ఏడీ మీ గురువు భోగీంద్రులు, నాయానా రా... నీవల్లనే ఈ బాలుడు ఈ స్థితికి వచ్చాడు'' అని పిలవగా ఆ బాలుడి యోగక్షేమాలు చూడటానికిి సమీపంగా ఉన్న భోగీంద్రులు వచ్చి అగస్త్యుల పాదాలపై పడి ''స్వామీ ఈ బాలయోగి వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది'' అని స్తుతించాడు. ''భోగీంద్రా.... ఎవరీ బాలుడు? ఇతని దీక్షకు కారణణ ఏమిటి?'' వివరించమన్నారు అగస్త్యులు. ''స్వామీ తమకు తెలియనిదా నా విషయం. ఈ బాలుడి విషయం తమకు తెలియదా'' అన్నాడు భోగీంద్రుడు.
''నాకు తెలిసినా తెలియకున్నా విన్నవించండి. విన్న వించడం సంప్రదాయం, మకరి చే చిక్కిన మదగజం ఆర్తి, అచ్యుతునకు తెలియకనా, కౌరవ సభలో అవమానం పొందు సమయంలో ద్రౌపది ఆపద తెలియకనా, వారు ఎలుగెత్తి పిలిచి, తమ అర్తిని విన్నవించాక కరుణించాడు కమలదళనేత్రుడు'' అనగానే ఈ బాలదీక్షపరుని వృత్తాంతం భోగీంద్రులు అగస్తులకు ఇలా విన్నవించుకున్నాడు.
బాల బాబాజీ బాల్యం
క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలలో శాక్యముని, గౌతమ బుద్దుడు అవతరించి, అహింసే పరమ ధర్మం అని ప్రతిపాదించారు.
ధర్మం శరణం గచ్ఛామి
సత్యం శరణం గచ్ఛామి
బుద్ధం శరణం గచ్ఛామి
త్రి రత్నాలను అందించారు. వారి తరువాత 800 సంవత్సరాల తరువాత తన బోధనలు ''నాగా'' అనువారి వల్ల విశ్వవ్యాప్తి చెందుతాయని తెలిపారు. బౌద్ధ నాగార్జునా చార్యుడు అవతరించాడు బౌద్ధమత వ్యాప్తికి తోడ్పడ్డాడు. వారి వల్లే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో, కావేరి నది, హిందూమహాసముద్రంలో సంగమ స్థలంలో పరంగి పట్టి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రసిద్ధ్ధక్రియా కుండలీని యోగం ప్రపంచానికి ప్రతిపాదించిన ఒక మహా యోగి అవతరించారు. క్రీ.శ. 203లో నంబూద్రిపాదులు కుటుంబంలో జన్మించాడు. వాడల గోత్రీకుడు, రోహిణీ నక్షత్రం, వృషభరాశిలో జన్మించాడు. శ్రీకృష్ణుడు మలబారు ప్రాంతం వారు. దేవాలయ అర్చకులైన చాలా సంవత్సరాల క్రిందట ఇక్కడికి వలసవచ్చారు. వీరు శ్రద్ధతో అర్చకత్వ చేసేవారు. పాండిత్యానికి ప్రసిద్ధులు.
ఈ బాలుడికి నాగరాజు అని పేరు పెట్టారు. నాగమ కుండలినికి ప్రతీక. వీరి ద్వారా కుండలిని ప్రాణాయామం వ్యాప్తి చెందగలదని పెట్టారేమో. ఆ గ్రామంలో రావిచెట్లు, మర్రి చెట్లు దండిగా ఉన్నాయి. ప్రతి చెట్టు కింద నాగప్రతిష్టలు చేసి ఉంటారు. నాగదోషం పోవటానికో, కాలసర్ప దోష నివారణకో నాగ ప్రతిష్టలు చేస్తారు. ముఖ్యంగా రామేశ్వరంలో సంతానం లేని వారు నాగప్రతిష్ట చేస్తుంటారు. ఇది మన ఆనవాయితీ.ఈ నాగరాజు బాలుడు కార్తీక పున్నమినాడు అవతరించాడు. కార్తీక దీపోత్సవం, జ్వాలాదీపోత్సవం పర్వదినం. ఆనాడు అజ్ఞాన తిమిరాలను పారద్రోలే దీపోత్సవం.
Comments
Post a Comment