క్రియాయోగులు 6

క్రియాయోగులు 6

(గత సంచిక తరువాయి)

తమ అనుభవాలు, బాల్య కథలుగా స్వామీజీ తమ శిష్యులకు వివరించేవారు. ఒకసారి వారమ్మ మంచి పెద్ద పనస పండు తెచ్చింది. దాని కమ్మని వాసన తేనెలూరే పనస తొనల రుచి సాటిలేనిది. అలాంటి పండు అంటే ఎవరికి ఇష్టముండదు. వారి కుటుంబసభ్యులు అందరూ తినాలని దాచిన ఆ తొనలను బాల నాగరాజు స్వామి లేని సమయంలో చాలా తినేశాడు. తల్లి వచ్చి చూసింది. ఏమీ తెలియని అమాయకునిలా ముఖం పెట్టివున్న మన్నుతిన్న బాలకృష్ణునిలా, వెన్నతిన్న వెన్న దొంగలా ఉన్న ఆ బాలుడిని చూసి ఆగ్రహించి కఠినంగా దండించింది. దాదాపు అలసిపోయినా స్పృహ తప్పేదాకా కొట్టింది. చిన్న తప్పుకే ఇంత దండన విధించిన ఆ తల్లిపై మమకారం తగ్గింది. అనుబంధం అంతరించింది. తల్లిదండ్రుల ప్రేమ దూరమైనట్లు తోచింది. ఇది ఒక దైవ ప్రేరితమో లేక వైరాగ్యానికి నిర్దేశయో, యోగ మార్గానికి అనుబంధమేమో. ఈ బాలనాగరాజు సామి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న కాలంలో ఆ పరంగిపట్టి ఆలయంలో గొప్ప ఉత్సవం జరుగుతోంది. నలుమూలల నుంచి వేలాది జనం 
తిరునాళ్లకు వచ్చారు. ఎక్కడ చూసినా సందడి, కోలాహలం, బాజా భజంత్రీలు, భజనలు, అంగళ్ల సందడి. ఈ బాలనాగరాజు ఆలయ ద్వారం ప్రక్కగా ఈ వినోదం చూస్తూ నిలబడి ఉన్నాడు. బాలుడైనా చూడముచ్చటగా ఉన్నాడు. ఆ కళ్ళలో ఏదో అనిర్వచనీయమైన కాంతి, ఒక్కసారి చూడగానే కళ్ళు మరల లేనంతగా ఆకర్షణీయంగా ఉన్నాడు. అప్పుడొక విదేశీయుడు బెలూచీస్తాను మహ్మదీయుడు, ఈ బాలుని చూసి, ఈ బాలుని అమ్ముకుంటే బాగా లాభం గడించవచ్చని భావించి, ఆ బాలకుడిని చేయి పట్టి బలవంతంగా ఈడ్చుకుని పోయాడు. సమయానికి ఎవ్వరూ విషయం గమనించలేదు. ఆ వ్యాపారి ఈ బాలుని మైకంలో పెట్టి పడవలో చాలా దూరాన ఉన్న ఉత్తర భారతదేశంలోని వంగదేశ నగరం కలకత్తా తీసుకొని వెళ్లాడు. అక్కడ ఒక ధనంతునికి అమ్మాడు. కాని ఆ యజమాని మంచివాడు. దయ గలవాడు, ఈ బాలుని దైవత్వం, ఆకర్షణ గ్రహించి ఇతనిని స్వేచ్ఛగా వదిలేశాడు. సరే ఎక్కడికిపోతాడు, ఎక్కడికి పోవాలో ఏం తెలుసు. కానీ ఈ సంఘటన వల్ల ఈ బ్రాహ్మణ బాలునికి ఆచారం, వ్యవహారం, నియమం, నిష్ట చెదిరిపోయాయి. దాదాపు సన్యాస స్థితి కలిగింది.  సంచార పద్దతి అలవడింది. సంసారాన్ని ఆచార వ్వవహారాన్ని వదలి ఏదో సాధిద్ధామని, పుణ్య స్థలాలు, తీర్ధయాత్రలు సందర్శించాలనే వారు కొందరు ఉండేవారు. వారిని బైరాగులని, సన్యాసులనే అనేవారు. కొందరు కాషాయవస్త్రా లు 
ధరించేవారు. పగలు ఏ గృహస్తులో అన్నం ఇస్తే అన్నపూర్ణ అర్పితమిని, పాత్రలలో సేకరించి, తాము తిని మిగిలింది అన్నార్తులకు పెట్టేవారు. రాత్రికి ఏ గృహస్తుల పంచలోనో, సత్రాలలోనో, చావిళ్ళలోనో, దేవాలయ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకునేవారు. అందరూ చేరినప్పుడు గృహస్తులతోనో, సజ్జనగోష్టి చేసేవారు. తమ అనుభవాలు చెప్పుకొనేవారు. తీర్ధయాత్ర విశేషాలు వివరించేవారు. అట్టి సంచార కాలంలో వివిధ ప్రాంతాలు వారి ఆచార వ్యవహారాలు తెలుసుకునేవారు. కొందరు మంచివారు తగలొచ్చు, చెడ్డవారితో కలయడం జరగవచ్చు.
ఒక సంచార సాధువు ఒకనాడు ఒక కుటుంబీకుల ఇంట అతిధ్యం స్వీకరించాడు. వారి ఇంట నిద్రించాడు. ఉదయం లేచి వెళ్తూ ఆ గృహస్తులకు ఇంట కొన్ని విలువైన వస్తువలు సంగ్రహించి వెళ్ళాడు. జల తీరం చేరి కాలకృత్యాలు తీర్చుకున్నాడు, స్నానం, జపం కానిచ్చాడు. ఇక బయలుదేరబోతూ జోలె అందుకున్నాడు. బరువుగా ఉంది, ఏమిటా అని లోన చెయ్యి పెట్టి తీసి తనవి గానివి కొన్ని ఉండటం గమనించాడు. ఆ రాత్రి తనకు అతిధ్యమిచ్చిన వారింటి సామానులు ఉన్నాయి. నేనే తెచ్చాను. ఎందుకు తెచ్చాను. ఎన్నడూ లేనిది ఇలా తేవాలనే దుర్భుద్ది ఎందుకు కలిగింది. ఎలా కలిగింది? అని ఆలోచించాడు. ఏమైనా అవి గృహానికి అందజేయడం తమ ధర్మం అని భావించాడు. దొంగ అని అనుకుని తిట్టినా, నేరం తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పే కదా. శిక్ష అనుభవించవలసిందే కదా అని భావించాడు. తిరిగి ఆ ఇంటికి వెళ్లి జరిగింది పొరబాటు అని క్షమించమని ప్రార్ధించి తిరిగి ఇచ్చాడు. కాని తనలో సందేహం... ఈ చోర బుద్ధి ఎందుకు కలిగింది అని నివృత్తి చేసుకోవాలని తలచాడు. ‘‘తల్లీ నన్ను క్షమించు అడిగానని అన్యధా భావించకు మీ యజమాని, జీవనోపాధికై ఏం చేస్తుంటాడు’’ అని అడిగాడు. అందుకు ఆమె సంకోచపడుతూ దొంగతనం వారి వృత్తి అంది. ‘‘కొంప ముంచావు గదమ్మా, మీ సొమ్ము మీవారి ఆర్జనం ఒక్కరాత్రి తిన్నంత మాత్రాన నా బుద్ధి కలుషితమైనది. నాకు చోర బుద్ధి కలిగింది. అన్యాయార్జితమైన విత్తం అనుభవించినందున ఎలా బుద్ధి మారుతుందో గమనించు తల్లీ!’’ అని ఆమెకు చెప్పి తన దోవన వెళ్ళాడు ఆ సంచార స్వామి.

(మిగతా వచ్చే సంచికలో)

 6

Share

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: