క్రియాయోగులు 23

క్రియాయోగులు 23

 

Share



(గత సంచిక తరువాయి)


బంధాలు వీడాయి


గురుగోవింస్వామి బ్రహైక్యం చెందారు. తన నిర్యాణం తెలిసిన స్వామి వాసుదేవులను పిలిచి, తన పుస్తకాలను ఉపనిషత్తులు, సాలిగ్రామాలు అప్పచెప్పారు. అనారోగ్యం కలిగింది. మన్యుసూక్తం పారాయణం చేశాడు. వాసుదేవులు పారాయణం చేస్తుండగా స్వామి విశదీకరించారు. వాసుదేవుని ఆశీర్వదించారు. ఇక కాల సమీపించిందని స్వామి, వాసుదేవుని వద్దకే ఉండమన్నారు. ఆ స్వామి నిర్యాణానికి మౌనస్వామితో సహా భక్తులంతా దుఃఖితులైనారు - అక్కడి ఆచార ప్రకారం స్వామి భౌతిక దేహాన్ని కృష్ణానదిలోకి విడిచారు. అంత్యక్రియలు వాసుదేవులే చేసి గురు ఋణం తీర్చుకున్నాడు.
తరువాత వాసుదేవులకు ఉత్తరదిశగా పయనించమని ఆదేశం అందింది. వాడిలోని పెద్దలు, ముని స్వామి వద్ద సెలవు తీసుకుని, కొల్హాపూరు, పండరీపూరి, బార్షి నుంచి గంగాఖేడ్‌ చేరారు. అక్కడ భార్యకు కలరా తగిలింది. 1891 వైశాఖ బ. చతుర్ధశిన వాసుదేవుల సతీమణి వీడిపోయింది. ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ - ఆమె అంత్యక్రియలు చేశాడు. ఆ బంధం కూడా పోయింది.
సన్యాసం తీసుకోవాలని సంకల్పానికి ఉన్న ఒక్క ఆటంకం తొలగిపోయింది. వాసుదేవుని కూడా కలార తగిలింది. ఇలా తన కోరిక తీరకుండానే చచ్చిపోతానేమో, అని దైవాన్ని ఏమయ్య! ఎందుకిలా చేస్తున్నావు అన్నాడు. దైవ సంకల్పం, భార్య మరణించిన 14 రోజలుకు తేరుకుని సన్యాసం స్వీరించారు.

వాసుదేవానంద సరస్వతి

పరమహంస పరిత్రాజక వాసుదేవానంద సరస్వతి స్మామి మహారాజ్‌ సన్యాశ్రమం భార్య మరణించిన 14వ రోజున వాసుదేవులు సన్యాసం స్వీరించారు. ఆ రోజు ముందు రాత్రి, దత్తదేవులు దర్శనచ్చి, ప్రణవ మంత్రోపదేశం ఇచ్చారు. లేకర్‌ ఇండ్లలో భిక్షతో ఆహారం తీసుకొమని అన్నారు. ఇతరం భోజనం వలదు అన్నారు. మరునాడు గోదావరి తీరంలో ఉచిత కర్మలు బ్రాహ్మణులచే చేయించుకునే సమయంలో నదీతీరంలో ఒక సన్యాసి దర్శనమిచ్చి వాసుదేవునకు సన్యాసం ఇచ్చారు. అలా వారికి సన్యాసి కావాలనే వాంఛ తీరింది. గృహస్తాశ్రమం తరువాత సన్యాసాశ్రమంలో ప్రవేశించారు. 
అప్పటినుండి పరమహంస పరిత్రాజక శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి మహరాజు అయినారు. ప్రభువు అనుమతి ప్రకారం ఉజ్జయినీ చేరి, నారాయణానంద సరస్వతి వారిచే, సన్యాసం తీసుకుని దండధారి అయినారు. పాదచారియై, ఉజ్జయినీ నుంచి రాషిం, ఉమర్‌ఖేడ్‌, మాపబార్‌, కాంఢ్యాం, బాధవాయి, ఓంకారేశ్వర్‌, మండలేశ్వర్‌, బాలవాడ, సంచారం చేశారు. అంతకు ముందే నారాయణానందులు, వారి గురువు అచ్యుతానంద సరస్వతి అనుమతిచే, వాసుదేవులకు సన్యాసం ఇచ్చి, యోగ పట్టామిచ్చి, వాసుదేవానంద సరస్వతిగా నామం స్వీకరించారు. ఆ రోజ ఆ మఠంలో ఆహారం స్వీకరించారు. అది గురువు ఆనతికి విరుద్ధం. అందువల్ల వమనం చేసుకున్నారు. నారాణానందులు, దత్తులను క్షమించవేడుకోగా ఉపశమించారు అలా దత్త ప్రభు ఆనతిని పాటించేవారు. అందు విరుద్ధమైన శిక్ష అనుభవించేవారు. స్వామి ఉజ్జయినీ పీఠంలో చాతుర్మాసాలు గడిపారు. 
దత్త గురువుల ఆదేశానుసారంగా, భారతదేశమంతా పర్యటించి, వేద ధర్మాలను, వర్శాశ్రమ ధర్మాలను ప్రభోదించారు. అలా 23 సంవత్సరాలు సన్యాసిగా, ధర్మం పాటించారు. వారి ఆ కారి అనుభవాలు ఎన్నో చిరస్మరణీయం.

సన్యాసిగా...

వారికున్న నాలుగు పంచెలు రెండు తుండు గుడ్డలు, వేదాంత గ్రంథాలు, దండం, కమండలం - ఒక ఉన్ని దుప్పటి, సంధ్యావందనపాత్ర, దత్త విగ్రహాలు, రెండు నీళ్ళుతోడుకోవడానికి చేంతాడు, కాగితాలు కలం అంతే ఉన్నవి. పాత్రలు, గుడ్డలు తానే శుభ్రంగా చేసుకునేవాడు. కాని ఎవరి సాయం తీసుకునేవారు కాదు. ఎవరూ తాకరాదు. పొరబాటున తాకితే, కాలకృత్యాలు తీర్చుకున్నా, మరల స్నానం చేసేవారు. కాలి నడకన ప్రయాణం చేస్తూ వీలైనంత వరకు బస్తీలు వదలి, నదీతీరం వెంట పోయేవారు. అడవులు, నదులు, కొండలు, చలి, ఎండల్లో ఒకే వస్త్రంతో సాగేవారు. ఒకసారి గంగలో స్నానం చేసి, చలికి కొంగర్లుపోయి దాదాపు అచేతనం కాగా, చూచిన ప్రజలు మంటకు చేరువ చేసి కాపాడారు. సన్యాసికి సామాన్యంగా నిప్పుతో కాచుకోకుడాదు. గృహస్తులో ఇంట్లో కాక వీలైనంత వరకు ఆలయ మంటపాలలో ఉండేవారు. రోడ్డు, రైలు మార్గాలకు దూరంగా దత్తులవారు దారి చూపగా సాగిపోయేవారు. దత్తుల వేరే మహనీయులలో, అశ్వత్తారు వంటి వారో మార్గదర్శకులు.
తప్పని సరి అయినప్పుడు మాత్రమే ఒక రోజు ఉండేవారు. వానాకాలం మాత్రమే తప్పకపోయేది. ఆ వానాకాలమే చాతుర్మాసాలు కదా. 23 చతుర్మాసాలు, ఏ మారుమూల గ్రామాల్లోనో, క్షేత్రాల్లోనో గడిపేవారు. అలాంటి చోట, అంటు రోగాలు ఎదుర్కోవలసి వచ్చేది. స్వామి, సామాన్య రూపులు, సరాసరి ఎత్తు, నలుపు రంగు వారి సంభాషణం వినే దాక వారి రూపంలో ప్రత్యేకత కనిపించేది కాదు. గళం విప్పితే సమ్మోహనమే, దయార్ద్రత, ప్రియత్వంతో వారు, అందరికీ సులువుగా వేదాంత వైరాగ్యాలు విశదీకరించేవారు. వారు భాష పటిమ విషయ విశదీకరణ, శాస్త్రాలపై వారి పట్టు అనన్యంగా ఉండేది. వారి ప్రభోదాలకు ఎందరో వశ్యులై భక్తులైనారు. స్వామి తమ గురువు మార్గదర్శిగా శ్రేయోభిలాషిగా భావించేవారు. ప్రతి దినం వాసుదేవానందులు బ్రహ్మ ముహూర్తానా లేచి కాలకృత్యాలు తీర్చుకొని, ప్రాతః స్నానం చేసేవారు. ప్రతిరోజు మూడు సార్లు తప్పక స్నానం చేసేవారు. యోగదండమునకు నమస్కరించి, ప్రణవకారునకు మనస్సులో నమస్కరించి, దత్త విగ్రహాన్ని అభిషేకించేవారు. విభూతిని అలంకరించేవారు. సన్యాస యోగులు పూలు, తులసి, బిల్వాయి, స్వయంగా కోయరాదు, ఎవరైన తెచ్చినవి మాత్రమే పూజ చేయవచ్చు. ఉదయం విద్యార్థులకు భోధనతో గడిచేది. స్వామిసర్వ విద్యాపారంగతులు, సంస్కృతము, వేదాంతం, ఆయుర్వేదం అను ఆరు వేదాంగములతో నిష్టాతుడు. అవే గాక కవిత్వం, సంగీతము, బట్టలు నేతలతో నేర్పరి. చదరంగం చూడకుండా ఆటలో సలహాలు ఇచ్చేవారు. అందువల్ల అంతం లేని విజ్ఞాన నిధి. అన్ని రకాల విద్యార్థులకు బోధన చేయగల సమర్ధుడు.
ఒకసారి నరసోబావాడిలో ఒక విప్పుడు, అన్ని విద్యలలో నేర్పరిని అని గర్వంతో స్వామి వద్దకు వచ్చి స్వామి పాదుకల సన్నిధిలో వేదగానం చేయమని బలవంతం చేశాడు. ముందు తానే పాడి చూపుటకు చూడు అని ప్రారంభించాడు. కాని ఒక ముక్క జ్ఞప్తి రాలేదు. స్వామి వేదాలు తానే గానం చేయగా, ఆ విప్నుఇ గర్వం అణిగిపోయింది. అపరాహ్ణ వేళ స్మామి భిక్షకు వెళ్ళినాడు. సన్యాసి తాను వండుకోరాదు. మదధకరం చేయాలి. స్వామి మూడు లేక అయిదు గృహాలలో భిక్ష తీసుకునేవాడు. దక్షిణ బ్రాహ్మణ గృహాలలో తీసుకునేవారు. ఇంటింటి తిండి స్వామి విరోచనాలు, ఆరోగ్యము పాడు చేశాయి. కాని స్మామిని దిన కృత్యాలు, ప్రయాణం ఆటంకం పరుచలేదు. భిక్షా సమయంలో ఎవరైనా నమస్కరిస్తే ఆ రోజు ఉపవాసమే. ఒక్కోసారి ఏకాదశి పొడిగింపబడేది. ఆ ఉపవాస దినాలలో ఒక గ్లాసు మజ్జిగ కానీ, ఒక పండు గానీ తీసుకునేవారు. కాని బలహీనం కాలేదు. భిక్షతోనే సేకరించిన అన్న మూటను నదీ జలంలో ముంచి వేలాడతీసీ ఉంచేవారు. ఆ నీరంతా ఒడిసిపోగా అన్నంలో దోషం పోగా, రుచి లేక ఉన్న అట్టి ఆహారంమే తినేవారు. సన్యాసి ఏ రుచి ప్రలోభాలకు తావివ్వక, కడుపు మాత్రమే నింపుకోవాలె. సేకరించిన ఆ ఆహారం మూడు భాగాలుగా చేసి ఒక భాగం నదిలో, ఇంకో భాగం ఆవుకూ, ఇచ్చి మూడవ వంతు తినేవారు. ఆ ఆహారం కూడా ఎనిమిది ముద్దలు మాత్రమే రోజుకు ఒకసారి తినేవారు. మధ్యాహ్నం తరువాత ఆధ్యాత్మిక సలహాలు, వ్యక్తిగత సమస్యలు నివారణోపాయాలు, ఓపికగా విని, విసుగు లేకుండా చెప్పేవారు. సాయంత్రం సంధ్య తరువాత, పురాణ పఠనం, వివరంగా సోదాహరంగా, సులువుగా అందరికి అర్థమయ్యే తీరులో చెప్పవారు. వేదమంత్రాలు శ్లోకాలు ఉదహరించేవారు. వినేవారి చేత పలికించేవారు. పురాణ ప్రవచనం తరువాత భజన సంకీర్తన చేసేవారు. మరలా ఆర్తులకు సలహాలు ఇచ్చే సరికి అర్థరాత్రి దాటేది. కాల కాలమే నిద్ర, విశ్రాంతి. వారికి అప్ప నిద్ర, అల్పాహారం చాలు. మాములు మానవుల అవసరాలు వారికి వర్తించవు.



Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: